ఓ అభిమాని లేఖ

Sarath Garu, 

This is [Edited] from [Edited]. Last Friday I accidentally came across one of your blog post.

That's it. I spent the whole weekend going through your blog end to end.
I don't really know what it was, your frankness or truthfulness or your writing style. But I could not help it. I went through end to end.
The weekend was truly like "Verasi Naaku Manollasam" 
Thank you very much for such a wonderful blog.
Keep posting more often.
Please point me if you have any other works of yours that is not included in the blog.
Regards

,
[Edited]


వెకేషనులో వున్నా - తీరికలేదు. అందుకే ఈరోజే వచ్చిన ఈమెయిల్ ప్రచురిస్తున్నా. ఇంకా వారికి రిప్లయ్ కూడా ఇవ్వలేదు - అనుమతి కూడా తీసుకోలేదు. అందుకే వారి వివరాలు ఎడిట్ చేసి ఇస్తున్నాను. 

ఇక కిక్కే కిక్కు! తధాస్తు!

కొన్ని నెలల క్రితం దాకా పొద్దునే లేవగానే ప్రకృతి పిలుపులకి హాజరు అవుతూ ఎదవ జీవితం అని నాలో నేను పళ్ళు నూరుకునేవాడిని. ఈమధ్య కొన్ని పుస్తకాలు చదివాకా అది ఎంత దరిద్రమయిన విషయమో అర్ధం అయ్యి తీరిగ్గా నాలుక్కరచుకున్నా. మన మనస్సు తధాస్తు దేవత లాంటిది. ఎలా అనుకుంటే అలాగే పాటిస్తుంది - అలాంటి సూచనలే మనకు ఇస్తుంది - అలా మన జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితం ప్రస్తుతం ఎలా వున్న పలు విధాలుగా గొప్పగా వుందనుకోవాలి. గొప్పదనాలను వెలికితీసి మనకు మనం సెబ్బాసో అనుకోవాలి. మనం ఎలా అవాలనుకుంటున్నామో అలా అయిపోయినట్లు గాఠ్ఠిగా అనుభూతి చెందాలి. అప్పుడు అప్పుడు... అలాగే అవుతాం మరీ. అలా ధనాత్మకంగా ఆలోచిస్తున్న రోజుల నుండీ నా జీవితం అద్భుతంగా సాగుతోంది. ఇంకా ఒకటి రెండు విషయాలు దారిలోకి రావాలనుకోండి - వస్తాయి. రాకపోయినా దిగుల్లేదు - అలాంటివి వంద సాధించుకునే సత్తా నాలో వుందిప్పుడూ. 

సెబాశ్ రా శంకరా! ( మా అమ్మమ్మ నన్ను అలాగే పిలిచేది). 

సో, పొద్దునే లేవగానే మీ జీవితాన్ని మీరు తిట్టుకుంటున్నారో, మెచ్చుకుంటున్నారో ఓ సారి తర్కించుకోండి. తిట్టుకుంటున్నట్లయితే ఎక్కడొ ఏదో లోపం వుందనే కదా అర్ధం. సవరించుకోవాలి మరీ. నన్ను చూసి నేర్చుకోండేం. మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా, మెచ్చుకోకుండా ఉదాసీనంగా వుందా మీ జీవితం? హ్మ్. అలా అయితే ఎలాగండీ బాబూ. మనకున్న జీవితం కొద్దిదే. అది మనం అనుకున్నట్లు చచ్చినట్లు జరగాల్సిందే.

మన అంతఃచేతనకి ఏది జోకో ఏది నిజమో తెలియదు. మనం అనుకున్నది మనం పాటించేలా చూస్తుంది. అందుకేనేమో మన పూర్వీకులు సరుకులు ఏవయినా అయిపోతే అయిపోయాయని అనేవారు కారు. సరుకులు లేదా డబ్బులు 'నిండుకున్నాయి' అనేవారు! 

అప్పటినుండీ సమృద్ధిగా వుంటున్నాం

కొత్త పద్ధతులు పాటించడం మొదలెట్టిన దగ్గరి నుండీ మేము అనుకున్న విషయాల్లో సమృద్ధిగా వుంటున్నాం. అలా అని మేము ఏది అంటే కొనగలుగుతున్నామని కాదు గానీ అవసరాల మేరకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం లేకుండా జీవితం గొప్పగా నడుస్తోంది.

మా ప్రాజెక్టు వచ్చే ఏడాది చివరకంటా నడిచేసే పరిస్థితి వుంది కాబట్టి అర్జెంటుగా మరో ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి తప్పింది. అందువల్ల ఇక మళ్ళీ ఇంగ్లీషులో నా నవలా రచనను (ముందుగా తెలుగులోనే వ్రాస్తాను - పత్రికలకీ పంపిస్తాను) మొదలెడుతున్నాను. అదీ నేను ఇప్పుడు బాగా ఆలోచిస్తున్న, ఆచరణలోకి పెడుతున్న లా ఆఫ్ ఎట్రాక్షను గురించిన థ్రిల్లర్. ఆ నవల ఇలా మొదలవుతుందీ - కీర్తి అనే అమ్మాయికి స్వీట్ సిక్స్టీన్ పార్టీలో తన అభిమాన అంకుల్ 'The Book' అనే పుస్తకాన్ని బహుమతిగా ఇస్తాడు. అప్పటినుండీ తన జీవితం చిత్ర విచిత్రమయిన మలుపులు తిరుగుతుంది.  

నా జీవితానికి నేను గీసుకున్న స్కెచ్ ప్రకారం 2017 వేసవి నుండీ హాయిగా expedition cruiese లలో గడిపేస్తూ, నవళ్ళు వ్రాస్తూ గడిపేస్తుండాలి. య్యా. గడిపేస్తాను. అందుకోసం ఇంగ్లీసులో రచయితగా విజయం చెందాలి. వాస్తవానికి నేను గొప్ప రచయితనే - కాకపోతే ప్రపంచమే గుర్తించాల్సివుంది. శరత్ ఏంటిలా స్టయిల్ కొడుతున్నాడూ అనుకోకండి. విజయవంతంగా ఆలోచిస్తున్నా - అలాగే ఆలోచించాలీ - అలా నా ఆలోచనలను మీమీద రుద్దేస్తున్నా. నా విజువలైజేషను కోసం ఈ బ్లాగునీ మరియు మిమ్మల్నీ ఉపయోగించుకుంటున్నా అంతే. నా లగ్జరీ క్రూయిజ్ ల కోసం ఒక క్రూయిజ్ లైన్ నిర్ణయించాను. www.silversea.com 

2016 మార్చి లో అనగా ఇంకో నాలుగు నెలల్లో లగ్జరీ SUV తీసుకోవాలని నిర్ణయించాను - అది ఇప్పటికే నా మనస్సులో సిద్ధించింది - ఇక భౌతికంగా నా ముందు సాక్షాత్కరించాల్సి వుంది అంతే. అందుకు సరిగ్గా పరిస్థితులు సమకూడుతున్నాయి. మా ఫ్రిజ్ మీద నాక్కావాల్సిన కారు బొమ్మని అతికించేసుకున్నా. మా Ford Escape SUV నడుపుతూ  Lexus GX నడిపేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంటా. నేననుకునేవి నాకు కావాలంటే అవి ఆల్రెడీ నాకు అందేసినట్లుగా ఫీల్ అయిపోవాలంతే. వెనకాల వాటంతట అవే వచ్చేస్తాయి లెద్దురూ. 

దాదాపు నాలుగు రెట్ల బోనస్

మా ఫర్మ్ లో పెద్దగా బోనస్ ఇవ్వరు లెండి. ఆయినా సరే క్రితం సారి కంటె రెండు రెట్ల బోనస్ అయినా వస్తుందని ఆశించాను. అయితే దాదాపుగా నాలుగు రెట్ల బోనస్ వచ్చింది. నిజమో భ్రమో కానీ లా ఆఫ్ ఎట్రాక్షన్ పనిచేస్తున్నట్లుగానే వుంది. ఇంకా ఇలాంటివే ఎన్నో మెరుగుదలలు. ఇలాగే 2016  నుండి డబ్బు ఇక వరదలై నా ఖాతా లోకి పారాల్సి వుంది. 

నా బరువు ఎంచక్కా 53 కిలోలు సరాసరిగా వుంటోంది. బాడీ ఫ్యాట్ ఎంతవుందో ఈ మధ్య తీరికలేక చూసుకోలేదు. బరువు అంతకంటె తగ్గొద్దని మా ఆవిడా, మా స్నేహితులూ కోరారు. సో సరాసరిగా అక్కడితో ఆపేసా. క్రిస్మస్ సెలవుల తరువాత ఇక ఫ్యాట్ ఇంకా బాగా తగ్గిస్తాను. 

కంప్యూటర్ వాడకం తక్కువయ్యింది కాబట్టి ఐఫోన్ 6S ప్లస్ నుండి బ్లాగు వ్రాయడం ప్రాక్టీసు చేస్తున్నా. అందువల్ల ఇలా కొంత కాలం నా పోస్టులు క్లుప్తంగా వుంటాయీ.