పాజిటివ్ తరంగాలు

ఈమధ్య చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. పాజిటివ్ మైండ్ సెట్ తో వున్నందున నాకు అవే కనిపిస్తున్నాయేమో. మంచిదే కదా. మా అమ్మాయి స్కూల్లో మంచి గ్రేడ్స్, మంచి రివ్యూస్ తెచ్చుకుంది. చక్కటి ఆత్మవిశ్వాసంతో చురుకుగా వుంటోంది. అబ్బెబ్బే, చాలామంది దేశీల్లాగా మేము క్లాసు ఫస్ట్ గట్రా రావాలని టార్చర్ ఏమీ పెట్టం లెండి కానీ మొదటి గ్రేడులో అయినా వుండాలని ప్రోత్సహిస్తాం. డాక్టర్లూ, ఇంజినీర్లూ కావాలనే ఒత్తిడి ఏమీ వుండదు. వాళ్ళకు ఏది ఇష్టమయితే అదీ.

మా అమ్మాయి బరువు ఎక్కువ. తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. పిల్లలని డైటింగ్ చేయించకుండానే బరువు తగ్గించాలి. ఈమధ్య రెండు మూడు నెలలుగా బరువు నిలకడగా వుంటోంది, పైగా ఎత్తు పెరుగుతోంది. వారం వారం తన బరువు చూసి క్యాలెండర్ మీద రికార్డ్ చేస్తుంటాను. గత వారానికి ఈ వారానికీ ఒక కిలో బరువు తగ్గింది. నమ్మలేకపోయాను. మరో రెండు సార్లు చూసాను. కరెక్టే.

బరువు అంటే గుర్తుకు వచ్చింది. కొన్ని వారాల క్రితం ఒక చిన్న ప్రయోగం చేసాను. ఇక్కడి సన్నిహిత కుటుంబాలను ఒక రెక్వెస్ట్ చేసాను. ఏంటంటే వాళ్ళు మా చిన్నమ్మాయి కనపడ్డప్పుడల్లా 'బరువు తగ్గుతున్నావే భలేగా' అని వ్యాఖ్యానించాలి.  ఎందుకంటే తనలో బరువు ఎక్కువగా వున్నానన్న బిలీఫ్ సిస్టమ్ నాటుకుపోయింది. దాన్ని తొలగించి పాజిటివ్‌గా తన నమ్మక వ్యవస్తను  ప్రోగ్రామ్  చేసేందుకై అలా చేసాను. ఆడవాళ్ళందరూ భలేగా సహకరించారు. "ఏంటే, బరువు బాగా తగ్గావు కదా" అని కనిపించినప్పుడల్లా పాజిటివ్ సజెషన్ ఇచ్చారు. ఒక్కరంటే నమ్మకపోయేదేమో గానీ  అలా  నలుగురు అన్నప్పుడు ఇహ నమ్మక తప్పుద్దా? నమ్మేసింది :) అప్పటినుండీ కాన్‌ఫిడెంటుగా వుంటూ వచ్చింది. తను బరువు తగ్గడంలో మిగతా కారణాలతో బాటుగా ఆ పాజిటివ్ ప్రోగ్రామింగ్ కూడా పనిచేస్తుండాలి. ఒక్క వారంలొ ఒబేసిటీ దశ నుండి అధిక బరువుకు దశకు వచ్చింది. ఇంకా పది కిలోలు తగ్గితే అధిక బరువు నుండి సాధారణ బరువుకి వస్తుంది.

మీలో కూడా ఎవరయినా బరువు తగ్గాలనుకుంటే ముందు మీరు తగ్గినట్టుగా గట్టిగా నమ్మెయ్యండి. మనస్సు ఆ అవాస్తవాన్ని అంగీకరించడానికి మొరాయించినా సరే అలా సూచనలు ఇచ్చుకోండి. అలా కొద్దిరోజులు చేసాకా మీకే ఆకలి తక్కువవుతుంది, ఆరోగ్యకరమయిన ఆహారం తినాలనిపిస్తుంది, వ్యాయామం చెయ్యాలనిపిస్తుంది. వివరాల కోసం సెల్ఫ్ టాక్ పుస్తకాలు కానీ పాజిటివ్ సజెషన్స్ గురించిన పుస్తకాలు కానీ చదవండి.

నేను కూడా చిన్న చిన్నగా ఎదుగుతున్నాను. తెలుగులో రచయితలకి అంత ఆదరణ లేదు కాబట్టి ఇంగ్లీషులో రచయితగా ప్రయత్నాలు చేస్తాను. ప్రాక్టీసు తప్పింది కాబట్టి ముందు అయితే తెలుగులో మొదలెట్టా. పూర్తి అయ్యాకా తెలుగు పత్రికలకి పంపించి చూస్తా. ప్రస్థుతానికి అయితే ఒక థ్రిల్లర్ మొదలెట్టా. అది ఉత్సాహంగా నడుస్తోంది. అయిపోయాక కొద్దిమందికి పంపించి వారి అభిప్రాయాలు తీసుకొని సవరిస్తాను. 

ఇంకా చిన్నా చితకా మార్పులు ఏవో వున్నాయి లెండి. కొన్ని లేవు - కారణం ఆ మార్పుల మీద నాకు అంత ఆసక్తి లేదు, ఫోకస్ లేదు.  

9 comments:

  1. మీరు ఇంగ్లీష్ రచయితగా మరినా మీ బుక్స్ ని తెలుగులో కూడా రిలీజ్ చేయండి :)

    ReplyDelete
  2. Nice job sarat garu.Mee maata nammi 'What to say when you talk yourself' book order icchanu. :)

    ReplyDelete
  3. మీరేమో సన్నగా పొడుగ్గా ఉండే అమ్మాయిలను ఇష్టపడతానని వ్రాసారు. మీ అమ్మాయి అంత బొద్దుగా తయరయ్యేదాకా ఎందుకూరుకున్నారు ?

    ReplyDelete
  4. @ రాము
    తప్పకుండా. నా ప్లాన్ కూడా అదే.

    @ శశి
    ఆ పుస్తకం నచ్చితే నలుగురికీ చెప్పండి - నచ్చకపోతే నాకు చెప్పండి. పుస్తకాలు కొనేముందు అమెజాన్ లో గానీ మరో చోట గానీ సమీక్షలు చదివి కొనడం ఉత్తమం. ఎందుకంటే నాకు నచ్చింది మీకు ఎందువల్లనన్నా నచ్చకపోవచ్చు కదా.

    @ నీహారిక
    నిజానికి మీరు అడిగిన దాని గురించి వ్రాసి మళ్ళీ తీసేసాను - అంతకూ ఎవరయినా అడిగితే చెబ్దాంలే అని. కదా! ఆరోగ్యం, ఆహారం మీద అంత అవగాహన నాకు వుండగా మా అమ్మాయి అలా అవడం నాకే చిత్రం గా అనిపిస్తుంటుంది. దాని పొరపాటు కొద్దిగా కూడా లేదు! పిల్లలు - వాళ్ళకేం తెలుసండీ! ఒక్క ముక్కలో మీ ప్రశ్నకి జవాబు ఏంటంటే నా నిస్సహయత! ఇందులో పరిస్థితులు కాస్తో కూస్తో మెరుగవుతున్నాయి.

    ReplyDelete
  5. గురూజీ.. మీరు మీ ఈ కాన్సెప్టు ని మీ పొట్ట పై ప్రయోగించగలరా!!.. పొట్ట ఫొటో మీతో.. ఇప్పుడూ, ఇంకో నాలుగు నెలల తరువాతా ఎలా ఉందో పోస్టు చేయగలరా??

    ReplyDelete
  6. @ కాయ
    చూసేరా, నేను మీ గురించీ, నా పొట్ట గురించీ, దానిమీద మిమ్మల్ని ప్రస్థావిస్తూ వేసే పోస్టు గురించీ ఆలోచిస్తున్నానో లేదో మీ కామెంట్ వచ్చి పడింది. 7 నెలలు క్రితం మీ వేళాకోళం గుర్తుంది సుమండీ. అప్పటినుండీ కనీసం మీకోసమయినా అవస్థపడుతూనే వున్నా తగ్గించడానికి. ఆ మధ్య కొంత తగ్గి మళ్ళీ ఆగింది. ఇప్పుడిప్పుడే ఆ టెక్నిక్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. వివరంగా పోస్టుగా వ్రాస్తా.

    ReplyDelete
  7. మొన్న కసీనో లో జరిగింది నాకు కూడా.. ఈ అనుభవం.. బ్లాక్-జాక్ లో రెండు ముక్కలూ కలిపితే ఇరవై వస్తే, రెండూ ఒకే రకం వచ్చినా, ఒకే ఫిగరు వచ్చినా పెట్టిన బెట్టుకి కొన్ని రెట్లు ఎక్కువ వస్తుంది మనీ.. నాకు ఏదో సిగ్నల్ వచ్చినప్పుడల్లా పెట్టిన అన్ని సార్లూ వచ్చింది.. మధ్యలో కొన్ని సార్లు నేనే కల్పించుకుని పెట్టినప్పుడు రాలెదు.. ఒకసారి సిగ్నల్ వచ్చినప్పుడు ఏమౌతుందో చూద్దం అని బెట్టు పెట్టలే.. అప్పుడు 125రెట్లు వచ్చే అవకాశం పోగొట్టుకున్నా.. అది కొన్ని వేలల్లో ఒకరికి వస్తుంది.. రెండు ముక్కలూ క్వీన్స్ మరియు రెండూ హార్ట్స్. నేను బెట్టు పెట్టకపొవడము ఆశ్చర్యం అనిపించలేదు కని ఇలా నాకు ముందే సిగ్నల్ రావడము వింతగా అనిపించింది... అదే ధ్యానావస్థ అనిపిస్తుంది.. మన పెద్దాయన రేడియో నేను గత రెండు సంవత్సరాలుగా వింటూ ఉన్న.. ఆయన చెప్పే లెట్-గో, థాట్ లెస్ స్టేట్ అంటే ఆ స్థితినే అనిపిస్తుంది..అప్పుడు ఉట్టిగ గమనిస్తూనే గడిపిన..

    ReplyDelete
  8. @ కాయ
    ఏమవుతుందో చూద్దామనుకొని కొన్ని వేల డాలర్లు మిస్ అయ్యారన్నమాట. అలా మనస్సు ఇచ్చే సిగ్నల్ నే సిక్స్త్ సెన్స్ అంటారు కదా. దాన్ని నేను నా అంతః చేతన ఇచ్చే సూచన అనుకుంటాను.

    ReplyDelete
  9. వేలు కాదు గురూజి.. ఇలాంటివి సపరేటు బెట్ట్లు.. బోనస్ బెట్ట్లు అంటారు... ఆప్షనల్.. అందుకే ఒక 5 పెడుతుంటా.. 125*5 = 625.. చిన్నగా పెద్ద మొత్తమే కదా.. మరీ వేలల్లో కాకపోయినా..ఇలా వందల మందిలో ఒకరికి జరుగుతుండొచ్చు.. విచిత్రమే కదా.

    ..మీ పొట్ట గురించి మనం చేసిన డిస్కషన్ తరంగాలు మనల్ని కనెక్టు చేస్తున్నట్ట్లున్నయ్..

    ReplyDelete