నాకో నాగుపాము కనిపించిన విధంబెట్టిదన!

ఆరో తరగతి చదువుకుంటున్నా అనుకుంటా. నాకు అప్పుడే 'లా ఆఫ్ ఎట్రాక్షన్' వగైరా పేర్లు తెలియదు కానీ నేనేం తలుచుకుంటే అది జరుగుతుందనే ఓ వెర్రి నమ్మకం అయితే వుండేది. అయితే అది నిరూపణ అవాలి కదా? అంచేతా నాకో నాగుపాము కొన్ని రోజుల్లో కనిపించాలని తీర్మానించుకున్నాను. నా అదృష్టం బావుండి ఇంకా గాఠ్ఠిగా నిరూపణ అయ్యేందుకు గానూ అది నన్ను కరవాలని కూడా నిర్ణయించుకున్నాను కాదు. బ్రతికిపోయాను. అయినా కింగు కోబ్రా కనిపించి తీరాలనే మహత్తరమయిన ఐడియా నాకెందుకొచ్చిందో నాకిప్పుడు గుర్తుకురావడం లేదు సుమీ. అలా అని నాకు పాములంటే ప్రేమేం లేదు - చచ్చేంత భయ్యం. బహుశా మా ఇంటిపేరు ఆ పాము పేరుకి కాస్త దగ్గర కాబట్టి అలాంటి చక్కని నిర్ణయం నేను అమాయకంగా తీసుకొని వుండొచ్చు. 

ఓ మూడు వారాలు నేను తపస్సు అనగా విజువలైజ్ చెయ్యగా చెయ్యగా అది ఎంచక్కా కనపడింది. ఆ దృశ్యం నాకింకా స్పష్టంగా గుర్తుకువుంది. పేద్ద పొడవయిన తాచుపామును చంపి మెడలో వేసుకొని మా ఊరిలో మావీధి గుండా ఒకతను వెళుతున్నాడు. అతని పక్కనే అతని సహచరుడూ వున్నాడు. అందరూ ఆసక్తిగా వాళ్లనీ, ఆ పామునీ గమనించసాగారు.  

నేను బిక్కచచ్చిపోయాను. నేను అలా చచ్చిన పాముని చూస్తా అనీ నేను కలలో కూడా అనుకోలేదు. పాముని చూడాలన్న నా కోరిక నెరవేరింది కానీ అలా అని చచ్చిన పాముని చూస్తా అని అనుకోలేదు. నేను ఏది తలుచుకుంటే అది జరుగుతుంది అనే నమ్మకం మరి నిజమా కాదా అని నాకు అర్ధం అవక బుర్ర గోక్కొని ఇహ ఆ నమ్మకాన్ని పక్కకు పడేసాను.  

కొన్నేళ్ళ తరువాత కాస్త ఈ విషయాల మీద జ్ఞానం వచ్చేకా విశ్లేషించుకుంటే నా పొరపాటు నాకు అర్ధం అయి నాలుక కరచుకున్నా. నేను పాము కనపడాలని ఊహించుకున్నా కానీ బ్రతికివున్న పాము కనపడాలని అనుకోలేదు కదా. అందుకే యూనివర్స్ నా కోరికను నేను కోరిన విధంగా నెరవేర్చింది. అందుకే మనకేం కావాలో మనం స్పష్టంగా నిర్వచించుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ కి అనుజ్ఞ ఇవ్వాలి. అప్పుడు అది తన కర్తవ్యం తాను నిర్వర్తిస్తుంది.   

14 comments:

 1. బహుశా మీ అంత:చేతనకు బ్రతికిన పాములే కరుస్తాయనే ఇంగితం లేనట్లుంది. కరిసే పాముని కోరుకుంటే చచ్చినపామైనా పర్లేదులెమ్మని అది అనుకోవడమేమిటి?


  Law of attraction లేదూ తలకాయ లేదు. Word Power Made Easy అనే పుస్తకంలో మీరీ పుస్తకం చదివుతున్నప్పుడు ప్రపంచమంతా హాటాత్తుగా ఈ పెజీలోని vocabularyనే వాడుతున్నట్లుగా అనిపిస్తుందికానీ అదంతా భ్రమ. ఇప్పుడు మీకు ఆ పదాలు తెలిశాయికాబట్టి మీరు వాటిని ఇంతకుముందులా ignore చెయ్యకుండా పట్టించుకుంటున్నారు అనిపిస్తుంది అని చెబుతడు.


  నేను బుల్లెట్‌కోసం ఎదురుచూస్తున్నప్పుడు నాకూ ఇలా ప్రతి రెండవ వ్యక్తీ బుల్లెట్ బైకునే నడుపుతున్నట్లు అనిపించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ Toyota car నడుపుటున్నట్లుగా అనిపిస్తుంది. ఇదొక filtering criteria. అంతకు మించి మరొకట్లేదు.

  ReplyDelete
 2. @ అజ్ఞాత

  మీరు మరీనూ. ఏదో అడావుడిలో నా పోస్ట్ చదివేసినట్లున్నారు. మళ్ళీ తీరిగ్గా చదవండి. నేను పాము కరవాలని కోరుకోలేదు మహాప్రభో! జస్ట్ పాము కనపడాలని కోరుకున్నా అంతే. బ్రతికినా పామో, చచ్చిన పామో నేను స్పెసిఫై చెయ్యలేదు అంతే!

  మీరు ఒకవైపు లాజిక్కు చెవుతూనే LOA కి లాజిక్కు లేదంటారేంటి చెప్మా? మీ లాజిక్కు ప్రకారం మనం అద్భుతాలని ఆశించినప్పుడు, నమ్మినప్పుడు మనకు అద్భుతాలు మాత్రమే కనిపిస్తాయి. కదా. మన సబ్‌కాన్షియస్ మనస్సు ఫిల్టర్ చేసి వాటినే చూపిస్తుంది. కదా. తప్పేం వుందీ? మన జీవితం అద్భుతంగా వుంటుంది. అవును ఇది ఒక భ్రమ, చక్కటి భ్రమ. ప్లేసిబో పిల్ లాంటిది. మీకు తెలుసునా కొన్ని సార్లు ప్లేసిబో పిల్స్ అసలయిన మెడిసిన్ పిల్ కంటే చక్కగా పని చేస్తాయి. హస్తవాసి కూడా అలాంటిదే. మెడిసిన్ కంటే ప్లేసిబో పవర్ఫుల్ అయిన సందర్భంలో ఏది అసలయిన మెడిసిన్? మనకు కావాల్సింది ఆరోగ్యమా, వాదనా? ప్లేసిబోనో, మరొకటో మన ఆరోగ్యం అర్జంటుగా నయమవుతే అదే చాల్లెద్దురూ. సో, ఇదీ అంతే.

  నేనూ హేతువాదినే, నేనూ నాస్తికుడినే. ఇప్పుడు నన్ను అలా అనుకోవచ్చో లేదో తెలియదు కానీ నాకూ ఇందులో లాజిక్కు తెలుసును. అందుకే నాదో వెర్రి నమ్మకం అని ముందే చెప్పుకున్నా చూడండి. యూనివర్స్ అంటే మరేంటో కాదు - మన అంతహ్ చేతనే. మన మనస్సే మన ప్రపంచం. LOA అంటే అద్భుతాలే కాదు, ఇంకా చాలా వుంది. ఇప్పటివరకు పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్గా ఆశించడం అనుకొని పొరపాటు పడేవాడిని. ఇప్పుడు పాజిటివుగా నమ్మడమూ, ఆలోచించడం కూడానూ అని అర్ధం అయ్యాక నా జీవితం U టర్న్ తీసుకుంది. అలా ఇంకా ఎన్నెన్నో. LOA లో అందరూ చెప్పే అన్నీ కరెక్ట్ అనుకోను కానీ దాని సారమూ, చాలా వరకూ సరి అయినవే అని నా నమ్మకం. మంచిని నమ్మినప్పుడు లోకంలో మనకు అంతా మంచే కనపడితే మంచిదే కదా! కాదా?

  ReplyDelete
 3. మీరు మీవూళ్ళో ఒక పెంగ్విన్ కనబడాలని కోరుకున్నప్పుడు అది కనబడితే LOA యొక్క అద్భుతమని నేనూ నమ్ముదును.

  మన దేహం కొన్ని రోగాలని తనంతట తను నయం చేసుకోగలదు. కొందరు దౌర్భల్య మనస్తత్వం ఉన్నవారికి placebo pill కావాల్సి వస్తుంది (మరి కొందరికి దైవం కావాల్సి వస్తుంది). మహత్యం placebo pillలో (లేదా దైవంలో) లేదు. మన దేహంలో ఉంది. దాన్ని గుర్తించీ వాడుకోలేని మన మనో: దౌర్భల్యంలో ఉంది. (అందుకే తమ శక్తిమీద తమకే నమ్మకంలేని సన్నాసులందరూ దేవుడి చంకలు నాకుతుంటారు.)

  మంచి అనేది సాపేక్షికం. మీ స్నేహితుడు మిమ్మల్ని దగా చేస్తున్నాడనుకోండి, మీలో పాజిటివ్‌నెస్ ముదిరిపోయి అతనిలోకూడా మంచిని చూస్తున్నారనుకోండి. అది మీకు మంచిదా? OSHOని కొంచెం గట్టిగా చదవండి. డొసు సరిపోకపోతే నీషేని చదవండి. చేతగాకపోతే చేవుడి చంకలు నాకండి.

  ReplyDelete
 4. మంచి అనేది సాపేక్షికం. మీ స్నేహితుడు మిమ్మల్ని దగా చేస్తున్నాడనుకోండి, మీలో పాజిటివ్‌నెస్ ముదిరిపోయి అతనిలోకూడా మంచిని చూస్తున్నారనుకోండి. అది మీకు మంచిదా?

  ఖచ్చితంగా మంచే జరుగుతుంది. దగా చేయడం అనేది అతని జీన్స్ లోనే ఉంది. మళ్ళీ ఇంకొకరిని దగా చేయడానికి ప్రయత్నిస్తాడు. అపుడు అవతలి వ్యక్తి మొదటివ్యక్తిలాగా మంచివాడయి ఉండకపోవచ్చు. మీరన్నట్లే రెండవవాడు ఊరుకోడు. తోలు తీస్తాడు. శరత్ గారు చెప్పిందే కరెక్ట్ మంచితనం వల్ల పాజిటివ్ ధింకింగ్ వల్ల మొదటి వ్యక్తి ప్రశాంతంగా బ్రతుకుతాడు. దగా చేసినవాడికి రెండవ వ్యక్తి ద్వారా శిక్ష పడుతుంది. శిక్ష వేసినవాడే దేవుడని మొదటివాడు భావిస్తాడు. దుష్టశిక్షణ ఎప్పుడూ దేవుడే చేస్తాడు. మీరు కూడా దేవుడవవచ్చు. దేవుడికి అన్నీ మంచిలక్షణాలే ఉంటాయని ఎవరూ చెప్పలేదు. అన్ని అవలాక్షణాలూ ఉన్నా కూడా పది మందికి మేలు చేసినవాడినే దేవుడన్నారు. మనవాళ్ళకు అర్ధం చేసుకోవడం చేతకాక ఏకపత్నీవ్రతమే గొప్పనుకుంటున్నారు. ఎంతమందిని పెళ్ళి చేసుకున్నారన్నది లెక్క కాదు ఎంత మందిని నీ వల్ల బాగుపడ్డారన్నది లెక్క !

  ReplyDelete
 5. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. నన్ను మోసం చేసినవారికి తగినశాస్తి జరిగినా, నేను compensate చెయ్యబడనంతవరకూ అది నాదృష్టిలో వృధా. నాక్కావలసింది నేను సుఖంగా బ్రతకడమ్మాత్రమే. నన్ను మోసం చేసిన్వాడు నాశనమవడం కాదు.

  "మీరన్నట్లే రెండవవాడు ఊరుకోడు. తోలు తీస్తాడు. శరత్ గారు చెప్పిందే కరెక్ట్ మంచితనం వల్ల పాజిటివ్ ధింకింగ్ వల్ల మొదటి వ్యక్తి ప్రశాంతంగా బ్రతుకుతాడు."

  Nope! మోసం తీవ్రతవతనుబట్టి ఒక్కోసారి కోలుకోలెకపోవచ్చు, ఆత్మహత్య తప్ప వేరొక దిక్కులేని పరిష్తితుల్లోకి నెట్టబడవచ్చు.

  P.S. : మీతో వాధించే స్థాయికి నేనింకా చేరుకోలేదు. మీకు సమాధనం ఇకమీదట చెప్పబడదు.

  ReplyDelete
 6. ఏమిటి గురువు గారు.. మీ పోస్టుని వీళ్ళంతా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.. ఏదో ఆఫీస్ లో ఖాళీగా ఉండి.. చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటున్నారని వీళ్ళకు తెలవదు..

  ReplyDelete
 7. ఎంతో తక్కువ స్థాయినుండి వచ్చినవారు ఇపుడు ప్రధానిగా, రాష్ట్రముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. మరేం పర్వాలేదు. అజ్ఞాతల్లో కూడా తార్కికంగా ఆలోచించేవారున్నారు, ఎదగడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఉండే తీరుతుంది. మోసం చేసినవాడిది ఎంత తప్పో మోసపోయినవాడిదీ అంతే తప్పు. ఎవరు ఎవరికి కాంపన్సేషన్ ఇవ్వాలి ? దేవుడు అంటేనే సాయం, కాంపన్సేషన్ వచ్చేలా సాయమందించినవాడే దేవుడు ! వేలమంది బ్లాగులు వ్రాస్తున్నారు, అందరినీ సీరియస్ గా తీసుకోవాలంటే కష్టం ! ఏది బడితే అది వ్రాసే మేధావులనీ, రచయతలనీ ఊరికే వదిలేస్తే సమాజం పాడయిపోతుంది.

  ReplyDelete
 8. చంద్రబాబుని అంత మాట అన్నారేమిటండి.. రెండెకరాలే కావచ్చు .. పాపం వాళ్ళ ఆంధ్రా లో కులం అని జబ్బలు, తొడలు చరుచుకుంటారు కదా..

  మీరాభాయి మరి మొదటి వ్యక్తినా లేక రెండో వ్యక్తినా ? నాకైతే అటు మొదటికి, ఇటు రెండవకీ కాకుండా సాగుతున్నట్లు తోస్తున్నది... ఎంత అనాలసిస్ !!!..

  ReplyDelete
 9. మీరాబాయి కాదండీ సన్యాసిని, మీరాబాయి అయితే ఇంకొకరి భర్తని ప్రేమిస్తుంది,నాకు కృష్ణుడు వ్రాసిన భగవద్గీత ఇష్టమే కానీ కృష్ణుడంటే ఇష్టం లేదు.

  ReplyDelete
 10. కృష్ణుడి సమక్షంలో అందరూ తమను తాము మైమరచిపోతుండేవారట.. స్త్రీలైనా, పురుషులైనా.. ఆతని సాంగత్యం అటువంటిది.. ఇది శారీరక వ్యవహారం అనుకోవటం అమాయకత్వం, అనుభవజ్ఞుల చెంత లేని తెలియని తనం..

  ఇంకో కోణంలో చూస్తే..భార్యలు, భర్తలు అనే సంబంధాలు కనిపిస్తున్నాయి.. అంటే వ్యక్తి ఆత్మగౌరవం, ప్రేమ కన్నా కట్టుబాట్లే ఎక్కువ అనే వారు సన్యాసినులు ఎలా అవుతారు.. సన్యాసి వేషంలో ఉన్న జాతీయవాది, కట్టు బాట్లను పరిరక్షించే సామాజిక వాది అనటం అతిశయోక్తి అవుతుందా?

  ReplyDelete
 11. @కాయ,
  మనం ఎవరినైనా ఇష్టపడడం లేదంటే వారంటే అసూయ కూడా ఉండిఉండవచ్చు, అంతమందిని ఆకర్షించగలగడం సామాన్యమైన విషయం కాదు కదా ? మీ మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. కట్టుబాటు విషయంలో నేను చాలా పట్టుదలగా ఉన్నాను. హిందువులకూ ఇతర మతాలవారికీ విడివిడిగా కట్టుబాట్లు ఎందుకు ఉండాలి ? మనుష్యులందరికీ ఒకే కట్టుబాటు(common civil code) ఉండాలి. సంసారిగా ఉంటూ సన్యసించడం అంత తేలికైన విషయము కాదు. సన్యాసినిగా ఇంకా మారలేదు. మీరన్నట్లు సామాజిక జాతీయవాదినే ! ధన్యవాదాలు !

  ReplyDelete
 12. మనుషులందరినీ ఒకే కట్టుబాటు-"పూర్తి స్వాతంత్ర్యం" ఆల్రెడీ దేవుడు ఇచ్చిండు కదా..ప్రతి మనిషికీ. దానికి తోడు ప్రేమతత్వం అనే వరం కూడా ఇచ్చిండు కదా .. పనులు చేసుకోవడానికీ ఒక టూల్ నీ ఇచ్చిండు.. మనమేమో టూల్ ని ఎక్కువ వాడుతూ ..ప్రేమని మర్చిపోతున్నాము..

  ReplyDelete