ప్రొటీన్ ప్రయోగ ఫలితాలు

ఇదివరకు జిమ్ములో కొద్ది బరువులు ఎత్తడానికే నిక్కి నీల్గేవాడిని. ఇప్పుడు బరువులు క్రమంగా పెంచుతున్నా కూడా అలసట లేదు, నొప్పిలేదు. అయితే నన్ను నేను ఛాలెంజ్ చేసుకునే దశకి ఇందువల్ల ఇంకా వెళ్ళలేకపోతున్నాలెండి. చెప్పా కదా, జాగ్రత్తగా, నెమ్మదిగా బరువులు పెంచేస్తున్నా అనీ. జిమ్ములో నో పెయిన్, నో గెయిన్ సూత్రం వర్తిస్తుంది. మనల్ని మనం ఏరోజుకారోజు సవాలు చేసుకుంటూ వెయిట్స్ పెంచేస్తేనే కండరాల టిస్యూ బ్రేక్ అయ్యి నొప్పులు వస్తాయి. ఆ తరువాత శరీరానికి తగినంత అహారమూ, నిద్రా, విశ్రాంతి, ప్రోటీన్ ఇస్తే ఆ కండరాల టిస్యూ రికవర్ అయిపోయి వాటి పరిమాణం పెరుగుతుంది.

ఓవర్-ట్రైనింగ్  సిండ్రోమ్ లక్షణాలు ఇంతవరకూ అయితే కనిపించలేదు - సంతోషం. ఇంతవరకూ ఎలాంటి అనారోగ్యం కలగలేదు పైగా ఆరోగ్యం మరింత మెరుగయ్యింది- మరీ సంతోషం.  సో, ఇప్పటిదాకా వ్యాయామాన్ని మొదటి గేర్ లో జాగ్రత్తగా, భయంభయంగా, బిక్కుబిక్కు మనుకుంటూ చేస్తున్నవాడినల్లా ఇక రేపటి నుండి రెండో గేర్ లో బండి నడిపిస్తాను.  ఇదివరకు జిమ్ము లో వెయిట్స్ చేసినప్పుడల్లా ప్రమాదాలు (ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్) జరిగాయి కాబట్టి ఇప్పటిదాకా వళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తూ వస్తున్నాను. నా ప్రొటీన్ ప్రయోగం పనిచేస్తున్నట్లే వుంది. రోజుకి వంద గ్రాముల పీనట్ బటర్ ఫ్లేవర్ ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటున్నా మరి. నేను వాడుతున్న బ్రాండ్ BSN SYNTHIA-6 ఎంత కమ్మని రుచీ!

మీలో ఎవరయినా వెయిట్స్ చేస్తున్నవాళ్ళుంటే నా ఈ పోస్టులకు స్పందిద్దురూ.

ఇంట్లో ఎవరూ లేరు - ఒక్కడినే వున్నా. ఇలాంటప్పుడు పబ్బులకు గట్రా వెళ్ళి అందాలను అవలోకిస్తూ కాలక్షేపం చెయ్యొచ్చుగా అని నాకు ఇండియా నుండి కొన్ని ఉత్సాహవంతమయిన వర్గాల ద్వారా ప్రోత్సాహాలు భలేగా అందుతుంటాయి కానీ... ప్చ్... కంపెనీ లేదండీ. నా ఇక్కడి మిత్రులంతా మహా పొదుపరులూ, మదుపరులూనూ. అంతా శ్రీరామచంద్రుళ్ళా ప్రవర్తిస్తారు.  హొక్కడినే లింగులిటుక్కూ మనుకుంటూ ఏం వెళతాం పబ్బులకు గానీ, ప్రదర్శన శాలలకు గానీ! నేను కెనడాలో వున్నప్పుడు పరిస్థితి వేరుగా వుండేది. పబ్బులకు పోలేదు కానీ మిత్రులతో కలిసి మసాజులకీ, నగ్ననృత్యాలకి అప్పుడప్పుడయినా వెళుతుండేవాడిని. ఇండియా నుండి ఎవరయినా కొత్తగా వస్తే అవి పరిచయం చేసి కాస్తో కూస్తో పుణ్యం మూటగట్టుకునేవాడిని. జోకనుకోకండీ - నిజవే. మొదటిసారి అవి చూసాకా వాళ్ళు ఉబ్బితబ్బిబ్బయ్యి (?!) నన్నో పుణ్యపురుషుడిలా ప్రస్థుతించేవారు మరీ. 

రాత్రి 12 కావస్తోంది. నిద్రొస్తోంది. ఇహ పడుకుంటానండి.

8 comments:

  1. http://www.ehow.com/info_8759186_negative-effects-syntha6.html

    జాగ్రత్త మరి!

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    అవన్నీ తెలుసుకోకుండానే నేను వాడుతానటండీ. అవన్నీ SYNTHIA ప్రోటీనే కాదు - ఏ ప్రోటీన్ చాలా ఎక్కువ తీసుకున్నా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవి. ప్రతి దానికీ వుంటాయి సైడ్ ఎఫెక్ట్స్. వాటిని వీలయినంతవరకూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే కానీ అలా అని ఆగిపోతే ఇంకేమీ చెయ్యలేము.

    ఉదాహరణకు మీరు నడుస్తునారనుకోండీ.. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయో తెలుసా? మీ కాలు విరగవచ్చు, ఎవడన్నా వచ్చి కారుతో గుద్దెయ్యొచ్చు, ఎండలో నడిస్తే మీకు డిహైడ్రేషన్ రావచ్చు, సూర్యరశ్మి పడకపోవచ్చు, మీ కాలు బెణకవచ్చు. అలా ఎన్నో ఎన్నెన్నో. అలా అని మీరు బయటకి రాకుండా ఇంట్లోనే వుంటారా? అలా వున్నా దానికీ ఎన్ని సైడ్ ఎఫెక్టులూ? అంచేతా...

    మీకు ధన్యవాదాలు. ఎందుకయినా మంచిదని, నాకు తెలుసో లేదో అని మీరు నాకు తెలియపరిచిన శ్రద్ధకి సంతోషంగా వుంది.

    ReplyDelete
  3. Not related to the post but mentioning here: http://chandralata.blogspot.sg/2015/08/blog-post_16.html

    ReplyDelete
  4. My 2 cents - protein powders are supplements, use only when you cant get enough protein via food, there are many of varieties of Grilled and Ready to eat chicken, canned/frozen fish etc are available, use them regularly and if at the end of the day you feel you need some protein then only use powder.

    ReplyDelete
  5. Sarat

    Follow my advice and example.
    if it is tasty eat it, drink it
    as you said side effects are there everywhere for everything
    in this polluted world even mothers milk has side effects because of the foods mothers eat
    good luck

    ReplyDelete
  6. hello sir
    thank u so much, due to your blog i came to know that i am suffering ( from the past 6 months) from OTS , resulted in severe sinusitis which reduced my olfactory senses then i stopped workout now experiencing withdrawal symptoms ie, body pains , sinusitis , want to know how to counter these condition. please suggest how can i get rid of these body aches.
    if i want to start workout again how can i proceed

    ReplyDelete
  7. sir naa post ki konchem pratyutharam ichi ee ots nunchi baitapadeindi.

    ReplyDelete
  8. @ శివనారాయణ రావు

    ఆలస్యానికి దయచేసి మన్నించండి. తీరిక తక్కువయినదువల్ల వ్యాఖ్యలకు వెంటనే స్పదించలేకపోతున్నాను.

    మీరు అడిగిన ప్రశ్నలకు ఈ పోస్టులోనే క్లుప్తంగా జవాబులు వున్నాయి కదండీ. తగిన విశ్రాంతీ, తగిన ఆహారం ముఖ్యంగా అవసరం. దయచేసి మరింత సమాచారం కోసం నెట్టులోనే వెతకండి. ఇక్కడ వివరంగా వ్రాసే ఓపిక, తీరిక ప్రస్థుతానికి నాకు లేవండీ.

    http://www.marksdailyapple.com/how-to-deal-with-overtraining/#axzz3nWgyA6FC

    ReplyDelete