తీరిక తక్కువయ్యింది!

ఇదివరలో ఇంటా, బయటా కాస్త తీరిక వుండేది కాబట్టి నా గోళ్ళు గిల్లుకోకుండా బ్లాగు పోస్టులు వ్రాస్తూండేవాడిని. ఇప్పుడు ఆఫీసులోనూ బాగా బ్యుజీ అయిపోయాను. ఇక ఇంటికి రాగానే రోజూ గంటన్నర జిమ్ముకి వెళుతూవుండటంతో అస్సలు సమయం దొరకడం లేదు. 

నా ఆరోగ్య మరియు వ్యాయామ సమస్యలన్నింటికీ ప్రొటీన్ కారణమేమో అని అనుమానం తీవ్రంగా వచ్చి అది క్రమంగా పెంచుతూ ఇప్పుడు రోజుకి కనీసం 100 గ్రాములు తీసుకుంటున్నాను. నాకు ఇష్టమయిన పీనట్ బటర్ ఫ్లేవర్ లో మాంఛి ప్రీమియం ప్రొటీన్ అనువయిన ధరకే దొరుకుతోంది. ఇంకేం కమ్మగా లాగిస్తున్నాను. అందువల్లనేమో కొన్ని ఆరోగ్య సమస్యలు కనుమరుగు అవుతున్నాయి. ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ ఇంతవరకూ రాలేదు. ఎంత వ్యాయామం చేసినా హాయిగా నిద్ర పడుతోంది. అయినా సరే ఎందుకయినా మంచిదని వళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాయామం చేస్తున్నాను. నెమ్మది నెమ్మదిగా బరువులు పెంచేస్తున్నాను. ప్రస్తుతం వివిధ వ్యాయామాల్లో 50 పౌండ్లు (45 కిలోలు) వరకూ వాడుతున్నాను. నెమ్మదిగా 100 పౌండ్ల వరకూ పెంచేస్తా. అవి తట్టుకోగలిగితే మున్ముందు ఇంకానూ. 

ఇన్ని రోజుల నుండీ ఇండియాలో కానీ, కెనడాలో కానీ, ఈ యుఎస్ లో కానీ ఒక్క డాక్టర్ కూడా ప్రొటీన్ సరిగా తీసుకుంటున్నావా అని ఎందుకు నన్ను కనుక్కోలేదో అని బోల్డెంత విస్మయం చెందుతున్నా. ఏంటో. అంత ముఖ్యమయిన విషయం గురించి వాళ్ళెందుకు పట్టించుకోరో నాకర్ధం కాదు. అందరూ బాడీ బ్యుల్డర్లకే పోటీన్ అవసరం అనుకుంటారు కానీ అది నిజం కాదు. మనం ఎన్ని కిలోల బరువు వున్నామో కనీసం అన్ని గ్రాముల ప్రోటీన్ ప్రతి రోజూ అవసరం. అది సరిపోకే అందరికీ ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు. మంచి నీళ్ళ తరువాత ప్రధానమయినది ఇదే.   

మా స్నేహితుని కొడుకు కొద్దిరోజులుగా మా ఇంట్లోనే వుంటున్నాడు. అతను ఈమధ్యనే డాక్టర్ అయ్యాడు. ఒక సినిమాలో హీరోగా కూడా చేసేడు. అతనికీ జిమ్ అంటే బాగా ఆసక్తి. ఇద్దరం కలిసి వెళుతున్నాం.  

ఈ రోజుకూడా సమయం లేకపోయినా సరే మిమ్మల్నందరినీ పలకరించి చాల్రోజులయ్యిందనీ కొద్ది సమయం చూసుకొని వ్రాస్తున్నా. అన్నట్టు ఈ వారాంతం మా ఇంట్లో వాళ్ళు డెట్రాయిటుకి వెళుతున్నారు. ఓ వారం నాకు కాస్త తీరిక దొరుకుతుంది. మా వాళ్ళు అటెళ్ళగానే మేము ఇటు జెంట్స్ పార్టీ మా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. 

త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవ్. 

4 comments:

  1. cheers వుంటాయా పార్టీలో??

    ReplyDelete
  2. కోడి గుడ్డుకి ఈకలు పీకుతున్నా...50 పౌండ్లు అంటే, 23 కిలోలు మన ఎయిర్ ఇండియా వారి లెక్కల ప్రకారం. వీకెండ్ పార్టీ గుట్టు తెలిసిపోయింది, మరి కేవలం గానా-భజానా లేనా, ఇలాగైతే తానా=తందానా ఎప్పుడో మరి?

    ReplyDelete

  3. మీకు ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్కువో తక్కువో అవుతానే ఉంటయ్యాండీ :)??

    జిలేబి

    ReplyDelete
  4. @kvsv
    అవి లేకుండా ఇంకేం పార్టీ అండీ.

    @ అరుణ్
    నా బ్లాగుని అందరూ వళ్ళు, కళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతున్నారో లేదో తెలుసుకోవడం కోసం అలా అప్పుడప్పుడూ పొరపాట్లు వ్రాస్తుంటా లెండి :))

    @ జిలేబీ

    నాది రోలర్ కోస్టర్ జీవనం/జీవితం లెద్దురూ.

    ReplyDelete