మళ్ళీ మొదలెట్టా!

నాకున్న చక్కని వ్యసనం - వ్యాయామం. అయితే ఎరోబిక్ వ్యాయామాల కన్నా నాకు ఎనరోబిక్ వ్యాయామాలు నాకు బాగా ఇష్టం. అయితే అవి కాస్త చేసినప్పుడల్లా ఓవర్ ట్రైనింగ్ సిండ్రోం వచ్చేసి చాలా నెలలు విశ్రాంతి తీసుకోవాల్సివచ్చేది. ఆ పరిస్థితి ఎందుకు వస్తోందా అని నాకు పరిశోధించగా కొన్ని కొన్ని వివరాలు తెలియసాగాయి. ప్రొటీన్ లోపం కారణం కావచ్చునని ఈమధ్య అనుకుంటున్నాను. గత కొన్ని వారాలుగా ప్రొటీన్ బాగా తీసుకోవడం మొదలెట్టాను. ఇవాల్టి నుండి లైట్ గా మళ్ళీ వెయిట్స్ మొదలెట్టాను. ఇప్పుడెలా వుంటుందో చూడాలి. ప్రస్తుతానికి వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చేస్తూ పరిస్థితిని బట్టి నెమ్మదిగా పెంచేస్తాను. పరిస్థితి బాగా లేకపొతే విరమిస్తాను. ప్రొటీన్ పెంచినా కూడా ఇంకా ప్రొటీన్ సరిపోకపోతే నాలో వచ్చే లక్షణాలు తెలుసు కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనిస్తూ వున్నాను.  బరువు తగ్గుదల, నిద్రలేమి, చిరాకు, అలసట, కండరాల నొప్పులు వగైరా ఆ లక్షణాల్లో కొన్ని. ఏం జరుగుతోందీ మీకు తెలియజేస్తూవుంటాను.

3 comments:

 1. దీనికంటే ముందు టపా టైటిల్ చూసి, ఈ టపా కంటెంట్ ఏమిటో చదవకుండానే ఏదో ఊహించుకున్నా ;-)

  సిద్దార్థ్

  ReplyDelete
 2. Me too.. like Siddarth, thought some thing else ;)
  What to do .. your reputation is like that, you set the standards 'high' :P

  Mr. Yakhsa

  ReplyDelete
 3. @ సిద్ధార్ధ్ & యక్ష

  :)

  ముందు ఇది మొదలెట్టాకా కాస్త ఫార్మ్ లోకి వచ్చాకా మళ్ళీ అదీ మొదలెడదాం ;) కొన్ని నెలల్లో కొన్ని మార్పులు సంభవించవచ్చు. చూద్దాం.

  ReplyDelete