నాలో మాంసకృత్తుల లోపమా?

కొన్ని నెలల క్రితం చాలావరకు రా వీగన్ ఫుడ్డు (Raw Vegan Diet) తినడం ప్రారంభించాను. కొన్ని వారాల్లో ఉత్సాహంగా అనిపించి జిమ్ములో కొద్దిగా బరువులు కూడా ఎత్తడం మొదలెట్టాను. అంతే. కొద్ది వారాల్లో నా శరీరంలోని హార్మోన్లలో విపరీతమయిన మార్పులు జరుగుతుండటం గమనించాను. మంచి ఆహారం, మంచి వ్యాయామం చేస్తున్నా  నాలో ఆ మార్పులు ఎందుకు వస్తున్నాయో నాకర్ధం కాలేదు. మరి కొన్ని వారాల్లో నాకు పలు రకాల ఇన్ఫెక్షన్లు ఒకటి నయం కాకముందే మరొకటి రావడం మొదలెట్టాయి. గత నెలరోజులుగా అలా పలు ఇన్ఫెక్షన్లతో సతమతం అవుతూవున్నాను. ఇప్పుడిప్పుడే కాస్తంత తేరుకుంటున్నా. మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్ ఇప్పటివరకయితే రాలేదు.  

రక్త పరీక్షలు చేయిస్తే లివర్ ఎంజైమ్స్ కొన్ని స్వల్పంగా పెరిగాయి. పచ్చి ఆహారం మరియు వెయిట్ లిఫ్టింగ్ నా అనారోగ్యానికి కారణమేమో అని మా డాక్టరుతో  సందేహం వెలిబుచ్చితే నవ్వేసి తేలిగ్గా తీసుకున్నాడు కానీ పలు విషయాలు బాగా పరిశీలించిన పిమ్మట నాలో ఏర్పడ్డ ప్రోటీన్ డిప్లెషన్ మరియు డిఫీసియన్సీ నా అనారోగ్యాలకి కారణం అవుతుండవచ్చు అని భావించాను. పచ్చి శాఖాహారం తీసుకోవడం వల్ల నాకు ప్రొటీన్ అంతగా అందలేదు. పైగా నేను కాస్త వెయిట్ లిఫ్టింగ్ చెయ్యడం వల్ల నా కండరాల్లొ వున్న కాస్తా ప్రోటీన్ హరించుకుపోయింది. అలా నాలో మాంసకృత్తుల లోపం ఏర్పడింది కావచ్చు.  పచ్చి ఆహారంతో తగినంత ప్రొటీన్ సమకూర్చుకోవడం అసాధ్యం కాదు కానీ అందుకోసం కాస్త కష్టపడాలి.  మాంసాహారంతో సులభంగా సాధించవచ్చు. అయితే ఎనిమల్ ప్రొటీన్ ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని వర్గాల వాదన. 

ఇప్పటివరకూ తగినంత ప్రొటీన్ తింటున్నానులే అనే భ్రమతో వున్నా. ఈమధ్య ప్రోటీన్ గురించి బాగా పరిశీలిస్తున్నా. దాదాపుగా మనకు మనం ఎన్ని కిలోల బరువు వున్నామో అన్ని గ్రాముల ప్రొటీన్ రోజూ అవసరం. బాగా వ్యాయామం చేసేవారికి అంతకు రెట్టింపు ప్రోటీన్ అవసరం అంటారు. ప్రస్తుతానికి రోజూ 50 గ్రాముల (25 gms 2 times)  ప్రోటీన్ పౌడర్ నీళ్ళలో కలిపి తీసుకుంటున్నా. అలాగే కోడి మాంసం, గుడ్లు, పాలు, పెరుగు తిరిగి తీసుకోవడం మొదలెట్టాను. నెమ్మదినెమ్మదిగా మెరుగు అవుతున్నాను. ఇన్నేళ్ళుగా నాకు వున్న పలు చిన్నచిన్న ఆరోగ్యసమస్యలకు కారణం ఈ లోపమే కావచ్చునేమో. కొన్ని నెలలు ఇలా ప్రోటీన్ పెంచి చూస్తాను. 

ఈ నెల ఒకటవ తేదీన ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డెల్హీ పౌరుల్లో 99% ఈ లోపం వుందిట. భారతీయుల్లో 88% ఈ లోపం వుందిట. 


13 comments:

 1. https://en.wikipedia.org/wiki/Mung_bean

  100gms of Mung dal has 24gms of protein. When you sprout it, it will improve its protein content by 30%. So you will get 31.2gms of protein in one serving of 100gms of srpout Mung dal. All beans, lentils, legumes etc have good nutritional values.

  You can take eggs, milk etc but their protein value is low comparatively.
  https://en.wikipedia.org/wiki/Egg_(food)
  For ex: 1 egg white contains 3.6 gms of protien (you cannot eat yellow because it has 62% daily value cholestrol). So you should eat 8.6 eggs white to get same protein as sprout mung.
  Same thing with milk
  https://en.wikipedia.org/wiki/Milk
  100gms of 1% fat milk contains 3.4gms of protein. So you should drink 917gms of milk to get 31.2 gms of protein.

  100gms of chicken contains 24gms of protein which is less than what you get from 100gms of mung sprouts.

  ReplyDelete
 2. @ Sarat gaaru,

  శరీరవైద్యశాస్త్రానికీ మనోవైద్యశాస్త్రానికీ సంబంధించి ఒక జోక్ వుంది, అదేమిటంటే మొదటిదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన జబ్బులన్నీ మనకి ఉన్నట్టు అనిపిస్తుందట , రెండోదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన రోగాలు పక్కవాళ్ళ కున్నట్టు అనిపిస్తుందట ! కాబట్టి ఎక్కువగా చదవకండి, మోడీ గారు చెప్పినట్లు యోగా చెయ్యండి.

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  మీరు పొరపడ్డారు. మీరు ఇచ్చిన లింక్ లో కూడా వివరాలు మళ్ళీ చూడండి. 100 గ్రాముల పచ్చి పెసర్లలో 25 గ్రాముల ప్రొటీన్ వుండవచ్చును కానీ 100 గ్రాముల పెసర మొలకల్లో వుండేవి 3 గ్రాముల ప్రొటీన్ మాత్రమే :) ఆ లెక్కన 30 గ్రాముల ప్రొటీన్ కోసం ఒక కిలో మొలకలు తినాల్సివుంటుంది. పెసర మొలకలు నాకు బాగా ఇష్టమే. రా వీగన్ ఆహారం తిన్నప్పుడు అవి విరివిగా తిన్నాను. అయినా సరే ఎందుకు ప్రొటీన్ లోపం వచ్చియుండవచ్చు అని చూస్తే 100 గ్రాములకి 3 గ్రాముల ప్రొటీన్ మాత్రమే!

  పైగా ప్లాంట్ ప్రొటీన్ పూర్తిస్థాయి ప్రొటీన్ కాదు. ఒకేరకం తింటే పూర్తిస్థాయి ప్రొటీన్ లభించదు. అదే అనిమల్ ప్రొటీను పూర్తి స్థాయి ప్రొటీన్. నాకు మానవతా కారణాల వల్ల ఎనిమల్ ప్రొటీన్ నచ్చదు కానీ తప్పేట్లుగా లేదు. కొన్ని నెలలు ఈ ప్రోటీన్ పెంచి ఫలితాలు బేరీజు వేసుకుంటాను. మిగతా మీరు పేర్కొన్న లెక్కలు నిజమే. అందుకే ప్రోటీన్ కోసం ఎక్కువ ఆహారం తినాల్సివుంటుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా నాకు కావాల్సిన కనీస మొత్తం కోసం ప్రొటీన్ పౌడర్ షేకులు తాగుతూ అదనపు ప్రొటీన్ ఆహారంలో లభించేట్లుగా చూస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. I think you are mistaken.

   When you sprout it, the protien content increases by 30%. So if 100gm of raw mung contains 24gms of protein, if you sprout it, the protein content improves by 30% which is 24*1.3 = 31.2 gms.

   When sprouted, all nutritional values go up and bad stuff (like calories and carbs) go down
   http://www.medindia.net/patients/lifestyleandwellness/sprouts-the-super-food.htm

   Delete
  2. @ అజ్ఞాత
   మొలకలెత్తినప్పుడు ప్రోటీన్ పెరగడం నిజమే కానీ ఒక లెక్కలో మీరు పొరపడుతున్నారు. వంద గ్రాముల పెసర్లను మొలకలెత్తించినప్పుడు వాటి బరువు పెరుగుతుంది కదా. ఖచ్చితంగా ఎంత పెరుగుతుందో నాకు తెలియదు కానీ సరిగా మొలకలెత్తిస్తే కిలో బరువు అవుతుందంటారా? అప్పుడు వంద గ్రాముల పెసర్ల నుండి మొలకెత్తిన కిలో బరువు మొలకలలో 30 గ్రాముల ప్రొటీన్ వుంటుంది. అంటే వంద గ్రాముల మొలకలలో 3 గ్రాములు మాత్రమే వుంటుంది. అదీ లెక్క.

   Delete
 4. @ నీహారిక గారు

  మీరు చెప్పిన సామెత బావుంది :))

  సర్లెండి. ఒడ్డున వున్న మీరు ఎన్ని కబుర్లయినా చెబుతారు. అసలు అవస్థ నాది కదా :)

  నాకు యోగా, ధ్యానం ఇష్టమే కానీ పలు కారణాల వల్ల కుదరడం లేదు. జిమ్ము మాత్రమే నాకు కుదురుతోంది. నేను కాస్త కుదుటపడ్డాకా ఈసారి ప్రొటీన్ పెంచి మళ్ళీ జిమ్ములో ఎనరోబిక్ వ్యాయామాలు కొద్దికొద్దిగా, వారానికి ఒకసారి మాత్రమే చేసిచూస్తాను.

  ReplyDelete
 5. "అయితే ఎనిమల్ ప్రొటీన్ ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని వర్గాల వాదన" ఎవరు ఆ వర్గాలు, అలా అయితే ప్రపంచ మంతా అనారోగ్యంగా , భారత శాఖాహారులు ఆరోగ్యం గ ఉండాలి కదా?
  వ్యాయామం చేయనప్పుడు కూడా మాంసకృత్తులు చాలాఅవసరం. పచ్చి శాఖాహారం కూర గాయలు (పళ్ళు కాదు ) + మాంసాహారం కుమ్మండి, ధాన్యాలు తగ్గించండి, మళ్లీ జిం లో కేక పెట్టండి.

  ReplyDelete
 6. అదేమి చోద్యమో గాని ఈ శరత్తు బాబు ఎన్ని కసరత్తులు చేసినా ఏదో ఒక లోపం జీ బూంబా లా , అల్లాఉద్దీన్ అద్భుత దీపం లా టా అని ప్రత్యక్ష మవుతుంది :)

  టేక్ కేర్ !

  జిలేబి

  ReplyDelete
 7. @ RaPaLa

  ముఖ్యంగా మా డాక్టర్ (డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతీ) ఎనిమల్ ప్రొటీన్ కి వ్యతిరేకం. చైనా స్టడీని తను ఉదహరిస్తారు. చైనాలో ఒక రాష్ట్రంలో అమెరికన్ సైంటిస్టులు అనుకుంటా అధ్యయనం చేసి ప్లాంట్ ప్రోటీన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదని నిర్ధారించారు. అని నెట్టులో వెతికితే దాని గురించి మీకు తెలుస్తుంది. అలాగే raw vegan డైట్ తీసుకునేవారూ ఎనిమల్ ప్రొటీన్ హానికరం అని పలు విషయాలు ఉదహరిస్తారు. ఆహారం గురించి ఒక్కొక్కళ్ళూ ఒక్కోరకంగా చెబుతుంటారు లెండి. మనం పరీక్షించి మనకు ఏది పనిచేస్తుందో అది చూసుకోవాలి.

  మీరు సలహా ఇచ్చినట్లుగానే కొంతకాలం ఆహారం బాగా తింటూ, బాగా వ్యాయామం చేస్తూ చూస్తాను.

  ReplyDelete
 8. @ జిలేబి
  ఒక్కో అడుగుతో సత్యానికి దగ్గరవుతున్నాలెండి. నా అనారోగ్యాలకి మూలకారణం తెలిసేవరకూ వదలను లెండి. అలా అని నాకు డయాబెటిసో, కొలెస్టరాలో లేవు లెండి. అన్నీ చిన్నా చితకా సమస్యలు. వాటిని అన్నింటికీ ప్రొటీన్ లోపం కారణం కావచ్చు. అదీ చూద్దాం. ధన్యవాదాలు. డాక్టర్లకి అంత ఓపికా, తీరికా, ఆసక్తీ వుండవు కాబట్టి వీలయినంత వరకు మన ప్రయత్నం మనం అయినా చెయ్యాలి కదా.

  ReplyDelete
 9. 50 కిలోల బరువుకి ఇన్ని కసరత్తులు అవసరమా ? మరీ ఇంత సుకుమారమైతే ఇండియాలో కష్టం !

  ReplyDelete
 10. @ నీహారిక
  నా ఎత్తుకి నేను కనీసం 52 కిలోలు మరియు 58 కిలోల లోపుగా వుండాలి. అందుకని సరాసరిన 55 కిలోల బరువు మెయింటెయిన్ చేస్తుంటాను.

  ReplyDelete
 11. @ నీహారిక
  నా ఎత్తుకి నేను కనీసం 52 కిలోలు మరియు 58 కిలోల లోపుగా వుండాలి. అందుకని సరాసరిన 55 కిలోల బరువు మెయింటెయిన్ చేస్తుంటాను.

  ReplyDelete