కరెంట్ కంగ్రాట్స్ కేసీఆర్!

దాదాపు ఏడాది క్రితం నేను ఇండియాకు వచ్చినప్పుడు మా పట్టణంలోని ఒక బాగా దగ్గరి మిత్రుడితో అప్పటి రాజకీయాల గురించి చర్చించాను. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆ మిత్రుడు పక్కా తెలంగాణా వాసి అయివుండి కూడా బాబును బాగా మెచ్చుకుంటూ, కేసీఆర్ ను బాగా చులకన చేసేడు. అతను ప్రస్థావించిన విషయాల్లో వాస్తవం కాస్త పక్కకు పెడితే తన కులాభిమానం మాత్రం బాగా ప్రదర్శించుకున్నాడు. బాబు గారి మీద, ఆ కులం గారి మీద అంత భక్తి వున్నప్పుడు అటే ఆంధ్రాకే తను తరలిపోవచ్చు కదా అని అనిపించింది కానీ అనలేదు. 

కట్ చేస్తే దాదాపు ఏడాది తరువాత నేను ఫోన్ చేసినప్పుడు తను కేసీఆర్ ను కాస్త మెచ్చుకోవడం చూసి విస్మయం చెందాను. ఇంత మండే ఎండల్లో కూడా కరెంటు కష్టాలు లేకుండా నెట్టుకొస్తున్నాడని, అందువల్ల అందరూ అతడిని అభిమానిస్తున్నారనీ చెప్పేడు. మిగతా విషయాలు ఎలా వున్నా కరెంట్ విషయంలో మాత్రం లోటు వున్నా కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడని అన్నాడు. ఆ సమయంలో చంద్రబాబు ప్రస్థావన మా మధ్య రాలేదు కాబట్టి బాబు గారిపై మనవాడి అభిప్రాయం ఎలా వుందో నాకు తెలియదు.

ఇహపోతే కెసీఆర్ మీద ఈమధ్య భండారు శ్రీనివాసరావు గారు వ్రాసిన బ్లాగు పోస్టు వల్లనూ, ఇతర వర్గాల వల్లనూ మా ఫ్రెండ్ చెప్పింది నిజమేనని నాకు అర్ధమయ్యింది. అందువల్ల తెలంగాణా అవిర్భవించి ఒక ఏడాది పూర్తి అయిన సందర్భంగా మిగతా విషయాలు ఎలా వున్నా కనీసం కరెంటు విషయంలో మాత్రం కంగ్రాట్స్ చెప్పలేకుండా నేనుండలేకపోతున్నా.

10 comments:

  1. కావొచ్చునేమో. ఇందులో కరెంట్ డిమాండ్ పడిపోవడాన్ని కూడా చూడాలి మీరు. చాలా ఇండస్ట్రీలు ఇప్పుడు ఒక షిఫ్ట్ మాత్రమే నడుస్తున్నాయి. హోటల్స్ వ్యాపారం తగ్గింది. పంటలు కూడా పూర్తిగా వెయ్యలేదు అని విన్నాను.

    ReplyDelete
  2. @Sudhir:

    పరిశ్రమలకు గత 3-4 సంవత్సరాలలో వారానికి 1-2 రోజులు పవర్ హాలిడే ఉండేది. మిగిలిన 4-5 రోజులలో కూడా రోజుకు 4-5 ఘంటలు మాత్రమె సరఫరా చేసేవారు. ఇప్పుడు పవర్ హాలిడే ఎత్తేసారు & రోజంతా పవర్ ఇస్తున్నారు. నాణ్యత కూడా గణనీయంగా పెరిగింది.

    ఇక పంట విషయానికి వస్తే రబీ పంట ముందే తక్కువ. ట్యూబ్ ఆధారిత ప్రాంతాలలో రెండో పంట వేయడం దాదాపుగా జరగదు. కొద్దో గొప్పో కరెంట్ డిమాండ్ ఉన్నా అది ఏప్రిల్ (అంటే కరెంట్ పీక్ డిమాండ్ మొదలు కాకముందే) కంటే ముందే పూర్తి అవుతుంది.

    హోటళ్ళ వల్ల విద్యుత్ డిమాండ్ హెచ్చని తెలీదు. I think this is a negligible factor even if your claim of reduced business is true.

    ReplyDelete
  3. రైతులూ మీరు రబీ పంటలు వేయకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరీ రైతులతో పంటలు వేయకుండా ఆపగలిగారు. ఇక కరెంట్ కు డిమాండ్ ఎక్కడుంది? అయినా తెలంగాణా పల్లెల్ని చీకట్లలో ఉంచి ఒక్క హైదరాబాద్ కు మాత్రం కరెంట్ ఇస్తే కేసీఆర్ గొప్పోడయిపోతాడా? డిసెంబర్ లోపుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా... వాటిని ఎదుర్కోవాలంటే ఇక్కడి ఆంధ్రా ప్రజల్ని, ఇతర రాష్ట్రాల వారిని ఆకట్టుకోవాలి కదా.. అందుకే పవర్ కట్ లు లేకుండా మిగతా తెలంగాణ ప్రజల్ని, రైతుల్ని ఎండబెట్టి హైదరాబాదీలు మాత్రమే కరెంట్ ఇస్తున్నాడు. ఈ మాత్రానికే మన శంకరన్న కంగ్రాట్స్ చెప్పేస్తున్నాడు...

    ReplyDelete
  4. @ అజ్ఞాత
    నా మిత్రుడు హైదరాబాదుకి చెందినవాడు కాదు. అతనిది సూర్యాపేట.

    ReplyDelete
  5. @అజ్ఞాత:

    దయ చేసి రబీ పంటలు వేయొద్దని వార్నింగ్ గురించి కానీ ఈసారి రబీ పంట తక్కువ వేసినట్టు కానీ ఆధారాలు చూపిస్తారా?

    FYVKI rabi season is over in April :)

    ReplyDelete
  6. మీ టిష్యూ పేపర్ కాకుండా ఇతర పేపర్లను చదవడం అలవాటు చేసుకోండి. వాస్తవాలు తెలుస్తాయి. ఎంతమంది రైతులు పంటలను వేయకుండా తాత్కాలిక పనులకోసం హైదరాబాద్ వచ్చిందీ, చెరకురసాల వంటి బండ్లను పెట్టుకుని బతుకులీడుస్తున్నదీ తెలుస్తుంది. రబీ పంటలు వేయకండి అని ఎన్నిసార్లు చెప్పలేదు... ఆ వార్తలు ఎన్నిసార్లు పత్రికల్లో ప్రముఖంగా రాలేదు. మార్చి, ఏప్రిల్ నెలల పాత పేపర్లు ఒకసారి తిరగేయండి గొట్టి ముక్కల....

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత మిత్రమా, నేను మీడియా ఆధారంగా మాట్లాడలేదు. మీరు ఆధారాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు?

      మీరు ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

      1. ఇంతకీ రబీ పంట ఎప్పుడు వేస్తారండీ?
      2. తెలంగాణాలో కానీ దేశంలో ఎక్కడయినా కానీ ట్యూబు ఆధారంగా రబీ పంట గణనీయంగా ఉందా?

      Delete
  7. hello, congrats enduku? timely act cheyyakundaa pourushaaniki poyi money waste chesi power isthunnandukaa?edolaa gadapadam veru.planed gaa cheyyadam veruu.

    ReplyDelete
  8. ఆంధ్రా అజ్నాతలూ .. సారీ అజ్నానులూ మీకేండుకయ్యా కుళ్ళు

    ReplyDelete
  9. http://www.mirchi9.com/movienews/power-cuts-looming-large-on-hyderabad/

    ReplyDelete