ఇవాల్టి నా రాత్రి భోజనం ఇదీ

వ్యాయామానికి వెళ్ళిరావడంతోటే ఇంట్లో ఘుమఘుమలాడుతున్న పప్పు కూర కనిపించింది. ఇంకేం స్ప్రింగ్ మిక్స్ గ్రీన్స్ ను పప్పులో నంచుకొని తినేసా. దాంతోపాటూ ఆవకాయా పెట్టేసుకున్నా. ఇంకేం ఓహ్ సూపర్. నాకున్న దుర్గుణాల్లో పచ్చళ్ళు ఎక్కువగా తినడం ఒహటి. తగ్గించాలి. ఆ తరువాతా పెసర మొలకలు లాగించా.

నెమ్మది నెమ్మదిగా Raw Vegan life style పెంచుతున్నా అని చెప్పాగా. అందులో భాగంగానే ఇదీనూ. 

7 comments:

 1. sir..reduce sodium intake...especially at night....n dont do crash dieting...i

  ReplyDelete
 2. విచిత్రంగా నాలో సోడియం తక్కువ వున్నట్లుగా రక్త పరీక్షల్లో తేలింది. అందువల్ల మా డాక్టర్ ఉప్పు పెంచమన్నాడు అయితే మామూలు ఉప్పు కాకుండా సెల్టిక్ సాల్ట్ వాడమన్నాడు. అది అమెజాన్ లో ఆర్డర్ చెయ్యడానికి బద్దకం వేసి ప్రస్థుతం సముద్ర లవణాన్ని (Sea Salt) మాత్రం వాడేస్తున్నాం.

  క్రాష్ డైటింగ్? అంత లేదు లెండి. ఏదో మంచి ఆహారం తిన్నప్పుడు ప్రకటిస్తుంటాను కానీ చెత్త అహారాన్ని తిన్నప్పుడు ఇలా బ్లాగులో పెట్టుకోను కదా :) వారానికి ఒక పౌండ్ కంటే తగ్గకూడదని తెలుసు. నా బరువు చక్కగానే వుంది కాకపోతే బొజ్జనే బాగా వుండేది కానీ కాస్త తగ్గించాను. బరువు తగ్గించకుండా బొజ్జ తగ్గించడం ఒక సవాల్. అందుకోసం ఒకవైపు జిమ్ము చేస్తూ కండ పెంచుతూ మరోవైపు మంచి ఆహారం పుష్టిగా తినేలా ప్రయత్నిస్తున్నా. Thanks for your concern.

  ReplyDelete
 3. ఏం డైటింగో ఏమో...మీరు చెప్పేది చదువుతుంటే ఐయాం సో పిటీ ఆన్ యు

  ReplyDelete
 4. @ పద్మార్పిత
  అబ్బే, నేను కష్టపడి అలా తినట్లేదండీ, ఇష్టపడి అలా తినేస్తున్నాను. అది డైటింగ్ కాదండీ - అది నా ఆహారం - జీవన సరళి. రా వెగన్ ఆహారం వల్ల ప్రయోజనాలూ, సాధారణ ఆహారం వల్ల వస్తున్న దుష్ఫలితాలూ చూసాకా, విన్నాకా, తెలుసుకున్నాకా సాధారణ ఆహారం మీద ఏవగింపు కలుగుతోంది. ఇప్పుడు Raw Vegan Food తినడమే రుచికరంగా, ఉత్సాహంగా వుంటోంది. అందులో కూడా ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ తినెయ్యవచ్చు. నాకేదో కొలెస్ట్రాల్ ఎక్కువయ్యో లేదా డయాబెటిస్ వచ్చో చెయ్యట్లేదండీ - అవన్నీ రాకుండా జాగ్రత్తపడుతున్నాను. అలా అని మొత్తం అదే తినేస్తా అని కాదు. మిగతావి కూడా అప్పుడప్పుడు, కొంచెం కొంచెం తింటాను. మొత్తం మీద ఈ రా వేగన్ 90% - మిగతావి 10% తింటాను.

  ఈ తరహా ఆహారం మీద ఆసక్తి వున్నవారు, ఆ ప్రయోజనాలు తెలుసుకోదలచిన వారు raw vegan food నెట్టులో అని వెతికితే పుష్కలమయిన సమాచారం, రెసిపేలూ దొరుకుతాయి.

  మరి ప్లేసిబోనో నిజమేనో తెలియదు కానీ ఈ తరహా ఆహారం మొదలెట్టిన దగ్గరి నుండీ మనస్సూ, శరీరం ఉత్సాహంగా, శక్తివంతంగా, తేలిగ్గా, చురుకుగా వుంటోంది. ఒక ముఖ్యమయిన మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల నేను స్లీప్ అప్నియా తో బాగా బాధపడుతుండేవాడిని. ఆశ్చర్యంగా ఇది మొదలెట్టగానే అది తగ్గిపోవడంతో కూడా ఈ ఆహారం మీద నమ్మకం పెరిగింది.

  మరో సారి - ఇది నా డైటింగ్ కాదండీ - ఇది నా ఆహారం :)

  ReplyDelete
 5. ఇవాళ నా లంచ్: క్లాసిక్ ఐస్‌బర్గ్ సలాడ్, పప్పు, ఆవకాయా, కొద్దిగా వరి అన్నం.

  ReplyDelete
 6. pani lo pani aa veg organic tineyyandi.*

  ReplyDelete
 7. వీలయినంతవరకూ ఆర్గానిక్ ఆహారమే ప్రయత్నిస్తున్నానండి.*

  ReplyDelete