నాకో బ్లాగు బిరుదు పడెయ్యండి బాబయ్యా

ఇన్నాళ్ళూ బ్లాగులు వ్రాసాను. ఒక్కళ్ళన్నా నా గురించి పట్టించుకున్నారా? పాపం ఓ బిరుదు ఇచ్చేస్తే ఈ అల్పజీవికి కి ఆత్మశాంతి కలుగుతుంది కదా అని ఎవరయినా ఆలోచించారా లేదు. ఖర్చుపెట్టి సన్మానాలేమీ అఖ్ఖరలేదండీ  - పైసా ఖర్చు లేకుండా ఓ బిరుదు నా ముఖాన పడెయ్యొచ్చు కదా. ఇన్నాళ్ళ నుండీ వ్రాస్తున్నాను. ఇప్పటికి కనీసం మూడో నాలుగో బిరుదులయినా వుండాలి కానీ నాకు ఒక్క బిరుదు కూడా లేకపోవడం ఎంత పాపం?

నిన్నా మొన్న వచ్చిన కొందరు బ్లాగర్లకి కూడా  బిరుదులున్నాయి. ఒక్క సినిమా రిలీజ్ కాకుండా నే కొందరు హీరోలు బిరుదులు తగిలించుకుంటున్నట్లు ఇకముందు ఒక్క పోస్టు వ్రాయకుండానే 'బ్లాగు రత్న' గట్రా ప్రకటిస్తారేమో.

నాకు గుర్తుకు వున్న కొన్ని బిరుదులు:
ఆది బ్లాగరి - ఆదిమ మానవుడి తరహాలో.
బ్లాగక్క - వీరెవరో మీకు తెలిసే వుంటుంది.
బ్లాగు నాయకి లేదా అలాంటిది - ఈ బిరుదు నాకు సరిగా గుర్తుకులేదు.  ఓ మూడు నాలుగు పోస్టులు ఆవేశంగా వ్రాసినట్లున్నారు. బిరుదు వచ్చేసింది.
బ్లాగు గాంధీ - వీరేమయినా సత్యాగ్రహాలు చేసారేమో నాకు తెలియదు. నేను మాత్రం బ్లాగుల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని సంకలినిల నియంతృత్వానికి వ్యతిరేకంగా - అభిప్రాయ ప్రకటనకి మద్దతుగా 'కూడలిలో యుద్ధం ' అని నేను బ్లాగుల్లో చేరిన కొన్ని నెలలకే యుద్ధం చేసాను. ఓ అప్పట్లో అది ఓ పెద్ద సంచలనం. కొంతమందికయినా గుర్తుండే వుంటుంది. నేను శృంగార పరమయిన విషయాలు వ్రాస్తున్నా అని బ్యాన్ చేసేరు లెండి. బ్లాగుల్లో భావ స్వేఛ్ఛకి అడ్డు వుండకూడదని పోరాటం చేసాను - అది విజయవంతం అయ్యింది.
బ్లాగు భీష్ముడు - ఇది నేను సరదాగా ఒకే ఒక్కసారి ఒకరికి ఇచ్చిన బిరుదు.

ఇంకా మీకేమయినా బిరుదులు గుర్తుంటే చెప్పండి.

సరే, ఇదే మీకందరికీ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా నాకు మీరంతా కలిసి బిరుదు ఇచ్చారా సరేసరి - లేదా...లేదా..లేదా నాకు నేనే ప్రకటించేసుకుంటాను. తస్మాత్ జాగ్రత్త. 

26 comments:

 1. Blagagni.....teesukondi

  ReplyDelete
 2. అబ్బే. బ్లాగాగ్ని నాకు సూట్ అవలేదేమో అనిపిస్తోంది. అది మరీ రెబల్ లాంటి వారికయితే నప్పుతుంది. ఈమధ్య బ్లాగుల్లో కాస్తంత 'పనిలేని' వారు తప్ప ఎవరూ అలా వ్రాయట్లేదు.

  ReplyDelete
 3. annai....BloguMohana....Ela Undhi....Y

  ReplyDelete
 4. @ అజ్ఞాత1 మే, 2015 12:58 [PM]
  బ్లాగువీర..ఏకవీర..తోకవీర లాగా పర్లేదు కానీ ఇంకా మాంఛి కిక్కిచ్చే బిరుదుల కోసం చూస్తున్నా.

  @ అజ్ఞాత1 మే, 2015 12:58 [PM]
  బ్లాగుమోహన అనగానేమి? మోహన్ బాబు అనా మోహనాకారుడు అనా? ఎలాగయినా నాకంత దృశ్యం లేదు లెండి.

  అన్నట్లు నాకు 'పులి రాంబాబు' అని ఓ బిరుదు వుండేది అప్పట్లో. కంప్యూటర్ కోర్స్ చేస్తున్న రోజుల్లో తోటి అమ్మాయిలు పెట్టారు ఆ పేరు. అందుకో చిన్న కథ వుంది లెండి. అది అందరికీ ఎప్పుడయినా చెప్పానో లేదో గుర్తుకులేదు. కొద్ది రోజుల్లో చెప్పేస్తా.

  ReplyDelete
 5. బ్లాగు బంధు
  (ఆడ, మగ అనే తేడా చూపించకుండా, అందరినీ ఆదరిస్తారు కాబట్టి ) :P

  $iddharth

  ReplyDelete
 6. @ $iddharth
  సర్లెండి. బ్లాగుల్లో నాకు వున్న ఇమేజికి జనాలు నేనంటే పారిపోయేట్లుగా వున్నారు - నేను బంధువునేంటీ :)

  ReplyDelete
 7. ఏదో ఒకటి తగిలించేసుకో మూర్ఛబిళ్ళలా పడి ఉంటుంది, నసపెట్టి చంపకు.

  ReplyDelete
 8. మీకో పది బ్లాగులు ఉంటే "దశాధిక బ్లాగ్ వీర" (శతాధిక వృద్ధుడిలాగా) అనొచ్చు,
  మీరు బ్లాగుల్లో అందరికీ పెద్ద దిక్కైతే "బ్లాగ్ దిక్సూచి" అనొచ్చు
  బ్లాగర్లకి మార్గదర్శకులైతే "బ్లాగు దీపక్" అనొచ్చు,
  బ్లాగుల్తో పాటూ ఋఅచనలు కూడా చేస్తే "బ్లాగు సవ్యసాచ్" అనొచ్చు

  అలాంటి వాళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారని
  కొందరి అభిప్రాయం.. మరి మీకే బిరుదు ఇవ్వాలబ్బా ??

  ReplyDelete
 9. Bold blogu veera

  ReplyDelete
 10. "Rasika raaju" title iccaam!

  ReplyDelete
 11. @ అజ్ఞాత1 మే, 2015 6:13 [PM]
  అలాగే బాబయ్యా.

  @ అజ్ఞాత1 మే, 2015 7:35 [PM]
  పైన ఇచ్చిన సమాధానం మీరు చూడనట్టున్నారు :)

  @ అజ్ఞాత2 మే, 2015 1:38 [AM]
  సమరం గారూ మేమూ కుటుంబ స్నేహితులం. వారికి హోమోఫోబియా వుంది. అందువల్ల ఆ పేరు తిరస్కరిస్తున్నాను.

  ReplyDelete
 12. @ అజ్ఞాత2 మే, 2015 2:22 [AM]
  అలాంటి వాళ్ళు అందరూ వున్నారు కాబట్టి మీరు అన్నట్టే అవి నాకెందుకులెండి :)

  @ అజ్ఞాత2 మే, 2015 5:02 [AM]
  ఇంగ్లీషూ తెలుగూ కలిపారు కాబట్టి నాకు నచ్చలేదు.

  @అజ్ఞాత2 మే, 2015 5:31 [AM]
  సర్లెండి. నాకంటే రసికరాజులు బోల్డెంత మంది మనలో వున్నారు. కాకపోతే వాళ్ళెవరూ బయటకి చెప్పుకోరు - నేను చెప్పుకుంటా అంతే.

  ReplyDelete
 13. బ్రహ్మానందం ఏదో సినిమాలో పద్మశ్రీ అని పేరుపెట్టుకున్నట్టు నే బ్లాగుశ్రీ అని బిరుదు పెట్టుకుంటే ఎలా వుంటుందేంటీ? లేదా మగధీర లాగా బ్లాగుధీర ఎలా వుంటుంది? అయినా నేను పెట్టుకోవడానికీ, మీరు పెట్టడానికీ ఏముంది లెండి కానీ అసలు ప్రజలు అలా నన్ను పిలవాలి కదా.

  ReplyDelete
 14. Aaaaa blogger
  How is it

  ReplyDelete
 15. బ్లా'గే' వీరుడు :D

  $iddharth

  ReplyDelete
 16. @ అజ్ఞాత3 మే, 2015 8:28 [PM]
  Aaaaa అంటే పలు రకాలుగా అర్ధం తియ్యవచ్చు. మీరు అనుకుంటున్న అర్ధం ఏమిటో నాకు అర్ధం కాలేదు :)

  @ $iddharth
  బావుంది. క్లుప్తంగా బ్లాగే వీర లేదా బ్లాగే ధీర అనొచ్చు. :))

  ReplyDelete
 17. బ్లాగు పక్షి - అబ్బే అక్కుపక్షి లాగా ఉంది!
  బ్లాగు రత్న - రాళ్ళూ రప్పలూ అంటారేమో?
  బ్లాగు వెన్నెల - ఆడపేరులా ఉంది కదూ!
  బ్లాగు మోత - జనం మోతెక్కించరు గద?
  బ్లాగు భీకర - ఇది బాగుంది నాకు భయపెట్టేస్తుంది!

  ReplyDelete
 18. బ్లాగు భయంకర

  ReplyDelete
 19. @ హరిబాబు
  హహ. కష్టపడి క్రోడీకరించారు - ధన్యవాదములు :)) వాటిల్లో బ్లాగు రత్న కాస్త బావుందండీ. ఇక సన్మానాలు ఎవరయినా చేస్తారేమో కనుక్కోవాలి. అప్పుడు పెట్టేసుకుంటా ఏదో ఒక బిరుదు. మరీ సైలెంటుగా నాకు నేను పెట్టేసుకుంటే బావోదు.

  @ కిషోర్
  మరీ అంతగా చదివేవాళ్ళని వణికిస్తున్నానేమిటండీ?!

  ReplyDelete
 20. మీకు తగ్గట్టుగా ..అందరికీ ఆమోదయోగ్యం గా ఉంటుందనీ.. అందరికీ ఇష్టమనీ..
  "బ్లాగుమామ".. చందమామ లా అందరికీ ముద్దొచ్చేలా.. లేదా సింపుల్ గా మామ.. ఎలాఉన్నయ్ గురువుగారు.. అన్నట్ట్లు నేనిప్పుడు ఇక్కడ సెయింట్ లూయిస్ లో ఉన్నా.. ఎలా ఉంది నా బిరుదు బ్లాగుమామాజీ..

  ReplyDelete
 21. @ కాయ
  నన్ను చాలామంది అభిమానంతో మామా, మామాజీ అని పిలుస్తుంటారు. బ్లాగుమామ బాగానే వుంది కానీ బ్లాగుబావ అని మాత్రం పిలవకండేం ;)

  అసలు మీరెక్కడ వుంటారో నాకు గుర్తుకులేదు. మీరు అసలు నాకు చెప్పారో లేదో.

  ReplyDelete
 22. ikkada inko peru coin chesaru..bavuntademo sudande...
  http://ssmanavu.blogspot.in/2015/05/blog-post_27.html

  ReplyDelete
 23. ఆ సర్లెండి. మనువు గారు మెచ్చుకున్నారు అంతే కానీ బిరుదేమీ పడెయ్యలేదుగా!

  ReplyDelete