బ్లాగర్లూ...బ్లాగాభిమానులూ...

... మనం కలుసుకుందామా? US మరియు కెనడాలో వున్న బ్లాగర్ల వరకు మాత్రమే అడుగుతున్నాను. 

మా పూణే పిజి స్నేహితులం కలిసి రియూనియను కోసం ఈ ఏడాది చివర్లో మెక్సికోకి క్రూయిజ్ వెళ్దామనుకుంటున్నాం. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి కుటుంబాలతో సహా కలుస్తున్నాం. కొంతమందికి ఇలా కుటుంబాలతో కలిసి రావడం ఇష్టం లేదు కానీ ఇంతకుముందే అలా నిర్ణయించినందువల్ల అలా అని కొంతమందిమి మా ఇళ్ళళ్ళో పెళ్లాలకి చెప్పేసాం. ఇప్పుడు వాళ్ళని వద్దంటే వాళ్ళు మా తాట తీస్తారు! అందుకే ఈసారికయితే ఇలా కానిచ్చేద్దామని నిర్ణయించాం. మూడేళ్ళ క్రితం మా తొలి రియూనియన్ లాస్‌వెగాస్ లో జరిగింది. అప్పుడు పెళ్ళాలు లేరు కాబట్టి పండగ చేసుకున్నాం . ద్వందార్ధాలు తీయండి ఫర్వాలేదు కానీ విపరీతార్ధాలు తీయకండేం.

అలాగే మనం కూడా కలుసుకుంటే ఎలా వుంటుందని ఒక ఆలోచన మళ్ళీ వచ్చింది. కొంతకాలం క్రితం ఇలా ప్రస్థావించాను కానీ కొసకు వెళ్ళలేదు అది. ఆసక్తి వుంటే చెప్పండి. ఎక్కడన్నా అందరం కలుద్దాం. అందరం అంటే ఇది తొలిసారి కాబట్టి ఎక్కువమంది రారు లెండి. మహా అయితే నలుగురయిదుగురు. ఎక్కువ ఖర్చు లేకుండా ఎవరి ఇంట్లో అయినా ఏర్పాటు చేస్తే బావుంటుంది.  ఎవరికయినా అలా వీలయితే చెప్పండి. నేను దీనికోసం యుఎస్ లో ఎక్కడికయినా రావడానికి సిద్ధం. మా కుటుంబం ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా అప్పుడు వీలయితే మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. లాస్‌వెగాస్ లాంటి ప్రాంతాల్లో కలుద్దాం అని అన్నా కూడా రెడీ కానీ అలాంటప్పుడు ఒక భవనం అద్దెకు తీసుకోవాల్సి వుంటుంది కాబట్టి ప్లానింగ్ అదీ కష్టం. ముందు దానికి నేను డబ్బులు చెల్లించి ఆ తరువాత మీరు రాలేకపోయారనుకోండి - నాకు బొక్క. ఇంకా ఎక్కడ కలుసుకుంటే బావుంటుందో చెప్పండి. మరీ ఎక్కువమంది ఆసక్తి చూపించకపోయినా ఇద్దరం ముగ్గురమయినా నేను రెడీ. 

మనం ఎంచక్కా ఒక రెండు మూడు రోజులు బ్లాగుల గురించీ, ఇతర విషయాల గురించి తింటూ తాగుతూ కబుర్లాడుకోవచ్చు. ఏమంటారు? కొద్దిమంది అయినా ఆసక్తి అంటూ చూపిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే వివరాలు తరువాత మాట్లాడుకోవచ్చు. ఆడలేడీ బ్లాగర్లూ, బ్లాగాభిమానులూ ఇలా కలిసేందుకు ఇప్పుడే సిద్ధపడతారని ఇప్పుడే ఆశించలేను కానీ ఎవరయినా ముందుకు వస్తే సంతోషమే. 

10 comments:

 1. శరత్ గారు ఒక ప్రశ్న అండి , మెక్సికోకి క్రూయిజ్ లో వెళదాము అనుకుంటున్నారు కదా ! వీసా గట్ర ఏమన్నా తీసుకోవాలా ? వచ్చేటప్పుడు మరలా USA immigration చెక్ ఉంటుందా అండి ? మీకు గ్రీన్ కార్డు ఉందా ? నేను ఇండియా వెళ్లి పోతాను అనుకోని గ్రీన్ కార్డు లేట్ చేసాను అప్లై చేయటం . ప్రస్తుతం EAD మీద ఉన్నాను .
  డిస్నీ క్రూయిజ్ అనుకోని కూడా ఎందుకొచ్చిన గొడవ అని ఆగాను అండి

  ReplyDelete
 2. @ ఖమ్మం
  నేను కెనడా పౌరుడిని కాబట్టి మెక్సికో కి వీసా అవసరం వుండకూడదు. నా భార్య ఇంకా భారత పౌరురాలే కాబట్టి ఆ వీసా అవసరం అవుతుండొచ్చు. ఇంకా చాలా సమయం వుంది కాబట్టి నెమ్మదిగా తెలుసుకుంటాము. మాకు (మా కుటుంబానికి) క్రూయిజ్ ఇదే తొలిసారి కాబట్టి మీరు అడిగిన వాటిలో కొన్నింటికి సమాధానం తెలియదు. తిరిగి వచ్చేటప్పుడు ఇమ్మిగ్రేషన్ చెక్ తప్పకుండా వుంటుందనే అనుకుంటున్నాను.

  ఎవరయినా తెలిసిన వారు స్పందించండి. ఎవరూ చెప్పకపోతే మా స్నేహితులని అడిగి తెలుసుకొని మీకు చెబుతాను.

  అన్నట్లు మీది ఖమ్మం అయినట్లయితే మాది సూర్యాపేట్. ఖమ్మంలో చాలా ఏళ్ళు గడిపాను.

  ReplyDelete
 3. అవునండి ఖమ్మం నే . ఖమ్మం లోనే చదువుకున్నాను . అసలు వచ్చి ఖమ్మం మధిర మండలం .
  సూర్యాపేట అని ఇంతకు ముందు ఎక్కడో పోస్ట్లో లోనో ఎక్కడో చూసాను అండి :) క్రితం సారి భారత్ వెళ్ళినప్పుడు సూర్యాపేట లో బస్సు స్టాండ్ లో ఒక రాత్రి ఉన్నాను , స్నేహితుని కోసం ఎదురు చూస్తా . మొన్న జర్గిన కాల్పులు చూసి ఓరి నాయనో అనుకున్నా :)

  ReplyDelete
 4. ఆడలేడీ బ్లాగర్లు ముందూ , బ్లాగాభిమానులు తరువాతా.. హెంతటి అవమానం గురువు గారు..తింటూ తాగుతూ అని కూడా ..

  ReplyDelete
 5. @ ఖమ్మం
  మధిర పేరు వింటే మధురంగా అనిపిస్తుంటుంది. ఖమ్మంకు కొత్తగుడెం కు మధ్యలో వుంటుంది కదూ. చాలాసార్లు కొత్తగుడెం వెళుతూ ఆ ఊరు చూసేవాడిని.

  మా క్లోజ్ ఫ్రెండ్ ఇల్లు సూర్యాపేట కొత్త బస్సు స్టాండుకి దగ్గర్లోనే వుంటుంది. జానకీపురంలో ఎన్‌కవుంటర్ జరిగినప్పుడు అతను దగ్గర ఊర్లో ఉదయమే ఏవో అప్పులు వసూలు చేసుకొని తిరిగివస్తున్నాడంట. పోలీసు వాహనాలు హడావిడిగా ఎదురవడం చూసి మా వాడు వెనక్కి తిరిగి వాళ్ళని ఫాలో అయ్యాడుట. వాళ్ళకి అనుమానం వచ్చి ఆగి మావాడిని ఎన్‌కవుంటర్ చేసినంత పని చేసేరంట. క్యూరియాసిటీ కిల్స్ అని ఊరికే అన్నారా :))

  @ కాయ
  ముందో వెనుకో గానీ అస్సలు ఎవరయినా రావాలీ కలవాలి కదా. అప్పుడు తాగుడూ తినుడూ వగైరా వగైరా . ఈ ఆడాళ్ళు ఎలాగూ రారులెండి కానీ వస్తే మాత్రం హుందాగా వుంటాం. తప్పుతుందా.

  ReplyDelete
 6. లేదండి మధిర నందిగామ ( కృష్ణ జిల్లా ) దగ్గర వస్తుంది . కొత్తగూడెం , ఖమ్మం మద్యలో వచ్చేది వైరా అండి , వైరా నుండి కుడి వైపుకు వెళితే మధిర వస్తుంది , ఎడమ వైపుకు వెళితే కొత్తగూడెం వస్తుంది .

  మీ క్లోజ్ ఫ్రెండ్ కి గండం గడిచింది . ఆయనికి బాబు మోహన్ "ఎందుకు ఏమిటి ఎలా " వీడియో పంపండి ఉంటె .:)

  ReplyDelete
 7. హెల్లొ ఖమ్మం,
  మాది మధిరే, ప్రొపర్, నేటివ్ అన్నీను, మా మధిర బాబులు కొంతమంది బ్లాగ్ లో ఉన్నారంటే నాకూ సంతోషమే. ఎక్కడ ఉండేది అమెరికాలో?
  శరత్ గారు, ముందు రీజనల్ బ్లాగ్ మిత్రులతో ఒక రోజు మీటింగ్ పెట్టండి, దూరాలు రావాలంటే నాలాంటొళ్ళకి కష్టం

  ReplyDelete
 8. @ అరుణ్

  షికాగో చుట్టు పక్కల బ్లాగర్లు, బ్లాగు చదువరులు ఎవరయినా వున్నారేమో తెలుసుకుందాం.

  ReplyDelete
 9. షికాగో మరియు చుట్టు పక్కల ఎవరయినా బ్లాగర్లు, బ్లాగు చదువరులు వుంటే నన్ను కాంటాక్ట్ చెయ్యండి. మనం అందరం కలుసుకుందాం.

  ReplyDelete
 10. ఇప్పుడే మీ మెసేజ్ చూసాను . నేను ఫిలడెల్ఫియా లో ఉంటాను అండి . నా ఈమెయిలు ID ఇస్తున్నాను , ఒక వేళ మీరు చూస్తె మెసేజ్ పంపండి
  kiran డాట్ vasireddy అట్ yahoo.com

  ReplyDelete