దీప్తి ఎక్కాడ?

వ్రాయడానికి ఏమీ తోచక ఇది వ్రాస్తున్నా...

ఈమధ్య ఇక్కడ మా ఫ్రెండ్సూ నేను కలిసి అప్పుడప్పుడు వాలీబాల్ ఆడుతూవుంటాం. ఒకరోజు వెళ్ళలేదు. ఆ రోజు నలుగురు తెల్లమ్మాయిలు వచ్చారనీ, తమతో భలే బాగా ఆడారనీ టెక్ష్ట్ ఇచ్చారు. ఇదీ దీప్తి లాంటి కథేనా అని వాళ్ళకు ఒక చిన్న స్టోరీ పంపించాను. 

కట్ చేస్తే ముప్ఫయ్ ఏళ్ళ క్రిందటి విషయం ఇది. నేనూ, మా బంధువుల అమ్మాయిలు ఇద్దరూ, ఇంకా ఇతర పిల్లలూ వగైరా కలిసి మా పెద్దక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాం. ఆ అమ్మాయిలకి వరుసకి నేను బాబాయిని అవుతాను కానీ చాలా ఫ్రెండ్లీగా వుంటాము. అక్కడ వాళ్లకు తెలిసిన వారి ఇంటికి వెళదామని ఆ సాయంత్రం అన్నారు. నేను ఎంతమాత్రమూ ఆసక్తి చూపించలేదు ఎందుకో గానీ. అప్పుడు నా సంగతి తెలిసిన వాళ్ళు ఓ చిన్న ఆశ పెట్టారు. ఆ ఇంట్లో ఇంటర్ చదువుతున్న ఓ అందమయిన అమ్మాయి వుంటుందని, ఆమె పేరు దీప్తి అని చెప్పి ఊరించారు. అప్పుడు నేనూ ఇంటర్ చదువుతున్నా. ఉత్సాహంగా ఆ ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఆ ఇంటికి బయలుదేరాను. 

వెళ్లగానే ఇంటిముందే దీప్తి దర్శనం ఇస్తుందేమోనని చూసాను కానీ అబ్బే లేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నా కూడా కనిపించలేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు ముసలక్కలు వున్నారు. వాళ్ళతో వీళ్ళు కబుర్లాడుతుంటే గుసగుసగా అడిగాను 'దీప్తి ఏదీ' అని. వుంది, 'లోపల టీ చేస్తోందీ' అని వాళ్ళూ గుసగుసగా చెప్పారు. దీప్తి కోసం అలాగే ఎదురుచూస్తూ కూర్చున్నాను. ఇంకా రాలేదు.

దీప్తి ఎక్కాడ? 

3 comments:

  1. " దీప్తి ఎక్కాడ? "

    If I read this some where else, I safely assume that it's a typo but In your case I am getting doubts, Is it really a typo or :-P

    ReplyDelete
    Replies
    1. 'ఎక్కాడ' గురించేనా మీరు అడిగేదీ?! మీరు తెలుగు సినిమాలు చూడట్లేదాండీ? ఎంత ప్రముఖమయిన పదం అదీ - కా దీర్ఘం తీస్తూ! గుర్తుకుతెచ్చుకోండి. లేకపోతే వివరాలు రేపు చెబుతాను.

      Delete
  2. కొత్త బంగారు లోకం సినిమాలో హీరో వరుణ్ సందేశ్ తో హీరోయిన శ్వేతా బసు ప్రసాద్ ఎక్కడ అనేదానికి బదులుగా ఎక్కాడా అని అంటూ వుంటుంది. ఆ పదం అలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి కొన్ని సినిమాల్లో కూడా కొందరు హీరోలు రవితేజ, అల్లు అర్జున్ వగైరాలు సరదాగా ఎక్కడ అనేందుకు బదులుగా ఎక్కాడా అని వాడటం మీరు గమనించేవుంటారు.

    ReplyDelete