పచ్చి పచ్చని ఆహారం అలా అలా నడిపిస్తున్నాం

కొన్నివారాల క్రిందట రా వెగన్ ( Raw vegan) ఫుడ్ లైఫ్ స్టైల్  ప్రయత్నిస్తున్నామని చెప్పా కదా.  ఉదయమే నానబెట్టిన శనగలు అల్పాహారంగా తీసుకుంటాను. మధ్యాహ్నం ఇంకా మామూలు భోజనమే నడిపిస్తున్నా. మరీ ఒకేసారి అన్నీ మారిస్తే నా శరీరం ఎదురుతిరగవచ్చునని నెమ్మదిగా అలవాటు చేస్తున్నా. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే గ్రీన్ స్మూతీ తాగేస్తాను. ఆ తరువాత లెక్క ప్రకారం మొలకలు తినాలి కానీ ఎక్కడా అంతవరకు నానబెట్టినవి నేను వుండనిస్తే కదా. రుచిగా వుంటున్నాయని మొలకలు రాకముందే నానబెట్టిన పెసళ్ళు లాగేస్తున్నాను. ఆ తరువాత పళ్ళు, ఆ తరువాత కీన్వా (Quinoa) తో కొద్దిగా భోజనం.  ఇంకా పచ్చి కూరగాయలు మొదలయినవి పెంచాల్సివుంది. 

కాస్త బొజ్జ తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. నా శరీరం తగిన మోతాదులోనే వుంటుంది కానీ కాస్త బొజ్జ మాత్రం వుంటుంది. ఇలా అయినా సరే దాని పని పట్టాలి. రెండు వారాల క్రితం బెల్ట్ మూడో రంధ్రం దగ్గర పెట్టుకునేవాడిని. ఇప్పుడు మొదటి రంధ్రం దగ్గరే పెట్టేసుకుంటున్నా. అదీ అభివృద్ధి. పాలు, పెరుగు, గోధుమ ఆహారం తగ్గించాను. గోధుమ, బార్లీ లాంటి వాటిల్లో గ్లుటెన్ వుంటుంది. అది చాలామందికి పడవు కానీ వారికి ఆ విషయం తెలియదు. అందువల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మీకు ఆరోగ్యం మీద ఆసక్తి మెండుగా వుంటే గ్లుటెన్ ఇంటోలరెన్స్ గురించి తెలుసుకోండి. అందుకే అవి దూరం పెట్టమని కొందరు సలహా ఇస్తుంటారు - మా డాక్టరుతో సహా. 

మా ఆవిడకి ఇలాంటి మంచి విషయాలు తొందరగా ఎక్కవు. అందువల్ల వీటిల్లో కొన్ని మాత్రం పాటిస్తోంది.  

మా అమ్మాయికి స్కూల్ నుండి రాగానే గ్రీన్ స్మూతీ ఇస్తున్నాం. అందువల్ల తన యొక్క ఆకలి బాగానే తగ్గుతోంది. సాయంత్రం, రాత్రి చిరుతిళ్ళుతినడం తగ్గించింది. కిన్వా తినమంటే ఒక రెండు రోజులు వాయిదా వేసింది. తనకు ఊబకాయం వుంది - ఇలా అయినా అది తగ్గుతుందేమో అని మా ప్రయత్నం.  కిన్వాలో పీచు (ఫైబర్) బాగా వుంటుంది కాబట్టి కొద్దిగా తింటేనే కడుపునిండుతుంది. అది వండేటప్పుడు బాగా కడిగి వండాలి. లేకపోతే ఆ గింజల మీద వుండే saponin వల్ల చేదుగానూ, జిగురు గానూ అవుతుంది.

- Whole Foods market కు వెళ్ళి ఆర్గానిక్ ఆకుకూరలూ, దుంపలూ, తృణ ధాన్యములూ, కోల్డ్ ప్రెస్స్డ్ జ్యూసులూ, వగైరాలూ తెచ్చాను. వగైరాల రుచి ఎలా వుంటుందని మాత్రం అడక్కండేం. ఏదో ఫ్లోలో అలా వ్రాసా.
- రా చక్కెర కూడా తెచ్చా. ఏవో కొన్ని తప్ప మన ఆహార పదార్ధాలలో తెలుపు తగ్గించాలండోయ్. వివిధ కారణాల వల్ల అది మంచిది కాదు.
- జ్యూసులూ, నూనెలూ లాంటివి ప్రాసెస్డ్ వి కాకుండా కోల్డ్ ప్రెస్డ్ వి అయితే మంచిది. మామూలు జ్యూసులలో పీచు (ఫైబర్) వుండదు కాబట్టి పళ్ళు తినడం ఉత్తమం. అయితే కోల్డ్ ప్రెస్డ్ వాటిల్లోని పీచు ఎటూపోదు కాబట్టి అవి ఓకే.

9 comments:

 1. Whole foods - Whole valet
  కొద్ది రోజుల్లో మీ పర్సు ఖాళీ. జాగ్రత్త !
  పొట్ట తగ్గటానికి మరీ ఇంత కష్టపడనవసరం లేదేమో. Drink room temperature water during/after eating. Replace coffee with green tea. Use lemon or honey for green tea, not sugar.

  $iddharth

  ReplyDelete
 2. Blendtek / Vitamix blender ఒకటి కొని కూరగాయలు, పళ్ళు అన్నీ వేసి కొట్టారంటే, ఎక్కడికీ పోకుండా పడి వుంటుంది. You won't regret this purchase. Best home appliance investment I have made so far.

  ReplyDelete
 3. @ $iddharth
  అబ్బే కేవలం పొట్ట తగ్గడం కోసమే కాదండీ - ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు వున్నాయంటున్నారు. ప్రయత్నించి చూద్దాం. ఫలితం కనపడకపోతే రివర్స్ గేర్ వేద్దాం. నిజమే, హోల్ ఫుడ్స్ కి వెళితే పర్సుకి హోల్ పడేట్లుగానే వుంది కానీ అదీ చూద్దాం.

  @ డల్లాస్ నాగ్
  మా ఫ్రెండ్ ఏదో మిక్సీ వాడుతున్నాడు, క్షణాల్లో ఏదయినా మిక్స్ అయిపోతుందంతే. పేరు గుర్తుకులేదు. మీరు చెబుతున్నది కూడా అదేనేమో. కనుక్కుంటాను.

  మనం డల్లాస్ లో కలుసుకున్నాం కదూ? చాలా రోజులయ్యింది బ్లాగుల్లో మిమ్మల్ని చూసి. ఎలా వున్నారు? నా సంగతి అంటారా - తెలుస్తూనే వుందిగా :)

  ReplyDelete
 4. అవును మనం కలిశాం డల్లాస్ లో. ఆ తరువత మీ కజిన్ తో మళ్ళీ మాట్లాడీనప్పుడూ గుర్తుచేశా మనం కలిసిన విషయం. ఆయన నాకిప్పుడు బాగా పరిచయం.

  ReplyDelete
 5. అలాగా. Nice to know that. తనతో మాట్లాడి చాలా నెలలు అవుతోంది.

  ReplyDelete
 6. Okay!but what about dinner?taking raw vegetables?

  ReplyDelete
 7. సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఏం తీసుకుంటానో చెప్పాను కదండీ - అదే నా భోజనం.

  ReplyDelete
 8. I didn't know that we have to wash quinoa...i thought it was already processed.

  ReplyDelete
 9. @ Vineela
  ఒకవేళ ముందే అవి కడిగి వున్నట్లయితే లేబుల్ మీద ప్రి వాష్డ్ అని సాధారణంగా వుండాలి. మీరు బల్క్ గా కొంటున్నట్లయితే సాధారణంగా అవి ముందే కడిగి వుండవు.

  ReplyDelete