అమరావతి బావుంది

ఏ NTR నగరో, తారకరామ నగరో, మరోటో కాకుండా ఆంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం బావుంది. నాకు బౌద్ధం అన్నా, బౌద్ధ క్షేత్రాలు అన్నా కూడా బహుళ ఆసక్తి. దాదాపుగా 25 ఏళ్ళ క్రితం విజయవాడ VK కంప్యూటర్సులో ఒకవైపు విద్యార్ధిగానూ, మరో వైపు ఉపాధ్యాయుడిగానూ పనిచేస్తున్న రోజుల్లో మా సహాధ్యాయులతో కలిసి అమరావతి దర్శించడం నాకు గుర్తుకువస్తోంది. ఆంధ్ర రాజధాని పేరు ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఈ పేరు పెడితే బావుండును అనుకున్నాను. అది నిజమయ్యింది.  సంతోషం. రాజధానికి చక్కని పేరు ఎన్నికచేసుకున్నందుకు గాను ఆంధ్రులకు నా అభినందనలు. 

5 comments:

 1. అదే కాంగ్రెస్ ఉంటే తప్పకుండా రాజీవాబాద్ అయ్యి ఉండేదేమో .మీకు కూడా అభినందనలు .

  ReplyDelete
 2. సర్లెండి, రాజీవాబాద్ అయినా కాస్త నయ్యం - అదే రాహులాబాద్ అయ్యుంటే?!

  థేంక్స్.

  ReplyDelete
 3. @ అజ్ఞాత5 ఏప్రిల్, 2015 9:15 [PM]
  ?

  ReplyDelete
 4. raahulaabad ki.ippatike india ki pattima RAAHUVU..Ap lo kudaanaa?*

  ReplyDelete