తింటే ఆయాసం - తినకపోతే నీరసం - మరి ఎప్పుడు వ్యయామం?

సాధారణంగా ఇంటికి వెళ్ళగానే భోజనం చేస్తాను (ఈమధ్య అలా కాదులెండి - తరువాత వివరిస్తాను ). ఏదో ఒక అల్పాహారం తినేసి కాస్సేపయ్యాకా వ్యాయామానికి వెళ్ళవచ్చు కదా అని నా దిక్కుమాలిన అంతరాత్మ ఘోషిస్తూనే వుంటుంది కానీ వింటే కదా మనం. ఉదయమే పెందరాళే మన ఎంటీవోడు లేచినట్లుగా మధ్యరాత్రి మూడింటికే బ్రహ్మ ముహూర్తాన్నే లేచి వ్యాయామానికి వెళ్ళొచ్చులే అని నా అంతరాత్మని బజ్జో పెడతాను. ఏవేవో కారణాల వల్ల సరిగ్గా రాత్రి నిద్ర పట్టకపోవడమో లేక ఎక్కువగా నిద్ర పట్టడమో జరిగేసి ఉదయం వ్యాయామం సంగతి మీ దేవుడు ఎరుగు కానీ నన్ను నేను తన్నుకొని ఆఫీసుకి వెళ్ళడమే గగనం అవుతుంది. నన్ను మా ఆవిడ గారు తన్ని లేపరు - అదో అదృష్టం - నన్ను నేనే తన్నుకొని లేవాలి. 

అయితే అది ఇదివరకు సంగతి. ఇప్పుడు అలా కాదు. ఇంటికి రాగానే మా ఆవిడ సిద్ధం చేసి ఉంచిన గ్రీన్ స్మూతీ తాగేసి కొన్ని పళ్ళు కానీ సెరియల్ కానీ తీసుకుంటాను. ఆ తరువాత వ్యాయామానికి వెళతాను. అయితే వ్యాయామానికి వెళ్ళాలని ఎందరో అనుకుంటారు కానీ కొందరే క్రమం తప్పకుండా వెళతారు. వ్యాయామానికి వెళ్ళాలని నిర్ణయించుకోవడమే, ఆ దుస్తులు, షూసూ వేసుకోవడమే కష్టం కానీ ఆ తరువాత చాలావరకు ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. జిమ్ముకి వెళ్ళడం, ఎంచక్కా అక్కడ కష్ట పడటం, ఎంతో మంచిగా ఫీల్ అవడమూ అలా అలా అవలీలగా జరిగిపోతుంటాయి. మరో సారి వక్కాణిస్తాను. వ్యాయామానికి అప్పుడు వెళ్ళాలని నిర్ణయించుకోవడం మాత్రమే కష్టం. రిచ్ డాడీ - పూర్ డాడీ పుస్తకంలో రాబర్ట్ కవసాకీ కూడా ఇదే విషయం చెబుతాడు.

ఇంకో విషయం ఏంటంటే గొప్ప సౌకర్యాల కోసం, కొంత అసౌకర్యం భరించకుండా ఏదీ కుదరదు. ఈ విషయం మనం గట్టిగా గుర్తిస్తే ఆ అసౌకర్యాన్ని అవలీలగా అహ్వానిస్తాం. జిమ్ముకి వెళ్ళాలనుకోవడం అసౌకర్యవంతమయిన విషయం - కానీ వెళ్ళి వచ్చాకా ఎంత బావుంటుందీ? అలాగే చెత్త ఆహారం బదులు మంచి ఆహారం తీసుకోవడం అంత సులభం కాదు కానీ కొద్దిగా అసౌకర్యం భరించాలి. ఈ విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాబర్ట్ కవసాకీ చెప్పాడు. ఈ విషయం మనకు ఇదివరకు తెలియదా? తెలుసు. కానీ అతను ఇంకా స్పష్టీకరించాడు. ఆ విషయం అర్ధమయ్యాకా, ఆ చిట్కా తెలిసాకా ఆ అసౌకర్యాన్ని ఎదుర్కొవడానికి మానసికంగా ముందే సిద్ధ పడుతూ అవలీలగా దాటేస్తున్నాను. ఉదాహరణకి ఆఫీసు నుండి ఇంటికి వచ్చే ముందే రా వెగాన్ ఫుడ్డు మాత్రమే ఈ రోజు కూడా తీసుకొవాలని, అటుపై వ్యాయామానికి వెళ్ళాలని పదేపదే అనుకుంటాను. కొద్దిరోజులు అలా చేస్తే మన మనస్సుకి అలవాటయిపోతుంది.

అయితే నిన్న జిమ్ముకి వెళ్ళలేదు - ఎందుకంటే మొన్న వెళ్ళాను కాబట్టి. వెయిట్స్ రోజూ చెయ్యకూడదు - మంచిది కాదు - రోజూ చేస్తే ఓవర్ ట్రైనింగ్ అవుతుంది.

అలాగే ఇదివరలో ఆసక్తి, ఓపిక, తీరికా వుంటే తప్ప వ్యాయామానికి వెళ్ళేవాడిని కాదు. అలా అన్ని ఎప్పుడు కుదుర్తాయండీ? ఎప్పుడో ఒకప్పుడు. అందువల్ల క్రమం తప్పేది. ఇప్పుడలా కాదు. అన్నీ చేసుకొని వెళుతున్నాను. చెప్పా కదా. జస్ట్ మనం వెళ్ళాలని నిర్ణయించుకోవాలంతే - మిగతావన్నీ మనని అనుసరిస్తాయి - అవేనండీ  ఆసక్తీ, ఓపికా, తీరికానూ.  

9 comments:

 1. request cheyyandi aavida gaarini*

  ReplyDelete
 2. http://www.health.com/health/gallery/0,,20506099,00.html

  http://www.amazon.com/Running-Alarm-Clock-Wheels-Black/dp/B00JB4L1UE/ref=pd_sim_hg_2?ie=UTF8&refRID=1SBXBNM8WQJZ81XXVVMQ

  ReplyDelete
 3. పోస్ట్ అప్‌డేట్ చేసాను.

  ReplyDelete
 4. @ అజ్ఞాత*
  చాలాసార్లు చెప్పాలెండీ - అయినా ప్రయోజనం లేదు.

  @ eblroagjger
  హహ. అలాంటి అలారంలు కూడా వుంటాయని తొలిసారి తెలిసిందండీ. చాలా థేంక్స్. ఇప్పుడు వాటి అవసరం అంతగా లేదుగానీ తప్పకుండా అవసరం అయినప్పుడు అవి ఆర్డర్ చేస్తాను :) నేను పెళ్ళి చేసుకున్నాకా నాకు ఓ అలారం దొరికింది కదా అనుకున్నా కానీ ఆ అలారం పనిచెయ్యడం లేదు.

  @ జయ
  :)

  ReplyDelete
 5. మీరు ఉండేది చికాగో లోనేనా? ఎక్కాడా? నేను కూడా ఉండేది దేశీవిల్ల్ (నేపర్విల్లె) లోనె

  ReplyDelete
 6. @ అరుణ్
  మేము వుండేది నార్త్ వెస్ట్ సబర్బ్స్ లో. మీకు కలుసుకోవాలని లేదా మాట్లాడాలని ఆసక్తి వుంటే sarathn at hotmail dot com కి ఈమెయిల్ ఇవ్వండి.

  ReplyDelete
 7. @ అరుణ్
  హహ. నేపర్విల్లే ని దేశ్‌విల్లే చేసేసారా మీరంతా కలిసి :)) నేను టొరొంటో లో వున్నప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువగా వుండే ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ను 'ఆంధ్రా భవన్' అని పిలిచేవాళ్లం.

  ReplyDelete
 8. Q:తింటే ఆయాసం - తినకపోతే నీరసం - మరి ఎప్పుడు వ్యయామం?
  A:తినీ తినకుండానూ తిన్నట్టూ తిననట్టూ కాకుండా చేస్తే కాస్త నయం!

  ReplyDelete