పెళ్ళాలను తీసుకెళ్ళాలా వద్దా?!

మా PG విద్యార్దుల రియూనియన్ మూడేళ్ళ క్రితం లాస్ వెగాసులో జరిగింది. అదో sin city. అందువల్ల అక్కడేం జరిగింది, ఏం చేసాం అన్న విషయాలు మీరు అడగనూ వద్దు - నేను చెప్పనూ వద్దు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడి విషయాలు అక్కడే మరచిపోవాలని ఓ అనధికార నియమం.  మూడేళ్ళ తరువాత మళ్ళీ కలవాలని అప్పుడు నిర్ణయించాం.

చూస్తూండగానే ఆ మూడేళ్ళూ అయిపోయాయి. మళ్ళీ అందరమూ ఎక్కడో ఒకచోట కలవాలి. బాగానే వుంది కానీ కొందరు సభ్యులు కుటుంబాలతో సహా కలుద్దాము అంటున్నారు. ఏలేశ్వరం వెళ్ళినా శనీశ్వరం ఎందుకన్నట్లు కొందరేమో పెళ్ళాలని పట్టుకు రావద్దంటున్నారు. కలిసేదే ఆనందంగా గడపడం కోసం మళ్ళీ వాళ్ళు వస్తే ఇంకేం ఆనందం అని కొందరు జల్సా రాయుళ్ళు వాపోతున్నారు. తమ భార్యలని తీసుకెళ్ళకపోతే ఇంట్లో వీపు విమానం మోత మోగే అవకాశాలున్న భర్తాగ్రేసరులేమో  పట్టుకువస్తాం బాబూ అని వాపోతున్నారు. నేనేమో ఒక కాలు అటూ ఒక కాలు ఇటూ వేసినట్టుగా మాట్లాడుతున్నాను. ఇలా మా కాన్‌ఫరెన్స్ కాల్స్ లో ఈ విషయం ఎటూ తెగడం లేదు.    
కుటుంబాలతో సహా రియూనియనుకి వెళ్ళాలనుకుంటున్నాం అని అంటే నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నవ్వుతున్నారు :( మీ రియూనియనుకి వాళ్ళెందుకు - మీ ఎంజాయ్మెంట్ స్పాయిల్ చెయ్యడానికా అంటున్నారు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే పరిస్థితేంటో మీకు తెలుసుగా అని హెచ్చరిస్తున్నారు! వచ్చే క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయరూ క్రూయిజులో గడపాలని ఒక ఆలోచన. పాటలూ అవీ ఇవీ పెట్టి హోరిత్తిద్దామని ఒకరు అన్నారు. రికార్డింగు డ్యాన్సులూ గట్రా పెట్టాలని నేను సెలవిచ్చాను. మేజువాణీ (పదం కరెక్టేనా?) పెడితే ఎలా వుంటుందని ఇంకెవరో అన్నారు. మన ఆడాళ్లంతా వస్తే ఇవన్నీ జరిగే పనులేనా అని మరొకరు ఉసూరు మన్నారు.

మన ఆడలేడీస్ వుంటే ఇంకేం ఫ్రీ గా వుంటాం. పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా ప్రవర్తించాలి, పద్ధతిగా తాగాలి, పద్ధతిగా పోట్లాడాలి - ఆ మాత్రం దానికి అక్కడిదాకా ఎందుకు అని మరి కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. వాళ్ళకు కూడా మన అందరినీ కలవాలని వుంటుంది కదా అని భార్యావిధేయులు వాదిస్తున్నారు. అబ్బా వాళ్ళు వాళ్ళు వాళ్ళ రియూనియన్లకి వెళ్ళొచ్చుగా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఇలా మాలో మేము కొట్టుకుఛస్తున్నాం. నాకేమో ఓ సారి ఈ కుటుంబాలని రియూనియనుకి తెచ్చేస్తే పరిస్థితి అందరికీ అర్ధమయిపోయి తెనాలి రామలింగడి పిల్లి వ్యవహారం (కథ తెలుసునా లేక చెప్పాలా?లా అయిపోయి మరోసారి మరెవ్వరూ పెళ్ళాలని పట్టుకువస్తామని ఛస్తే అనరు కదా అని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాను.

మీరేమంటారేంటీ?

8 comments:

 1. పెళ్లాలకు కూడా ఫ్రీడం ఇస్తే, అంటే ఎప్పుడైనా వారు తమ ఫ్రెండ్స్ తో సరదాగా సినిమాకో, షాపింగుకో వెళ్తానంటే పిల్లా జెల్లా ని మొగుళ్లు చూసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో పర్మిషన్ ఈజీగా దొరుకుతుంది. అలా కాకుండా, మీకు ఇల్లే సర్వస్వం, మేము హాయిగా ఊళ్లేగుతాం అన్నట్టుగా మనం ప్రవర్తిస్తే వాళ్లకి పాపం కాలదా మరి? నేను కూడా ఒకప్పుడు ఇలాగే "boys day out" కి ప్లాన్ చేస్తే ఒక్క ఫ్రెండ్ పెళ్లాం కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నాకయితే అలాంటి ఇబ్బందులేవీ లేవు గురువుగారూ, కానీ వెళ్లటానికి కంపనీయే లేదు :(

  $iddharth

  ReplyDelete
 2. మీ వ్యాఖ్య చూసాక ఒక ఐడియా మళ్లీ వచ్చింది. బ్లాగర్ల మరియు బ్లాగాభిమానుల మీట్ పెడితే ఎలా వుంటుంది. అప్పుడెప్పుడో ఇలాంటి ప్లాన్ వేసా కానీ ఫెయిల్ అయ్యింది. దానిమీద కొద్దిరోజుల్లో ఒక టపా కట్టి అయితే చూస్తాను. నలుగురయిదుగురు ఉత్సాహం చూపినా ముందుకు వెళ్ళవచ్చు.

  ReplyDelete
 3. Enjoy. Dont let wife in

  ReplyDelete
 4. @ అజ్ఞాత8 ఏప్రిల్, 2015 10:15 [PM]
  :)

  ReplyDelete
 5. bothigaa bhayam ledu pellaam ante.*

  ReplyDelete
 6. మీరు హిందీని ఇంగ్లీషులో వ్రాసారో, తెలుగుని ఇంగ్లీషులో వ్రాసారో, అసలు ఏం వ్రాసారో నాకయితే అర్ధం కాలేదు.

  ReplyDelete