మోడీ 'సూట్'కేసు!



పై చిత్రంలోని పెద్ద మనిషి ఎవరో గుర్తించగలరా?  గుర్తిస్తే అది ఏ సందర్భంలో తీసిన ఫోటోనో చెప్పగలరా? అతని బ్రతుకుని బస్‌స్టాండ్ చేసిన ముఖ్యమయిన సంఘటణల్లో అది ఒకటి.

అతను అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్. హరికేన్ కత్రినా చేసిన విధ్వంసాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనుండి చూస్తున్నప్పుడు తీసిన ఫోటో అదీ. తెల్లారాక ఆ ఫోటొ పత్రికల్లో చూసాక అతని మనస్సు కీడు శంకించింది. అనుకున్నట్టే అయ్యింది. అప్పటినుండీ అతని పతనం ప్రారంభం అయ్యింది. ఆ ఫోటోలో వున్న పొరపాటు ఏంటీ? చెప్పండి చూద్దాం. 

ఒకవైపు ఘోరమయిన కత్రినా హరికేన్ తో న్యూఆర్లియాన్స్ నగరం అతలాకుతలం అవుతుంటే అయ్యగారు ఎంచక్కా ఎయిర్ ఫోర్స్ వన్ లో టెక్సాస్ నుండి వాషింగ్టన్ వెళ్ళారు. పైగా న్యూఆర్లియాన్స్  విధ్వంసాన్ని పైనుండి చూసుకుంటూవెళ్ళారు. అక్కడన్నా లేదా అక్కడికి దగ్గర్లోని ఏదయినా సురక్షిత ప్రాంతంలో ఆగి ప్రజల యోగక్షేమాలు పట్టించుకున్నారా? లేదు. సామాన్య ప్రజానీకంతో ప్రెసిడెంట్ డిస్‌కనెక్ట్ అవడం దీనిమూలాన అందరికీ అర్ధమయ్యింది. అప్పటినుండీ అతనికి ప్రజామోదం తగ్గడం మొదలయ్యింది. 


బుషుకూ మోడీకి ఏంటి పోలిక అంటారా? అక్కడికే వస్తున్నా. పది లక్షలో లేదా ఒక కోటో పెట్టి బ్రిటన్ నుండి తెప్పించిన పైగా తన పేరు అల్లించిన కోటు ప్రెసిడెంట్ ఒబామా వచ్చినప్పుడు వేసుకున్నారు కదా. 'మేక్ ఇన్ భారత్' అంటూ 'మేడ్ ఇన్ బ్రిటన్' దుస్తులను పైగా అంత ఖర్చు పెట్టి, అంతకు పైగా తన పేరు అల్లించుకొని సూటు వేసుకోవడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రియతమ ప్రధాని గారు తమ సామాన్య ప్రజానీకానికి దూరంగా జరుగుతున్నట్టు అనిపించడం లేదా? ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడితేనే ప్రజాదరణ నిలబడుతుంది. పునరావృతం అయితే మాత్రం కష్టమే.

6 comments:

  1. HI, MODI gaari one and only weakness dress lu ata.paapam danthone lokuva ipoyaadu.

    ReplyDelete
  2. మోడీ మరింత లోకువ కాకుండా జాగ్రత్త పడతారనే ఆశిద్దాం.

    ReplyDelete
  3. మీరన్నట్లుగానే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా
    ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు
    పోల్ ప్రిడిక్షన్స్ వెలువడుతున్నాయి. నిజానికి
    ఆ విధమైన ఆలోచనా సరళి ప్రజాస్వామ్యానికి
    మేలు కలిగించేదే. ఫలితం కూడా పాలక పార్టీకి
    వ్యతిరేకంగా వెలువడితే దేశానికి మంచిదే.
    సూట్ కు సూట్ కాడని ఖద్దరు దేశ ప్రధాని
    గ్రహించాల్సిన క్షణం ఇది. make in india
    కాస్తా mock of india గా ఐనట్లు ఆయన
    యెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది...
    ఆయనకు ... దేశానికి ...

    ReplyDelete
  4. శ్రీ శరత్ గారు మీ / నా స్పందనలను ఒక పోస్ట్ గా
    మలచడం జరిగింది. దయచేసి ఈ లింక్ లో చూడగలరు...

    http://nmraobandi.blogspot.in/2015/02/blog-post_7.html

    ReplyDelete
  5. అవన్నీ పక్కన పెట్టండి..కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి మీద పీకల వరకూ కక్ష కట్టిన ప్రజలు,పంతం పట్టి కాంగ్రెస్ ని ఓడించారు....వారి అవినీతి మీద విచారణ చేసి,వివరాలను.. వీలయితే మింగిన సొమ్మునూ వెనక్కి లాగి.. మోదీ, అవినీతి పరులను రోడ్డున నిలబెడతారనుకున్నారు జనం..ధరల పెరుగుదల ను ఏ ప్రభుత్వం ఆపలేదన్న నిర్ణయానికి జనం ఎప్పుడో వచ్చేసారు....ఇప్పుడు చూస్తే..కనీసం కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల మీద కనీసమైన విచారణ జరుగుతున్నాట్టు కూడా కనిపించడం లేదు..ఈ విషయాలు ప్రజలు పబ్లిక్ గానే చర్చించుకుంటున్నా...బీజేపీ వారికి చీమ కుట్టినట్టు లేదు...బీజేపీ ని గెలిపించినా, వారు ఒరగబెడుతున్నది ఏమీ లేదన్న నిర్ణయానికి వచ్చారు జనం...ఇక బీజేపీ పతనానికి ఒక రాయి పడ్డం ప్రారంభం అయితే ఆ పార్టీ పని ఖతం అయినట్టే...

    ReplyDelete
  6. @ mmraobandi
    సంతోషం

    @kvsv
    ఢిల్లీ ఎక్జిట్ ఫలితాలను బట్టి కేజ్రీవాల్ గెలవబోతుండటం ఓకందుకు మంచిదే. ఎంత మంచివారయినా కూడా అంతులేని అధికారం, ఎదురులేనితనం వుంటే నిరంకుశులు అయ్యే అవకాశం వుంది. అలా మోడీ కాకుండా కేజ్రీవాల్ కొంతయినా ఉపయోగపడతాడు. ఇక కెసీఆర్ కూ, చంద్రబాబు నాయుడులకు కూడా తగిన మొగుళ్ళు తయారు కావాలి లేకపొతే అన్నీ ఏకపక్షనిర్ణయాలు, ఒంటెద్దు పోకడలూ వుంటాయి.

    ReplyDelete