వాస్తువిద్వాంసులు!

ఈమధ్య అంతా వాస్తు గురించి చర్చలు జరుగుతున్నాయి కదా. మూఢనమ్మకాల మత్తులో మన  ముఖ్యమంత్రులు జోగడం  విచారకరంగా అనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం ఓ దగ్గరి బంధువు  యుఎస్ వచ్చినప్పుడు డెట్రాయిటులో వున్న ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. ఆ ఫ్రెండ్ చాలా నెలల నుండి బెంచ్ మీద వున్నాడు. మా బంధువుకి కొద్దో గొప్పో వాస్తు జ్ఞానం వుంది కాబట్టి (లేనిదెవరికి చెప్పండి. ఈమధ్య పతోడూ వాస్తు విద్వాంసుడే) ఆ పాండిత్యం అంతా అక్కడ ప్రదర్శించారు. అది కూలగొట్టి ఇక్కడ కట్టమంటారు, ఇది కూలగొట్టి అక్కడ కట్టమంటారు.  నేను  చూస్తూవుండిపోయాను. మా స్నేహితునికి వాస్తు మీద నమ్మకమే కాబట్టి బుద్ధిగా వింటూ వెళ్ళారు. తనకు లేని దురద నాకెందుకు అనుకొని నేను గమ్మున వున్నాను.ఆ తరువాత ఆ మార్పులూ చేర్పులూ ఆ ఫ్రెండ్ ఏమయినా చేయించాడో లేదో నాకు తెలియదు.

అలా మా మిత్రునికి ఇచ్చిన సలహాలు అయిన పిమ్మట 'మిమ్మల్ని వైట్‌హవుజ్ కు తీసుకెళతాను - ఒబామాకి ఈ సలహాలు ఇద్దురు గానీ' అన్నాను. 'అతను వినాలే కానీ ఎందుకు ఇవ్వనూ - భేషుగ్గా ఇస్తాను' అని నవ్వుతూ అన్నారు. ఇంకా నయ్యం - ఒబామా గారికి మన ముఖ్యమంత్రులకు వున్నత తెలివితేటలు లేకపోయాయి కాబట్టి అమెరికా ప్రజలు బ్రతికిపోయారు. లేకపోతే మన గొప్ప వాస్తు పండితులు వైట్‌హవుజ్ కూలగొట్టించి ఏ ఆఫ్రికా అడవుల మధ్యలోనో కట్టించేయగల్రు.

కాస్త వాస్తు విజ్ఞానం వుందంటే చాలు చాలామందికి అది ఒక దురద లాగా వుంటుందనుకుంటా. ఏ భవనం చూసినా, ఎంత మంచి ఇల్లు చూసినా వీరికి నచ్చదనుకుంటా. లక్షణంగా వున్న వాటిల్లో ఏదో ఒకటి పీకించి పందిరి వేయిస్తే గానీ వారి ఆత్మకు శాంతి కలగదు.  ఇలాంటి వాస్తు వేదాంతుల మాట వినే మా చిన్నప్పుడు మా తాత మా ఇంట్లోని పచ్చని జామ చెట్లని కొట్టివేయించాడు. నేను ఎంత రుసరుసలాడినా వినలేదు. ఆ తరువాత మా అమ్మగారు ఎంత వద్దని మొత్తుకున్నా ఇంకో ఇంటి మెట్లు కూలగొట్టించారు. ఎంచక్కా ఎప్పుడూ డాబా మీదికి వెళ్ళి రకరకాలుగా (?!) enjoy చేస్తుండేవాడిని. అందువల్ల అవన్నీ బంద్ అయిపోయాయప్పుడు.  అప్పటి నుండి ఎవరయినా వాస్తు ప్రవీణులు కనిపిస్తే పిచ్చి కుక్కని చూసినట్లు బెదిరిపోతుంటా.

అప్పుడప్పుడూ నా బుర్రకి వాస్తు బాగాలేదేమోనని బెంగపడుతుంటా కానీ వాస్తు విద్వాంసులని అడగడానికి భయపడుతుంటా. వాళ్ళని అడిగితే నా తలకాయకు వాస్తు బావోలేదని ముక్కు కోసి చెవి దగ్గర అతికించుకోమనీ, పెదవులు పీకి తల మీద అంటించుకోమనీ చెప్పేయగల్రు.  ఒక కన్ను పీకించి నన్ను ఒంటి కన్ను రాక్షసుడిగా చేసేయగల్రు. అంచేతా వాస్తు విద్వాంసులూ - మీకో నమస్కారం! 

6 comments:

 1. శరత్‌గారు, ఎలా ఉన్నారు? బ్లాగ్ రాయడం మళ్ళీ ఎప్పుడు మొదలెట్టారు?
  వాస్తు- గీస్తు, జ్యోతిష్యం చాంతాడు ఎంత గొంతు చించుకున్నా పట్టించుకునేవాడే లేదు. నేను మీ ఖర్మ మీ చావు చావండని వదిలేశా.

  ReplyDelete
 2. @ తార
  చాల్రోజుల తరువాత మీరు కనపడ్డారు! మీరెలా వున్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నాను అని అనలేను కానీ బాగవుతున్నా అని మాత్రం అనగల్ను :) ఏదో అప్పుడప్పుడూ బ్లాగులు వ్రాస్తుంటా, మళ్ళీ మూతేస్తుంటా - నా మూడ్ ని బట్టి వుంటుందది.

  బ్లాగులోకంలో అందరూ మేధావులే - కాదంటే ఒక్కడూ ఒప్పుకోడు. అంచేత ఒకడి మాట ఇంకొకడు వినడం కనా కష్టం! అంచేతా ఇతరులని ఏదో ఉద్ధరిద్దామని నేను వ్రాయను - ఏదో నా చేతి దురద తీర్చుకోవడం కోసం, నా మనస్సులోని విషయాలు వెళ్ళగక్కుగొని కొంత ఉపశమనం పొందడం కోసం వ్రాస్తుంటా. హస్తప్రయోగం లాగా ఇది బ్లాగుప్రయోగం అన్నమాటా!

  ReplyDelete
 3. 2000 లో బ్లాగ్స్ సందడి బాగా ఉండెది. నేణు అప్పుడు రాసెవాడ్ని.,. నెక్ష్ట్ జాబ్.. బిజీ అయ్యిపొయి గత 3 నెలలుగా బ్లాగ్ స్పాట్ చుసాను. అందరు 2011.12 అలా అపేసారు. పొని ఫేస్ బుక్ లొ ఉనారెమో అనుకుంటె ఎలా తెలియట్లే. రాయండి, సార్.

  ReplyDelete
 4. శరత్‌గారు, అవును. మనకి అందరూ మేధావులే.
  నేను బానే ఉన్నాను, అదేంటో బ్లాగుల్లో నన్నో పనికిమాలినోడి కింద లెఖ్ఖేసినా, బయట కొద్దిమందికి నా మీద ఎంతో నమ్మకం, ప్రభుత్వానికికుడా, సో మంది (టాక్స్ పేయర్స్) సొమ్ముతో బానే గడిచిపోతుంది.
  ఒక అగ్రిగేటర్ని మూసేయించడానికి, స్నేహం నటించి సీక్రెట్లు లీక్ చేశానని కొంతమంది ఘట్టి నమ్మకం. అంత గొప్ప సీక్రెట్లు ఏమున్నాయో? అసలా సైటు నడిస్తే నాకొచ్చిన నష్టం ఏమితో, మూస్తే వచ్చే లాభం ఏమిటో నాకే తెలియదు, పోనీ మూసేయిస్తే భ.రా.రేనో, ఇంకెవరో నాకేమైనా డబ్బులిస్తారా అనుకుంటే, వాళ్ళకన్నా నా సంపాదనే ఎక్కువ, అదేదో ఖచ్చితంగా ఏదో పెద్ద మానసిక సమస్యేమో అని వదిలేశాను.

  రాయలన్న ఇంట్రెస్టు కుడా లేదు, నేను రాస్తే ఎవడు నమ్ముతాడు?అందుకే బ్లాగుల్లోకి రావడమే మానేశా.
  మీ టపాలు కొన్ని అదిరిపొతాయి, ఎప్పుడూ గుర్తొస్తుంటాయి, పుట్టినరోజు శుభాకాంక్షలకి వ్యతిరేకంగా మీరు రాసిన పోస్టు మళ్ళీ చదవాలనిపించి ఇటొచ్చా. మీరు మళ్ళీ రాయడం చూసి సంతోషమేసింది.

  ReplyDelete
 5. @ తార
  ప్రస్థుతానికి బ్లాగులోకం పెద్దగా గొడవలు లేకుండా బాగానే వుంది.

  వ్రాస్తే ఎవడు నమ్ముతాడు అన్నారు కదా. ఇతరుల కోసం మనం వ్రాయడం ప్రారంభిస్తే చాలావరకు ఆశాభంగమే ఎదురవుతుంది. మన కోసం మనం వ్రాయడమే బావుంటుంది. మనం వ్రాసేది ఏ పత్రికాకో, పోర్టలుకో కాదు. అలాంటప్పుడు జనాలను ఆకర్షించడానికి, జనాలు ఆమోదించడానికి వ్రాయాల్సివుంటుంది. బ్లాగు అలా కాదు. సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ కోసం ఇది. ఎవరు నమ్ముతున్నారు, ఎవరు ఇష్టపడుతున్నారు అనేది మనకు అనవసరం - వ్రాసుకుంటూపోవడమే మన పని.

  ReplyDelete
 6. @ eliababu,

  అవును, అప్పుడు బ్లాగులోకం మీరన్నట్లు సంఘర్షణలు వున్నా కూడా సందడిగా వుండేది - జీవత్వం తొణికిసలాడేది. ఇప్పుడంతా మరీ ప్రశాంతంగా వుంటోంది :) అందుకు కారణం ఇప్పుడు వ్రాస్తున్న బ్లాగరల్లో చాలామంది వృద్ధనారీ ప్రతివ్రతల్లాంటి వారు అవడం కావచ్చు! నేను ఫేస్‌బుక్ వాడను కాబట్టి అక్కడ మన మాజీ బ్లాగర్లు వ్రాస్తున్నారా లేదా అనేది నాకూ తెలియదు. అక్కడ అమ్మాయిల మీద ఏదేదో వ్రాసి బుక్కు అయిన కొంతమంది బ్లాగర్ల గురించి మీకు తెలుసు కదా. చిన్న తప్పుకు పెద్ద శిక్ష ఎదుర్కొన్నారేమో అనిపిస్తుంది. నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ పోలీసు కేసులు పెట్టకుండా గట్టిగా హెచ్చరించి వదిలేస్తే బావుండేదేమో అనిపిస్తుంది. ఇహ ఫేసుబుక్కులోనూ లేకుండా ఇంకా మన మాజీ బ్లాగర్లు ఎక్కడ నివసిస్తున్నారబ్బా!?

  నేను వ్రాయాలనిపిచినప్పుడల్లా వ్రాస్తూనే వున్నా - మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. అప్పట్లో బ్లాగు వ్రాసేవాడిని అన్నారు కదా. మీ బ్లాగు పేరు ఏంటి? మీరూ మళ్ళీ వ్రాయండి మరి.

  ReplyDelete