ఏ రంగు డ్రస్సు ఇదీ?

నిన్న ట్యాబ్ లో  ఒక ఫోటో చూపించి ఏం కలర్ డ్రస్ ఇదీ అని మా అమ్మాయి అడిగింది. చెప్పా. గుడ్ - నీ కళ్ళు చక్కగానే వున్నాయంది. ఓవర్ సెన్సిటివ్ కళ్ళు వున్నవారికి ఆ డ్రస్సు రంగులు మరో విధంగా కనిపిస్తాయంది. ఇప్పుడు CNN site లో అదే వార్తాంశం చూసాను. మీరూ చూడండి. ఆ డ్రస్సు మీకు ఏ రంగుల్లో కనిపిస్తోందీ?


ఇప్పుడే ఇంకో విషయం గమనించాను. ఆ ఫోటోని సగానికి పైగా మీకు కనిపించకుండా స్క్రోల్ చేసి అప్పుడు ఈ డ్రస్ ఏ కలర్స్ లో వుందో గమనించండి. నాకు అయితే ముందు అనిపించిన రంగులకీ ఇలా అనిపిస్తున్న రంగులకీ తేడా వుంది. అయితే ఈ విషయం మా అమ్మాయికి చెప్పను - నా కళ్ళు సగం మేరకు మాత్ర్రమే చక్కగా పనిచేస్తున్నాయని అనేయగలదు!

4 comments:

 1. ఇంతకీ ఏ రంగులో కనిపిస్తే కళ్ళు బావున్నట్టండీ?

  ReplyDelete
 2. @ శిశిర
  చాలా కాలం తరువాత మిమ్మల్ని చూస్తున్నాను. మీ పేరు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే మా అమ్మాయి పేరూ అదే కనుకా.

  నాకు ఏ రంగులు కనిపించాయో ముందే చెప్పలేదు ఎందుకంటే రాజుగారి దేవతా వస్త్రాల కథలోలాగా అందరికీ నాకు కనిపించిన రంగులే కనిపిస్తాయేమోననీ. నాకు కనిపించినవి గోల్డ్ మరియు వైట్. అవి కనిపిస్తే మంచిదని మా అమ్మాయి అంది కానీ తను ఎక్కడ దాని గురించి చదివిందో నాకు తెలియదు.

  ReplyDelete
 3. http://m.bbc.co.uk/news/blogs-trending-31659395

  ReplyDelete
 4. Here's a link that explains the difference in colors and perception:

  http://www.wired.com/2015/02/science...s-color-dress/

  [IMG]http://i57.tinypic.com/2eoy8wp.jpg[/IMG]
  http://tinypic.com/r/2eoy8wp/8

  ReplyDelete