శివుడూ మరియు శరత్తూ

మా ఇంట్లో వారందరికీ శరత్ సాహిత్యం అంటే బాగా ఇష్టం వుండేది. అందుకే నాకు మా నాన్నగారు శరత్ అని పేరు పెట్టారు. అప్పట్లో శివభక్తురాలు అయిన మా అమ్మగారు మొదటి అక్షరం శివుడి పేరుతో కలిసివస్తుంది కదా అని ఆ పేరుకు సంతోషించింది, ఆమోదించింది. ఇక మా ఇంట్లో మా అమ్మమ్మ, తాతయ్యేమో నన్ను శంకరయ్యా అని పిలిచేవారు. అది విన్న నా బాల్యమిత్రుల్లో కొందరు నన్ను తిక్క శంకరయ్యా అని ఏడిపించేవారు.

నా చిన్నప్పుడు మా ఇంట్లో పూజగది వుండేది. అందులో ముఖ్యంగా శివుని ఫోటోలే వుండేవి. మా అమ్మ చేసే శివపూజను శ్రద్ధగా గమనిస్తుండేవాడిని. మిగతా దేవుళ్ళ కన్నా కూడా నాకు శివుడే ఇష్టం. ఎందుకంటే తను నాలాగే భోళాశంకరుడూ, నిరాడంబరుడూనూ. మా అమ్మగారు సహజమార్గం పట్టిన తరువాత శివపూజని వదిలేసారు. ఆ మార్గంలో (ఇతర) దేవుళ్ళని పూజించవద్దని చెబుతారనుకుంటా. మా నాన్నగారేమో పచ్చి నాస్తికులు. అలా చిన్నప్పటి నుండీ వైరుధ్యమయిన  వాతావరణంలో పెరిగాను. దేవుళ్ళూ, గీవుళ్ళూ అన్నీ మూఢనమ్మకాలు అని చెబుతుండేవారు. ఏమయినప్పటికీ పూజ, ప్రసాదం, తీర్ధం బాగా నచ్చేవి నాకు. అందుకే నాన్నని లైట్ తీసుకొని అమ్మకి జై కొట్టేవాడిని.  మరి నాన్నగారు నాస్తిక ప్రసాదం గట్రా ఇచ్చేవారు కాదు మరి! ఇలా లాభం లేదని తనతో నన్ను వెంటేసుకొని విజయవాడ నాస్తికకేంద్రం మరియు ఇతర చోట్లా నాస్తిక సువార్త (?!) సభలకి తీసుకెళ్ళేవారు. అలా డాక్టర్ సమరం గారు గట్రా పరిచయం అయిపోయి అటుపై నాస్తికత్వం మీద ఆసక్తి ఏర్పడి కాస్త పెద్దయ్యాక అనగా 12 ఏళ్ళ వయస్సులో నాస్తిక మతం (?!) పుచ్చుకున్నాను.  

నేను ఎప్పుడన్నా ఆస్తికుడిగా మారితే శివభక్తుడినే అవుతాననుకుంటా.

7 comments:

  1. Hi,aasthikulu gaa maaradaaniki meeku prasaadam lanti attraction kanipinchaali gaa ippudu bhakthi lo.*

    ReplyDelete
    Replies
    1. అప్పుడు తోటి భక్తురాళ్ళు వుంటారు కదండీ :)

      Delete
    2. Hi, subject ni batti vntundaa mee title?SARATH HONEYor SARATH KAALAM*

      Delete
    3. మరీ అతి ఎందుకులే అని హనీ తీసివేసాను.

      Delete
  2. Hi, sudden gaa gayab ipoyaaru?*

    ReplyDelete
    Replies
    1. @*
      హ్మ్. వ్రాయాలంటే ఓపిక, తీరిక, ఆసక్తీ వుండాలి కదా. ఏదో ఒకటి వుండకపోతే అవన్నీ సమకూరేంతవరకూ అంతే సంగతులూ. చూద్దాం.

      Delete
    2. ayyo , teerika, vopika ave vasthaayy. aasakthi pothe kastham*






































      Delete