... BAD వ్యసనం BREAK చేసా!

అనుభవించనిదే అధిగమించలేమని జిడ్డు (క్రిష్ణమూర్తి) అంటాడు. ఈ ఎడిక్షన్ విషయంలోనూ అదే జరిగింది. ఇంతగా ఇలాంటి వ్యసనంలోకి ఎప్పుడూ లోను కాలేదు. మధ్యలోనే మానివేయాలనుకున్నా... కనీసం తగ్గించాలనుకున్నా... నా వల్ల కాలేదు. ఇక దాన్ని పూర్తి చెయ్యడమే మార్గం అని తెలుసుకున్నా. ఇప్పుడే ముగించాను. అదే... Breaking Bad TV series. 5 సిరీసులు. మొత్తం 40 గంటలకు పైనే వుంటుందనుకుంటా.

Breaking Bad (2008–2013)
TV Series  -   Crime | Drama | Thriller

మా మిత్రుడు చెప్పాడు బావుంటుందని. రేటింగ్ చూస్తే చాలా బాగా వుంది. మొదటి మూడు భాగాలు అంత బాగుండవు కానీ ఆ తరువాత మాత్రం వదల్లేమని ముందే హెచ్చరికలు వచ్చాయి... అవి నిజమయ్యాయి. ఇహ వదల్లేకపోయాను. ఇంట్లో పనులు సవ్యంగా జరగడం లేదు - నిద్ర సరిపోవడం లేదు. తగ్గించాలనుకున్నా - నావల్ల కాలేదు. ఇహ అది పూర్తి చేయందే మళ్ళీ మామూలు మనిషిని కాలేనని నాకు అర్ధం అయ్యింది. అందుకే ఏకబిగిన చూసేసా. ఇప్పుడే అయిపోయింది - నాకు విశ్రాంతి దొరికింది. ఇక జన జీవన స్రవంతిలో కలవాలి :)

మీరూ చూడండి - అది మీకు వ్యసనం అయితే కనుక నేరం నాది కాదు - ముందే చెబుతున్నా. 
http://en.wikipedia.org/wiki/Breaking_Bad

దీని ప్రీక్వెల్ Better call Saul ఈరోజు నుండే మొదలవుతోంది. BB చూసివుంటే లాయర్ Saul గుర్తున్నాడు కదా. అతని కథే ఇది. BB పాత్రలు కూడా కొన్ని ఇందులోకి వస్తాయిట.
http://www.amctv.com/shows/better-call-saul

6 comments:

  1. oh..bro..seems your new medicine is not working or atleast working in wrong direction... (instead of libido it redirected to TV) ,,, ofcourse this serial is exceptionally good.. but you do have a self control that you watch it only during your gym time earlier...
    :) ..
    careful bro.. stop watching any more interesting tv serials before you turn into TV zombie..

    http://briankim.net/articles/harmful-effects-watching-much-television/
    http://www.buzzfeed.com/rachelhorner/the-27-stages-of-getting-addicted-to-a-television-show#.cxYp0P39
    http://www.michaeldpollock.com/how-i-overcame-tv-addiction/

    PS: I suffered from this breaking bad addiction, i even put leave for a day and watched entire two seasons,you want to know how i got out..i read abt all the other episodes in wikipedia and watched the final episode of entire serial...

    This is the time ,to invest on something new,like painting,pottery or learn about some good course in courseara.org, edx,mooc or something physical like go back to gardening :)... don't sink in the TV ...

    PPS : tv is also one of the major source of depression....

    ReplyDelete
  2. at least watch now, its a kind of a funny story movie...

    ReplyDelete
  3. tv addiction మీద విలువైన సలహాలు ఇచ్చినందుకు 'అజ్ఞాత'గారికి, అజ్ఞాతగారిలాంటి well informed వ్యక్తులు ఈ సలహాలు ఇవ్వటానికి కారణమైన శరత్‌గారికి కృతజ్ఞతలు.

    d s babu

    ReplyDelete
  4. నిజమే...టీవీ చూస్తూ కూర్చున్నాక...నిస్తేజత ఆవరించినట్టు ఉంటుంది...

    ReplyDelete
  5. @ అజ్ఞాత8 ఫిబ్రవరి, 2015 2:29 [PM]
    నేను ఆ సిరీస్ చూస్తూ సమయం గడిపేసాను నిజమే కానీ అది నాకు అవసరమైనదే. ఎందుకంటే నా మందులు పూర్తిగా పనిచెయ్యడానికి కొన్ని వారాలు పడుతుంది కాబట్టి ఎలాగోలా నా మనస్సును ఈలోగా బ్యుజీగా వుంచాలి. టివి వ్యసనం అనేది ఎస్కేపిజం అనేది నిజమే కానీ అది నాకు తాత్కాలిక అవసరం. మీరు ఇచ్చిన లింక్స్ చూసాను - బావున్నాయి. Thanks. సర్లెండి - టివి చూసే బదులు కొత్త హాబీలు మొదలుపెట్టమన్నారు కానీ ముందు నేను కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి - అయినా సరే ఇలా కాలక్షేపం చేస్తున్నాను - ఎందుకో మీకు పైన చెప్పాను.

    ReplyDelete
  6. @ అజ్ఞాత8 ఫిబ్రవరి, 2015 2:29 [PM]
    మీరు సూచించిన సినిమా నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో లేదు. అందువలన అది చూడటం ఎప్పుడు కుదురుతుందో మరి.

    @ D S Babu
    :)

    @ kvsv
    టివి అనేది ఒక వ్యసనం అనేది గుర్తించకుండా ఎంతమంది దానికి బలి అయిపోతున్నారో కదా. నా చిన్నప్పటి రోజులే బావుండేవి - కరెంటు లేదు, టివి లేదు, నెట్టూ లేదు. హాయిగా ఆడుకునేవారం లేదా కబుర్లు చెప్పుకునేవారం. ఇప్పుడు పిల్లలు ఇంటర్నెట్టు లోనే నివసిస్తున్నారు!

    ReplyDelete