Orange Is The New Black!

 
Orange Is the New Black

(2013– )

TV Series  - Comedy | Crime | Drama

IMDB Rating 8.5/10


ఓ దశాబ్దం క్రితం చేసిన ఒక నేరానికి గాను ముప్పయిలలో వున్న పైపర్ చాప్మన్ అనే ఆమెకు 15 నెలల జైలు శిక్ష పడుతుంది. జైల్లో ఆమె, ఇతర నేరస్తులూ, జైలు అధికార్ల మధ్య జరిగే సన్నివేశాలు, అనుభవాలతో ఈ టివి సిరీస్ ఆసక్తి కరంగా వుంటుంది. ఇందులో చాలా అసభ్యమయిన భాష, శృంగార సన్నివేశాలు, లెస్బియన్ సన్నివేశాలూ బాగా వుంటాయి. ఈ సిరీస్ యొక్క పైలట్ రెండు నిమిషాలలోనే ఈ చిత్రం ఎలా వుంటుందో మీకు అవగతం అవుతుంది. ఆ మాత్రం చూసి మీకు నచ్చకపోతే మానివెయ్యొచ్చు. యుఎస్ లో మహిళల జైలు జీవితం ఎలా వుంటుందో ఈ సిరీస్ వల్ల చాలా బాగా అర్ధం అవుతుంది.

మా ఆవిడ వున్నప్పుడు నన్ను ఈ సీరియల్ పెట్టనివ్వదు. అందుకే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్టేసుకుంటాను.  ఇది బావుందని మా ఫ్రెండుకి చెబితే పైలట్ రెండు నిమిషాలు చూసి ఝడుసుకొని 'ఫామిలీస్ తో కలిసి చూసేది కాదు మహాప్రభో' అని మొరపెట్టేసుకున్నాడు. ఇంట్లో అతగాడి పెళ్ళాం తిట్టేసిందేమో నాకు తెలియదు. ఈ శనివారం ఇంకో స్నేహితుడి ఇంట్లో ఆ ఫ్రెండుతో కలిసి ఈ సిరీస్ చూడాలని కుట్ర పన్నుతున్నాం. ష్! మా ఆవిడకి చెప్పకండేం. మరి మా స్నేహితుడు ఈ చలిలో తన ఇంట్లో వాళ్ళను ఎలా బయటకి పంపిస్తాడో తెలియదు! 

ఓసోస్, ఇంట్లో కలిసి నీలి చిత్రాలు చూడంగా లేనిది ఇది చూడలేమా అని మీలో కొందరు అనుకోవచ్చు. ఇందులో కొన్ని సన్నివేశాలు క్రూడ్ గా వుంటాయి. ఉదాహరణకు ఒక జైలు అధికారి జైలు జీవులకు ఇచ్చే పెద్ద గిన్నెలో వున్న సూపు లో శుబ్బరంగా  మూత్ర విసర్జన చేస్తాడు!? భాష సహజత్వానికి దగ్గరగానే వుంటుంది కానీ మనకు మహా గలీజుగా అనిపించవచ్చు. ఇవి పోగా ఈ సీరియల్ చాలా బావుంటుంది. చిత్రీకరణ, నటన, పాత్రలు, పాత్రధారులూ, వారి జీవితాలూ, సన్నివేశాలూ చాలా బావుంటాయి. నేను ఇదివరలో అక్కడక్కడా కొంత చూసాను కానీ శ్రద్ధగా నిన్నటి నుండే మొదటినుండీ మొదలెట్టాను. నిన్న సాయంత్రం మా కుటుంబం  బయటకి వెళ్ళింది. అదే సందు అనుకొని మొదలెట్టా. తిరిగివచ్చినప్పుడు మూసేసా.


5 comments:

  1. Annai ee series (2 seasons) nenu kooda choosanu :) Chaala baagundhi series. Boothu vethakali ante dhenilo aina boothu kanispisthundhi, adhi temple meedha unna bommallo kaanivandi leka goda meedha unna pichhi geethallo kaanivvandi. Antha mana mind chese maaya anthe. Anyhow I like the characterization and the way the screenplay was done. Eagerly waiting for the 3rd season. Neeku interest unte "WEEDS" ani inko series untundhi annai, kathi la untundhi series. Choodataniki try cheyyi

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    మీరు చెప్పింది కరెక్టే. తను వున్నప్పుడు ఈ సిరీస్ చూడొద్దని మా ఆవిడ ఫత్వా జారీ చేసింది కాబట్టి ప్రస్థుతానికి ఇది పక్కన పెట్టి బ్రేకింగ్ బ్యాడ్ చూస్తున్నా. మా ఆవిడ ఇంట్లో లేనప్పుడు వీలు కుదిరినప్పుడల్లా మళ్ళీ ఆరెంజ్ చూస్తా.

    ReplyDelete
  3. Weeds సిరీస్ గురించి విన్నాను. నెమ్మది మీదట చూస్తాను.

    ReplyDelete
  4. Also I started watching "The Blacklist" which is also an awesome serial. I already saw 7 episodes of Season 1 :). Try watching it. And started watching Marco Polo as per your suggestion and Masala Scenes antha ghoram ga emi levu. Situation prakaram vasthunnai and pothunnai anthe ;)

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    బ్లాక్‌లిస్ట్ గురించి కొన్ని నెలల క్రితం మా పెద్దమ్మాయి చెప్పి ఒక ఎపిసోడ్ చూపించింది. అది Dexter లాగా వుంటుందనో ఏమో చెప్పింది కానీ నాకు అది కూడా తెలిస్తే కదా. ఈ రెండూ నా విష్‌లిస్ట్ లో వున్నాయి ఇప్పుడు. ఎక్సర్సైజ్ చేస్తూ మాత్రమే చూడాలని నిబంధన పెట్టుకోవడంతో త్వరితగతిన సిరీస్ లు పూర్తిచేయలేకపోతున్నాను.

    మనలాంటి ముదుర్లకి మార్కోపోలో శృంగార సన్నివేశాలు ఘోరంగా అనిపించకపోవచ్చు కానీ ఎవరయినా ప్రతివ్రతలు, సతివ్రతలు ఆ సిరీస్ చూసి నన్ను తిట్టుకోకుండా ఓ గమనిక ఇచ్చా అంతే.

    ReplyDelete