కురూపి (I) సినిమా అంత సేపు చూడగలమా?

చిన్నప్పుడు పాఠ్యపుస్తకంలో ఓ రాక్షసుడి బొమ్మ ఓ పేజీ పూర్తిగా వుండేది. ఆ పేజీ చూడాలంటేనే దడుచుకొని అది గబగబా తిప్పేసేవాడిని. ఇప్పుడు 'ఐ' ఫోటోల విషయంలోనూ అంతే. భయం వేసి కాదు కానీ అసహ్యం వేసి చూపులు పక్కకు తప్పిస్తుంటాను. ఫోటోలలోనే కురూపి విక్రం ని చూడలేకపోయినవాడిని ఇక సినిమా హాలుకి వెళ్ళి గంటల కొద్దీ ఏం చూస్తానబ్బా? అది మరీ గొప్ప సినిమా అని అందరూ అంటే పోనీలే అని ఒక కన్ను మూసుకొని మరోకన్నుతో చూసేద్దామనుకున్నా. థియేటర్లో రిమోట్ నా చేతిలో వుండదు కాబట్టి నచ్చనప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోలేనుగా.  ఇహ డివిడి లేదా విఓడి వచ్చేదాకా ఎదురుచూసి గొప్పగా వున్నాయనుకున్న సన్నివేశాలు చూసేసి అసహ్యమయిన లేదా పనికిమాలిన సన్నివేశాలు ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకోవాలి. 

ఇంతకీ ఈ సినిమాకి ఐ అని ఎందుకు పేరెట్టారో నాకయితే అర్ధం కాలేదు. ఎక్కడా కూడా ఆ వివరణ చూడలేదు. మీకు ఏమయినా తెలిస్తే చెప్పండి.

మా దగ్గర ఈ సినిమా ప్రీమియం షో వేస్తున్నారని ఓ స్నేహితుడు కొద్దిరోజుల క్రితం చెప్పాడు. అతన్ని ప్రీమియర్ షోకి వెళ్ళి వచ్చి రివ్యూ చెప్పమని ప్రోత్సహించాం (నిజానికి అతన్ని బుక్ చేద్దాం అనుకున్నాం - టికెట్ ధర ఎక్కువగా వుంటుంది కదా - సినిమా బాగాలేకపోతే మేం బ్రతికిపోతాం)  కానీ పడలేదు. ఛస్తే అందరం కలిసి చద్దామని మొరాయించాడు.

ఈ సినిమా హీరోయిన్ అమీ జాక్సన్ నాకు బాగా నచ్చుతుంది. ఆమె కోసమన్నా థియేటరుకి వెళ్ళి ఈ సినిమా చూడాలనిపిస్తుంది కానీ అంత ధైర్యం లేదు. ఆ అమ్మాయి దేశీ నేమో అనుకున్నా - ఆంగ్లో ఇండియన్ కాచ్చనుకున్నా. పక్కా బ్రిటిష్ మోడల్ అని తెలిసి ఆశ్చర్యం, సంతోషం వేసింది. చాలా దేశీ సినిమాల్లో విదేశీ అమ్మాయిల పేరిట చప్పిడి ముఖాలు చూపిస్తుంటారు - ఈ దేశాల్లో దాదాపుగా పాతిక శాతం అయినా భలే అందంగా వుంటారు. వాళ్లని వదిలేసి మన నిర్మాతలకు, డైరెక్టర్లకు ఆ చప్పిడి మొఖాలు ఎందుకు తెచ్చుకుంటారో అని తల గోక్కునేవాడిని. హమ్మయ్య, అమీ నయినా చక్కని దానిని ఎన్నిక చేసుకున్నందుకు సంతోషంగా వుంది.

ఇకపోతే ఎంచక్కా రోజూ ఇంట్లో  ఓ గంట వ్యాయామం చేస్తూ  ఆ సమయం వృధా(!?) చెయ్యకుండా 'ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్'  సిరీస్ చూసేస్తున్నా. ఇంకా సీజన్ 1 లోనే వున్నా.  ఒకవైపు సిరీస్ చూస్తూ మరో వైపు ఎక్సర్సైజ్  చెయ్యడం కాస్త కష్టం గానే వుంది కానీ నడిపిస్తున్నా. ఆ ఇబ్బంది సిరీస్ చూట్టానికి కాదు వ్యాయామం చెయ్యడానికి అని మీకు అర్ధమయ్యే వుంటుంది. మంచి దృశ్యాలు వచ్చినప్పుడు వాటికి కళ్ళప్పగించి చెయ్యాల్సిన పని మరచిపోతున్నాను మరి.

8 comments:

  1. నాకైతే వికారం కలుగుతుంది. డిఫరెంట్ గా చూపించాలి, వెరైటీ గా చూపించాలి అనే ఆరాటంతో సినిమా వాళ్ళు చేసే ప్రయోగాలు అనుకుంటాను. ఒక్కోసారి ఆ ఆరాటం వెర్రితలలు వేస్తోంది.

    ReplyDelete
  2. I ante Tamil lo sundarangudu ani meening

    ReplyDelete
  3. Sankar story lannitlo hero rendu roles chestaademo, oka role tana weakness valla edaina cheyyalekapothe adhi inko role chesthundhi.. 145 kotlu petti teesentha strong story line kudaa nakem kanipiyyaledhu :(

    ReplyDelete
  4. I ante vikram ki ekkinchina virus Name

    ReplyDelete
  5. మిమ్మల్ని మళ్ళీ బ్లాగుల్లొ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సర్...

    ReplyDelete
  6. @ విన్నకోట నరసింహా రావు
    అవునండీ.
    @ అజ్ఞాత
    అలాగా.
    @ Nikitha Chandrasena
    మీకూ నచ్చలేదన్నమాట.
    @ madanforall
    ఆ వైరస్ కి ఆ పేరు ఎందుకు పెట్టారో మరి! తమిళ్ లో సుందరాంగుడు అని అర్ధం అని పైన చెప్పారు కదా - అందుకేనేమో!
    @ kvsv
    :)

    ReplyDelete
  7. థియేటర్ లో చూసి మళ్ళీ ఇంకో పోస్ట్ రాసేద్దురూ :-)

    ReplyDelete
  8. @ పద్మార్పిత
    హ్మ్. అంత ధైర్యం లేదండీ :(

    ఇంతకూ మీరు చూసారా లేదా? చూసే వుంటారు! అందుకే నన్ను బుక్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు కదా :)

    ReplyDelete