సెక్సీ సైడ్ ఎఫెక్ట్ ;)

సెలెక్సా (SSRI)  మెడిసిన్ వాడుతున్నప్పుడు ఇతర సైడ్ ఎఫెక్ట్సుకు తోడుగా ఒక ముఖ్యమయిన సైడ్ ఎఫెక్ట్ - సెక్స్ వాంఛ (లిబిడో) తక్కువయ్యేది. కొందరిలో అయితే అది (లైంగిక వాంఛ) పూర్తిగా పోతుంది కూడానూ - అమ్మాయిలని చూస్తే యాక్ అనిపించవచ్చు.  నా జీవితంలో ఆ ఆనందం ఆవిరి అయినట్టుగా అనిపించేది. కృంగుబాటు కావాలా లేక కోరిక కావాలా అనేది తేల్చుకోవాల్సి వచ్చింది. కృంగుబాటు వద్దనుకుంటే కోరిక పోతుంది - కోరిక కావాలంటే కృంగుబాటూ వుంటుంది.  అందువల్ల కొన్ని నెలలు అది వాడేసినా కొద్దిగా కుదుటపడగానే అది మానేసి ప్రత్యామ్నాయాలు ప్రయత్నించేవాడిని. అవి పెద్దగా ఫలించేవి కావు కానీ లిబిడో సాధారణ స్థితికి వచ్చేది. ఈలోగా తగుదునమ్మా అంటూ క్రుంగుబాటూ వచ్చి చచ్చేది. మళ్ళీ మందులూ - కోరిక కనుమరుగు అవడం - మళ్ళీ కొన్ని నెలలకే మానివెయ్యడం ఇలా సైకిల్ తిరుగుతూవుండేది. నా స్థితికేమో చాలా ఏళ్ళు ( బహుశా జీవితాంతం) ఆ మందు వాడాలి. హ్మ్!

నెట్టులో పేషెంట్ ఫోరంస్ వగైరా తవ్వితవ్వి చూడగా వెల్బట్రిన్ (DNRI)  ఆ మందుకి విరుగుడు అని తెలిసింది. ఎగురుకుంటూ డాట్రు బాబు దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఇచ్చాడు కానీ సెలెక్సా మానివేయమన్నాడు. నిజానికి రెండూ ఒకే సమయంలో వాడిచూడాల్సింది. అయితే అది వాడాక కోరిక మామూలుగా అయ్యింది - కృంగుబాటూ కంట్రోల్ లోనే వున్నట్టుంది కానీ ... కానీ మరో సమస్య వచ్చి పడింది. అదే ఆందోళన ( ఏంగ్జయిటీ)! హ్మ్. ఓ నెల చూసి ఇహ లాభం లేదనుకొని మళ్ళీ వెనక్కు వచ్చేసా :( 

మా వైద్యుడితో లాభం లేదనుకొని సైకియాట్రిస్టుని కలిసాను కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఆయన గారు సింబాల్టా (SNRI) వాడిచూడమన్నారు కానీ నాకు CoPay కొద్దిగా వాచిపోయింది ($50) కానీ ఆ మందుతో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దాంతో మళ్ళీ మొదటికి వచ్చాను. మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నించాను కానీ ప్చ్. కోరిక తగ్గకుండానే కృంగుబాటు కనుమరుగు కావాలి. ఎలా?

మళ్ళీ నెట్టులో బాగా పరిశీలించాను. సెలెక్సా మరియు వెల్బట్రిన్ రెండూ ఏక కాలంలో వాడితే ఒకదాని సైడ్ ఎఫెక్ట్స్ మరొకటి పరిహరించి అంతా బావుంటుందని తెలుసుకున్నాను. మా డాక్టరును అడిగితే అలా రెండూ ఒకేసారి తాను ఇవ్వనన్నాడు. కావాలంటే సైకియాట్రిస్టుతో మొరపెట్టుకొమ్మన్నాడు. సరే అంటే చాలా మాంఛి మానసిక వైద్యుడు అని ఒకరిని రిఫర్ చేసాడు. తనని కలిసాను. క్రుంగుబాటు పొట్ట (Gut) లో పుడుతుందని కొత్త సూత్రం చెప్పి అలా ప్రయత్నిద్దాం అని అన్నాడు. అవన్నీ ఇప్పుడు జరిగేపని కాదనుకొన్నాను. పైగా ఆయా మందులు భీమాలో కవర్ కావు కాబట్టి నాకు వాచిపోయేలా వుంటుందని అర్ధమయ్యింది. అందువల్ల అవేమీ ఇప్పుడు వద్దు మహాప్రభో నా మందులు నాకు వ్రాసిమ్మన్నాను. 

అయితే wellbutrin XL (150 mg) ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ Celexa క్రమంగా తగ్గిద్దామన్నాడు. అలా ఎందుకో నాకు అర్ధం కాలేదు.  దానికి నేను ఒప్పుకోలేదు. అది బాగానే నాకు పనిచేస్తోంది కాబట్టి దాని అవసరం కూడా వుంటుంది కదా అన్నాను. అతగాడు మౌనం వహించాడు. బుద్ధిగా రెండూ వ్రాసిచ్చాడు.  నెలన్నర రెండూ వాడాను. ఆందోళన కొద్దిగానే పెరిగింది కానీ కోరిక మామూలు స్థితికి వచ్చేసింది. క్రుంగుబాటు కంట్రోల్ లోనే వుంది. హమ్మయ్య అనుకున్నా. కొద్దిగా ఎనెర్జీ, మోటివేషన్ కూడా పెరిగాయి. మళ్ళీ ఆ సైకియాట్రిస్టును కలిసాను. సెలెక్సా క్రమంగా తగ్గించి వెల్బట్రిన్ డోస్ పెంచమన్నాడు. రెండు మందులు కాకుండా ఒక మందుతోనే చూద్దాం అన్నాడు. అంతకుముందు సారి అతను వ్యూహాత్మక మౌనం వహించాడని అర్ధమయ్యి ఈసారి నేను నోరుమూసుకున్నాను. ఎంతయినా మనకంటే నిపుణులకే బాగా తెలుస్తుంది కదా (అది అన్నిసార్లు వాస్తవం కాదు).  అంతకు ముందు అలా ఆ మందు అలా వాడేసి ఇలా వదిలేసిన విషయం గుర్తుచేసాను కానీ పట్టించుకోలేదు.

ఇలా సెలెక్సా డోసు క్రమంగా తగ్గిస్తూ అలా వెల్బట్రిన్ XL (300 mg) పెంచేసాను. ఇప్పుడు పూర్తిగా సెలెక్సా మానివేసాను. నా సామి రంగా! లిబిడో జివ్వున ఎగసిపడుతోంది. ఇప్పుడే ఇలా వుంది ఇంకా కొన్ని వారాలు గడిచి సెలెక్సా నా శరీరంలో నుండి పూర్తిగా తొలగిపోయి వెల్బట్రిన్ పూర్తిగా కుదురుకుంటే నా పరిస్థితి ఎలా వుంటుందో నాకయితే అర్ధం కావడం లేదు. గోరుచుట్టుపై రోకలిపోటులాగా అసలే FLR లో వున్నా. అప్పుడప్పుడూ ఎంత అనుకున్నా చీట్ చేయకతప్పడం లేదు కానీ (ఇలా మొగుళ్ళు మోసం చేస్తారనే ఇక్కడి ఎఫెలార్ భార్యలు దానికి వాడే ప్రత్యేక 'బంధనం' కొనుక్కొని వచ్చి వేసి తాళం చెవి దగ్గరపెట్టేసుకుంటారు!) అసలయితే అవుట్ కాకూడదు! ఇహ చూడండి నా అవస్థ :)) అసలే కోతి, ఆ పైన కల్లు తాగింది చందాన నేను వున్నా ఇప్పుడు. వా :((

అన్నట్లు స్త్రీలకు కానీ, పురుషులకు గానీ మిగతా అన్నివిషయాలూ బాగానే వుండి లైంగికవాంఛ మాత్రం తక్కువగా వుంటే ఈ మెడిసిన్ వాడి చూడవచ్చు. ఫ్రిజిడ్ లకు చికిత్సగా ఇది ఇస్తుంటారు. ఇంకో విషయం - మీలో ఎవరికయినా వ్యసనాలు వున్నా అవి మానడానికి ఈ మందు చాలామందికి పనిచేస్తుంది. స్మోకింగ్ మరియు తాగుడు తదితర వ్యసనాలు వున్నవారు ఇది ప్రయత్నించొచ్చు. ఇది వాడితే చాలామందికి అస్సలు తాగాలనిపించదు, పొగ తాగాలనిపించదు! అయితే ఈ వ్యసనాలు పోయి మరొకటి  పుట్టుకురావొచ్చు. పదే పడగ్గది వ్యసనం ;)  ఇహపై మీ ఇష్టం బాబూ - నేను అసలే అమాయకుడిని - నాకేం తెలియదు సుమీ  :))   మీరు మగవాళ్లయితే నిర్భయ చట్టం లాంటివి గుర్తుంచుకోండి, అదే మహిళలయితే మనుస్మృతి లాంటివి గుర్తుంచుకోండేం!

గమనిక: నేను డాక్టరుని కాదు కాబట్టి ఇది వైద్య సలహా కాదు -  పూర్తి వివరాల కోసం,  చికిత్స కోసం మంచి వైద్యుడిని సంప్రదించండి. 

7 comments:

  1. మిగితా విషయాల మీద నాకు అంతగా ఇంటెరెస్టు లేదు కానీ మగవారి నిర్భయ చట్టం .. ఆడవారికి మనుసృతి అంటూ చేసిన కంపారిజన్ నాకు భలే నచ్చింది.. :-)

    ReplyDelete
  2. @ Srikanth M
    నిర్భయ చట్టం మీద నా నిరసన అలాంటిది. ఆడవాళ్ళని బలాత్కారాలు చెయ్యకుండా చట్టం చెయ్యండి మహాప్రభో అని పాలకులను వేడుకుంటే ఏకంగా ఆ చట్టం ద్వారా అసలు ఆడవారినే అంటకుండా అస్పృశ్యులుగా చేసేశారు! కొండనాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట. భేష్!

    ReplyDelete
  3. ఇంతకీ వెల్బట్రిన్ XL తో డిప్రెషన్ తగ్గిందా?ఈ పోస్ట్ చూసాక ,మీక్కూడా తాళాలు వేశారా లేదా?

    ReplyDelete
  4. @kvsv
    వెల్బట్రిన్ వాడగానే తగ్గిపోవడానికి ఇదేమన్నా తలనొప్పి మందుటండీ? వారాలు పడుతుంది - వేచి చూస్తున్నా - ప్రస్తుతానికి కొంత మేరకు బాగానే వున్నా - మెరుగవుతున్నా. లేకపోతే ఇలా బ్లాగులు వ్రాద్దునా!

    నా బ్లాగు ఎప్పుడో తప్ప తను చూడదు లెండి. చూసినా ఆ బంధనాల గురించి అంతగా తెలియదు - పట్టించుకోదు. కాకపోతే నేనే అమెజాన్ సైటులో ఆ తాళం తెప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నా. దానికి తాళం వేసి తాళంచెవి మా ఆవిడకి ఇస్తే ఓ పని అయిపోతుంది. $15 నుండి $90 వరకూ వుంది ధర.

    ReplyDelete
  5. అంత కష్టపడి తాళాలు తెచ్చుకోవడం ఎందుకు లెద్దురూ,హాయిగా స్వేచ్చా వాయువులు పీల్చుకోక!!

    ReplyDelete
  6. @ kvsv
    ఈ జైల్లో వుండే సుఖం మీకేం తెలుసండీ :) మసోచిస్ట్ లకు స్వేఛ్ఛ ఆనందం ఇవ్వదు - నిర్బంధమే ఎనలేని ఆనందం ఇస్తుంది. అలాగే సాడిస్టులకు ఎదుటివారిని నిర్బంధించడమే ఆనందం ఇస్తుంది. సాధారణ (వెనిలా) జీవన పద్ధతిలో ఒక రెట్టు ఆనందం వుంటే బిడిఎసెం జీవన విధానంలో అంతకు పది రెట్లు ఆనందం వుంటుంది. మామూలుగా అయితే కొంతసేపే ఆనందం వుంటుంది కానీ ఈ జైల్లో వుంటే 24/7/365 ఆ తన్మయత్వం వుంటుంది.

    ReplyDelete
  7. మొత్తం మీద శోధన తోనూ సాధన తో నూ ఎంజాయ్ చేస్తున్నారు...సంతోషం గానూ,ఆనందం గానూ (మరొకరికి ఇబ్బంది కలిగించకుండా) జీవించడమే కదా ఎవరయినా కోరుకునేది...ముక్కుతూ,మూలుగుతూ...బ్రతికేకంటే...ఎంజాయ్...

    ReplyDelete