బ్రేకింగ్ బ్యాడ్ బావుందే!


Breaking Bad (2008–2013)

TV Series -  Crime | Drama | Thriller

A chemistry teacher diagnosed with a terminal lung cancer, teams up with his former student, Jesse Pinkman, to cook and sell crystal meth.

ఈమధ్య ఇంట్లో వ్యాయామం చేస్తూ నెట్‌ఫ్లిక్స్ లో బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూస్తున్నా. అది చాలా బావుంటుందని కొంతమంది మిత్రులు చెప్పారు. IMDB రేటింగ్ చూస్తే 9.5/10 వుంది! వావ్! మొదటి కొన్ని ఎపిసోడ్లు కాస్త బోరింగుగా వుండవచ్చని తరువాత మాత్రం ఇక ఆగలేమని ఫ్రెండ్స్ చెప్పారు. ఇకటి రెండు ఎపిసోడ్స్ చూడగానే హుక్ అయిపోయాను. ఇప్పటికి 6 ఎపిసోడ్స్ చూసాను. ఇందులో ఎమోషన్స్ ని చాలా సహజంగా చిత్రీకరించారు. కెమిస్ట్రీ అంటే ఇష్టం వున్నవారికి ఇది ఇంకా బాగా నచ్చుతుంది. కెమిస్ట్రీతో ఎన్ని  క్రైమ్స్ చెయ్యవచ్చో ఇందులో చూడొచ్చు! అయితే ఇది మా ఆవిడకి అంత ఆసక్తికరంగా అనిపించలేదు. మొదటి కొన్ని ఎపిసోడ్స్ కాస్త బోరింగుగా వుంటాయన్నా వినడం లేదు. మళ్ళీ Lost చూడటానికే ఆసక్తి చూపిస్తోంది.

10 comments:

  1. చూడండి.. కానీ మరీ అతుక్కు పోకండి.. అతుక్కుపోతే మాత్రం మీలో ఒక వాల్టర్ వైట్ తయారవుతాడు.. చాలా డేంజరస్ సీరియల్.. నేను కొన్నాళ్ళ పాటు కొందరి వ్యవహారం గమనిస్తూ వారికి తెలియకుండా వారిని మానిపులేట్ చేయడానికి ట్రై చేసానంటే.. ఎంత క్రూరమైన సీరియలో అర్థం చేస్కోండి.. జాగ్రత్త .. అసలే FLR అంటూ తెగ డాన్స్ చేస్తున్నారు ఈమధ్య..

    చివరగా.... స్కైలర్ మాత్రం ముద్దుగా చూడటానికి ఎంతో రంజుగా అనిపిస్తుంది నాకైతే..

    ReplyDelete
  2. మొన్న ఎవరో ప్రిసన్ బ్రేక్ చూడమని చెప్పారు మీకు.. తొక్కలో సెరియల్ అది.. ఇప్పటికి రెండు సార్లు 5 సీజన్లు చూసానంటే ఎంతగా మనల్ని ట్రాప్ చేస్తాడో చూడండి.. అమెరికన్ రియలిస్టిక్ సీరియల్ లన్నీ.. నిజానికి అన్-రియలిస్టికే.. అంత పక్కాగా ఏమి జరుగుతాయి గురువుగారు.. బ్రేకింగ్ బాడూ కొంచెం అంతే.. మనల్ని నమ్మించటానికి కొన్ని ఎక్సెప్షన్లు కూడా అప్పుడప్పుడు ఇస్తుంటారు..

    అయినా మనకెందుకీ టీవీ షోలు గురువుగారు.. హాయిగా లైవ్ లో ఆడుతూ పాడుతూ గడిపేయకుండా..

    ReplyDelete
  3. @ కాయ
    నిన్ననే సీజన్ 1 పూర్తి చేసాను. ఇతరులను మానిపులేట్ చేసే కళ అబ్బుతుందంటే మంచిదే కదా ;) అయినా నాకు ఎందుకు లెండి. అసలే ఇప్పుడు ఏకపత్నీ వ్రతుడినీ! స్కైలర్ (అనా గన్) అందం నాకయితే గొప్పగా ఏమీ అనిపించదు. పాదాలూ బాలేవు. సీజన్ 1 చివరి ఎపిసోడ్ (7 అనుకుంటా) లో తన పాదాలు కొద్దిసేపు బాగా చూపించింది కానీ ఏం లాభం. సో సో. ఏదో లెండి నేనో పాద పిచ్చోడిని. నటన బాగానే వుంది.

    చెప్పా కదా. సమయం వృధా చేస్తూ చూడను అనీ. సాధారణంగా వ్యాయామం చేస్తూ చూస్తుంటాను. చూస్తూ శ్రమ తెలియకుండా కష్టపడుతుంటాను. ఒకే దెబ్బతో రెండు పిట్టలూ. నేను సిరీస్ లు చూడ్డం కోసం వ్యాయామం చేస్తుంటా అని మా ఆవిడ దెప్పిపొడుస్తుంది కానీ నేను ఆ అభిప్రాయాన్ని ఖండఖండాలుగా ఖండిచేస్తుంటాను. ఇహ మా అమ్మాయేమో నేను చేసేది వ్యాయామమే కాదని స్ట్రెచింగ్ అనీ అంటూ వుంటుంది. ఆ కామెంటును కూడా ఖండించేస్తుంటాను. మీరు అయినా నమ్ముతారు కదా. హమ్మయ్య.

    ReplyDelete
  4. @ కాయ
    కొన్ని నెలల క్రితం పిజన్ బ్రేక్ ఎవరో చూపించారు నాకు గానీ అప్పుడు టివి సిరీస్ ల మీద ఆసక్తి లేక పట్టించుకోలేదు. అబ్బో, చూడాలనుకుంటే ఎన్నో మంచి మంచి సిరీస్ లు వున్నాయి. ఎంతయినా ఇవి తెలుగు అత్తా కోడళ్ళ కన్నీళ్ళ లాంటి పనికిమాలిన వాటికంటే వెయ్యి రెట్లు నయం కదా. నా అదృష్టం కొద్దీ మా ఆవిడ ఆ తెలుగు సీరియళ్ళు పెట్టదు. బ్రతికిపోయాను. కొన్ని పనికిమాలిన గేం షోలు పెడితేనే నాకు చిరాకుగా అనిపిస్తుంది. సుమ అంటే కంపరం నాకు. జబర్దస్త్ అంటే మహా చిరాకు. ఆ కొజ్జా కామెడీ లేంటో, అవి చాలామంది చదువుకున్నవారికి కూడా నచ్చడం ఏంటో నాకు అర్ధం కాదు. ప్రతి అడ్డమయిన దానికీ రోజా, నాగబాబూ పళ్ళికిలించడం ఒహటి.

    ReplyDelete
  5. బావుంది మీ పని ... నిదానంగా కానిచ్చేయగలరు.. వ్యాయామం అంటే కోంచెం చెమటోడ్చాలి..గురువుగారు... తెలుగు టీవీ సీరియళ్ళు తెలుగు దేశస్థులకోసం ప్రత్యేకం.. అవి మనం టచ్ చేయటం పద్ధతి కాదు.. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు.. మనోళ్ళకి తగ్గట్టు మనోళ్ళు పెడతారు షోలు..
    ఏమైనా కని జబర్దస్త్ మల్లన్న మంచిగనే చేస్తడు కదనే. గట్ల చిరాకంటవ్.. నా చిన్నప్పుడు ఊరిలో ఉన్నప్పుడు మనోళ్ళు ఎంత ఆప్యాయంగ పలకరిస్తుండెనో అది గుర్తుకు తెస్తుండు.. ఇప్పుడు వచ్చీ రాని ఆంధ్ర భాష వొంటికి పట్టింది కని.. తెలవని ఊళ్ళల్ల తెలవనోని తోటి కూడ మనోళ్ళ పలకరింపు ఎంత మంచిగ ఉంటది.. ఈ మల్లన్నైతె నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు తెస్తుండు..

    ReplyDelete
  6. మీరు The Office(US version) చూడాలని నా కోరిక.. మీకు ముందు నచ్చదు.. కని ఒకటి రెండు ఎపిసోడ్స్ అయ్యాక మంచిగనిపిస్తది.. Michael Scott ఇందులనే ఉంటడు..

    ReplyDelete
  7. @కాయ
    ఈ చలి ప్రాంతాల్లో చెమటోట్చడం కష్టమే సుమీ.
    జబర్దస్త్ మల్లన్న ఎవరో నాకు తెలియదు ఎందుకంటే నేను మహా అయితే రెండు, మూడు ఎపిసోడ్లు చూసానేమో. అవి కూడా వేరేవారి ఇళ్ళల్లో చూసినవే. మేము ఈటివి వున్న యప్ టివి ప్యాకేజీ తీసుకోలేదు.

    Michael Scott ఎవరా అనుకున్నా! అతనా. అతని పేరు తెలియదు కానీ కొన్ని సినిమాలు చూసాను. అయితే ఆఫీస్ కూడా చూడాలి.

    ReplyDelete
  8. జబర్దస్త్ మల్లన్న V6 లో వస్తడు..

    ReplyDelete
  9. Game of Thrones chudandi

    ReplyDelete
  10. గేం ఆఫ్ థ్రోన్స్ బావుంటుందని ఇతరులు కూడా చెప్పారు. చూడాలి, థేంక్స్. బ్రేకింగ్ బ్యాడ్ చూడటం ఇంకా అయిపోలేదు. ప్రస్థుతం సీజన్ 4 చూస్తున్నా.

    ReplyDelete