కామెంట్లెయ్యడం కష్టమే కానీ...

ఇదివరలో బ్లాగుల్లో బాగానే వ్యాఖ్యలు వేసేవాడినే కానీ ఈమధ్య ఇతరుల టపాలు ఏవో కొన్ని తప్ప చాలావరకు పెద్దగా నాకు ఆసక్తి కలిగించనివే వుంటున్నాయి. ఇక ఆసక్తి కలిగించిన టపాలను కూడా చదవడమే ఎక్కువ కాబట్టి కామెంట్లేసేంత కష్టపడాలనిపించడం లేదు. అయితే వారి టపా క్రింద రియాక్షన్స్ వున్నట్లయితే మాత్రం వీలయినంతగా ప్రతిస్పందిస్తాను. నాకు లాగే చాలా మంది బద్దకిస్టులు వుంటారు కాబట్టి మాలాంటి వారికి వీజీగా వుండేందుకై మీ బ్లాగుల్లో కూడా రియాక్షన్స్ పెట్టుకోండేం.

నా బ్లాగు పోస్టుల క్రింద కూడా 'చాలా బావుంది', 'బావుంది', 'బావోలేదు' అనే రియాక్షన్స్ వుంటాయి. కామెంటెయ్యడం కష్టంగా అనిపించినా కనీసం మీ స్పందన ఏంటో తెలిస్తే కాస్త బావుంటుంది. నా ధోరణిలో నేను వ్రాసుకుపోవడమే తప్ప ఇతరుల ప్రతిస్పందనలను బట్టి నేను వ్రాసే రకం కాదు గానీ జనాలకి ఏం నచ్చుతున్నాయో ఏం నచ్చట్లేదో కాస్త ఐడియా వుంటుంది.

6 comments:

 1. పోస్టు బాగుంది. సూచనా బాగుంది. అవును మీరిదివరకటిలా కామెంట్లలో పెద్దగా కనపడడం లేదు.

  ReplyDelete
 2. @ కొండలరావు పల్ల
  ధన్యవాదాలు. మీరు తెలుగు బ్లాగావరణంలోకి అడుగుపెట్టక ముందటి రోజుల్లో బ్లాగుల్లో నా హడావిడి బోలెడంత వుండేది లెండి. మీలాంటి వారి కృషి వల్ల మళ్ళీ కాస్తో కూస్తో బ్లాగుల మీద ఆసక్తి కలుగుతోంది.

  ReplyDelete
 3. మీ బావ అక్కడ వీరోచితంగా పోరాడుతుంటే, మీరిలా ఆ యుద్ధం రేపు చేద్దాంలే అన్నట్లు, ఆ రౌడీ కూడా పత్తా లేకుండా ఉన్నారే..

  ReplyDelete
 4. @ భయంకర్
  రౌడీ సంగతేమో కానీ మా బావ సంగతి గుర్తుకు వస్తే నవ్వొస్తుంటుంది. అతని సంగతి తెలియక కొందరు కొత్త బ్లాగర్లు అతనితో ప్రజా వేదికల్లో వ్యాఖ్యా యుద్ధాలు చేస్తూ తల గోక్కుంటుంటే నాకు నావ్వాగదు :))

  ReplyDelete
 5. ఒకప్పుడు బ్లాగులు ఎంత బాగుండేవి . రెండు మూడు సంవత్సరాల మునుపు, ప్రతీ నిమిషానికి ఒక అప్డేట్ ఉండేది ఇంటరెస్టింగ్ గా ..
  మీ బావ, మీ స్నేహితుడు , మీరు , ఒంగోలు శీను , పెద్ద శంకర్ , బూతు పురాణం రాసే ఒక లేడీ బ్లాగర్ , గొడవలు , ఆధ్యాత్మికం , కమ్యునిజం .ఇంకా ఎన్నెన్నో
  మర్డర్లు తప్ప అన్ని ఉండేవి .

  గతకాలం మేలున్ వచ్చే కాలం కంటెన్ అని ఎవరో మహానుభావుడు అన్నట్టు .. ఇలా అయిపొయింది .

  ఎప్పుడైనా వీది అరుగు మీద కూర్చుని ఎదురుగా కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకునే జనాల గొడవలు చూస్తుంటే నాకు అప్పటి రోజులే గుర్తొస్తున్నాయి . ఆ రోజులుని చాలా మిస్ అవుతున్నాం .

  ReplyDelete
 6. @ అజ్ఞాత
  నిజమే. అప్పుడెంత సందడిగా వుండేదనీ. ఎంత హడావిడితో లైవ్లీ గా బాగావరణం వుండేదనీ! కొందరి నుండి మరో టపా ఎప్పుడొస్తుందా, ఏమొస్తుందా అని ఎదురుచూసేట్టుగా ఆ రోజులు వుండేవి. ఇప్పుడయితే ఓ సరదా టాపిక్ వ్రాసినా స్పందన కరువు. చాలావరకు ఏవో సీరియస్ విషయాల గురించి పోస్టులే తప్ప సరదాతనం పెద్దగా కనిపించడం లేదు. కొట్లాడుకున్నా, కాట్లాడుకున్నా ఆ రోజులు తమాషాగా గడిచేవి. ఇప్పుడు తెలుగు బ్లాగావరణానికి వృద్ధాప్యం వచ్చిందా అనిపిస్తోంది.

  ReplyDelete