అర్ధరాత్రి అర్జంట్ కాల్

గతరాత్రి పన్నెండుగంటల తరువాత మా ఫోన్ మ్రోగసాగింది. ఎత్తాను. మా అమ్మాయితో మాట్లాడవచ్చా అని అటువైపునుండి ఓ మహిళ కంఠం. ఆదివారం రాత్రి అంత అర్జంటుగా ఏం మాట్లాడాలబ్బా అనుకుంటూ మీరు ఎవరు అని అడిగాను. "...పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీ అమ్మాయితో మాట్లాడాలి" అంది. ఇదేమన్నా ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను. గతంలో ఒకసారి కెనడాలో వున్నప్పుడు ఇలాగే అర్ధరాత్రి ఒక ప్రాంక్ కాల్ వచ్చిన విషయం గుర్తుకువచ్చింది. మా పాప పడుకుంది అని చెప్పాను. మీరు తన తండ్రా అని అడిగింది ఆమె. అవును అని చెప్పాను. "మీ పాప స్నేహితురాలు ... గతకొన్ని గంటల నుండి తప్పిపోయింది. వెతుకుతున్నాం. ఆ అమ్మాయి తరచుగా మీ పాపకి ఫోన్ చేస్తుంటుంది కాబట్టి మీ పాపకి ఏమయినా తెలుసేమో అని ఫోన్ చేస్తున్నాం" అని ఆ పోలీస్ ఆఫీసర్ అంది. మీ ఇంటికి ఈరోజు ఏమయినా వచ్చిందా అంటే రాలేదు అని చెప్పాను. ఏమయినా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషనుకి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి పెట్టేసింది. 

ఆ అమ్మాయి ఆఫ్రికన్ అమెరికన్. వయస్సు పదకొండు లేదా పన్నెండు. మా పాపకి వున్న మంచి స్నేహితురాళ్లలో ఆమె ఒకరు. నన్ను చక్కగా మిస్టర్ అంటూ మా ఇంటి పేరుతో పిలుస్తుంటుంది. మా పాప పొద్దున లేచాక నిన్న ఏమయినా అమ్మాయి తనను కాంటాక్ట్ చేసిందేమో కనుక్కున్నా. లేదని చెప్పింది. విషయం క్లుప్తంగా చెప్పి స్కూల్ కి వెళ్ళాక ఆ అమ్మాయి వివరాలు ఏమయినా తెలుస్తాయేమో కనుక్కొమ్మని చెప్పాను. ఆ అమ్మాయి దొరికిందా లేదా అని కనుక్కోవడానికి ఆమె తల్లి ఫోన్ నంబర్ మా దగ్గర లేదు. తండ్రి విడాకులు తీసుకున్నాడు. ఎక్కడవుంటాడో మాకు తెలియదు.  

ఆ అమ్మాయి క్షేమమేనని, దొరికేసివుంటుందని ఆశిద్దాం.

6 comments:

 1. Lets hope for best...After watching movies like
  "Mystic River" , "prisoners" and "Gone Baby Gone" .. i am really scared of America.. especially .. prisoners.. i tell every friend in us to wear a whistle around the neck..we can't imagine its use in the time of need .. :)

  ReplyDelete
 2. మీరు ప్రస్థావించిన ఒక్క సినిమా చూడలేదు కానీ ఇలా పిల్లలు తప్పిపోవడాలు ఇండియాలోనే ఎక్కువనుకుంటా కానీ ఇక్కడ తక్కువమంది తప్పిపోయినా ప్రచారం ఎక్కువగా వుంటుంది కాబట్టి చాలా జరుగుతున్నాయి అని అనిపిస్తుందన్నది నా అభిప్రాయం.

  నేను ఇండియాలో వున్నప్పుడు బైక్ మీద మా స్నేహితుడూ, నేనూ ఒక దగ్గరికి వెళుతూ దారితప్పి ఒక వీధిలోకి వెళ్ళాం. అక్కడ ఆతృతగా మాకోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఒక గుంపు మా దగ్గరికి ఉరికి వచ్చి 'తెలిసిందా, ఏమయినా తెలిసిందా, దొరికాడా?' అని అడగసాగారు. మా పరిస్థితి ఏంటో మాకు అర్ధం కాక అసలు విషయం ఏంటని అడిగాము. ఆ వీధిలో వున్న ఒక ఇంటి అబ్బాయి తప్పిపోయాట్ట - వెతుకుతున్నారంట. మేమేమైనా ఆ సమాచారంతో వచ్చామేమో అని వారి ఆతృత. ఈ హడావిడి వినిపించి ఆ ఇంటినుండి ఆ తల్లితండ్రులు ఆశగా మావైపు పరుగెత్తుకు వచ్చారు. ప్చ్! ఆ అబ్బాయి దొరికాడో లేదో మాకు తెలియదు.

  ReplyDelete
 3. yes sarath garu, i agree,, kidnaps and crimes against children in Hyderabad have gone up.. we should be alert ,,, watch prisoners movie ,, its really good ,, very gripping,,, and you wont be hurt at the end,, :)

  ReplyDelete
 4. ప్రిజనర్స్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లొ వుందో లేదో చూడాలి. వుంటే చూస్తాను. థేంక్స్.

  ఆ అమ్మాయి తిరిగివచ్చిందిట. వాల్మార్టూ,స్టార్ బక్సుకూ వెళ్ళి కొన్ని గంటల ఆ అమ్మాయి తరిగివచ్చినట్లుగా, నిన్న స్కూలుకి కూడా వచ్చినట్లుగా మా అమ్మాయి చెప్పింది.

  ReplyDelete
 5. ha ha ha ,,,Thats good news sarath bhayya,, cellphone switch off chesinda ? any way its good that it ended without any trouble :)

  ReplyDelete
 6. Avuna?Happy to know this.:)

  ReplyDelete