కిరోప్రాక్టిక్ తో కొన్ని సమస్యలు దూరం

ఈమధ్య ఎడమ చెవి, కన్ను, పన్ను, మెడ నొప్పితో మా ఆవిడ కొన్ని వారాలు తీవ్రంగా అవస్థ పడింది. డాక్టర్ దగ్గరికి వెళితే ఇంఫెక్షన్ అని ఏంటీబయోటిక్స్  ఇచ్చాడు కానీ తగ్గలేదు. ENT స్పెషలిస్ట్ దగ్గరికి ఏవేవో పరీక్షలు చేసి CT Scan తీయించి అందులో ఏమీ తేలక TMJ కావచ్చు అన్నాడు. ఓరల్ సర్జెన్ దగ్గరికి వెళితే పరీక్షించి TMJ అని ధృవపడటం లేదు కాబట్టి పెయిన్ కిల్లర్స్ పదేపదే వేసుకోవడమే గతి అన్నట్లుగా మాట్లాడారు. 

అలా ఎన్ని చేసినా తల ఎడమభాగం అంతా నొప్పి తగ్గకపోవడంతో విరక్తి చెందడం ఆరంభించింది. నేను కిరోప్రాక్టర్ ని కలవమన్నా కానీ వారు చేయించే వ్యాయామాలు కొన్ని బోరింగుగా వుంటాయి కాబట్టి కొన్ని వారాలు తటపటాయించింది. ఇది తలకు సంబధించిన సమస్య కాబట్టి ఆ వ్యాయామాలు చేయించరులే అని సర్ది చెప్పి తీసుకువెళ్ళాను. Chiropractor డాక్టర్ ఫిలిప్ మంచి స్నేహశీలి. మా ఆవిడకి ఎక్సురేలు తీయించి C1 ఎముకలో కొంత సమస్య వుంది చెప్పారు. దానిని అడ్జస్ట్ చేస్తూ వస్తున్నారు. చిత్రం...నొప్పి మటుమాయం. 

కొన్నేళ్ళ క్రితం దాకా 7,8 ఏళ్ళు పలురకాల వంటి నొప్పులతో మా ఆవిడ బాధపడింది. ఎన్ని చికిత్సలు చేయించినా, ఎందరిని కలిసినా, సర్జెరీలు జరిగినా ఆ నొప్పులు తగ్గలేదు. చివరికి కిరోప్రాక్టిక్ చికిత్సతో అవన్నీ తగ్గాయి.

అలా అని అన్ని సమస్యలూ తగ్గుతాయని కాదు. నేనూ చికిత్స తీసుకున్నా కానీ నా సమస్యలు దూరం కాలేదు. అలాగే వేసవిలో వాలీబాల్ ఆట వల్ల కుడి భుజం నొప్పి వచ్చింది నాకు. దానికి ఈ చికిత్స తీసుకుంటున్నా కానీ తగ్గడం లేదు. అందులో నా పొరపాటూ వుంది లెండి. షవుల్డర్ మొబిలైజేషన్ వ్యాయామాలు కొన్ని సూచించారు కానీ రెండు సార్లు చేసి వదిలేసా. ఎక్కడ చేస్తామండీ - బోరింగ్. ఫిలిప్ అడిగితే భేషుగ్గా అవి చేస్తూ వస్తున్నా అని చెబుతున్నా కానీ ఇవాళ ఆ బండారం బయటపడుతుంది. ఇవాళ సమీక్ష వుంది. అప్పుడు నిజం ఒప్పుకోవడం మంచిది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలకి కిరోప్రాక్టిక్ చక్కగా కుదురుతుంది. ఎన్ని ఇతర ప్రయత్నాలు చేసినా తగ్గనివి ఈ విధానం వల్ల తగ్గొచ్చు. ప్రయత్నించి చూడటమే మన పని.

10 comments:

 1. baabooyy inni samasyalaa? meeru area marcheyyandi. anni saraipothaayy.

  ReplyDelete
 2. C1 has nothing to do with toothache
  C1is no way related to ear pain
  I have seen people ending up with stroke after neck manipulation by Chiropractor
  It's ok to manipulate low back by chiro, but never never the neck.
  You can not put back vertebra or adjust by manipulating.
  Good luck...
  Anyhow it is not your neck.....

  ReplyDelete
 3. Ajnata2
  You are wrong. Any problem in cervical nerves and c1-4 can cause pains anywhere. Once the disk slips and touches nervous tissue pain can come up wherever they lead to and also in the adjoins tissues. My wife has a similar problem and her pains won't go. It's a life long issue

  ReplyDelete
 4. @ అజ్ఞాత 1
  చాలామందికి సమస్యలు వుంటాయి కానీ బయటకి చెప్పుకోరంతే.

  @ అజ్ఞాత 2
  ఏదో ఒకటి లెండి - సమస్య తీరిందా లేదా - పెయిన్ పోయిందా లేదా అన్నది ప్రధానం.

  @ అజ్ఞాత 3
  మీ ఆవిడకి కిరో ప్రయత్నించారా?

  ReplyDelete
 5. thanks for sharing sir...

  ReplyDelete
 6. @Anyhow it is not your neck.....
  గొప్ప గా ఫినిషింగ్ ఇచ్చారు!!

  ReplyDelete
 7. Hello Sarath Garu,

  Can you tell me how your wife uses phone every day(i mean the posture of her while talking? Is she keeps like a taco neck?

  ReplyDelete
 8. @ అజ్ఞాత
  ఆహ్. ఇది కూడా కారణం అయ్యుండొచ్చా?! నిజమే వంట పనులు చేస్తూ గంటలు గంటలు ఫొన్ మాట్లాడుతున్నప్పుడు అలాగే చేస్తుంటుంది. ఇంట్లో చెప్పాను - అలా చెయ్యొద్దని - చూద్దాం.

  మీ సలహాకి బహుళ ధన్యవాదాలు. బ్లాగింగ్ వల్ల కలిగే ప్రయోజనాల్లో మీలాంటి వారి సలహాలు కూడా వుంటయ్ మరి.

  ReplyDelete
 9. Sarath garu, Thanks for answering to my question. I had the same symptoms like your wife and searched google and got information about taco neck (i work from home and use phone like taco neck doing dishes/folding clothes etc...). On the same day, i saw your post.....so i want to confirm for my sake also. Now i am practicing to overcome this habit and seeing results. I wish your wife will feel better soon.

  ReplyDelete
 10. @ kvsv

  ఏదో తెలిసింది పదిమందికీ చెప్పడం నాకో తుత్తి.

  ReplyDelete