మేం తిని తాగి తొంగోవడమే కాకుండా ...

...వాలీబాల్ కూడా ఆడేద్దామని డిసైడ్ చేసినం. ఈమధ్య ఓ రెండు జెంట్స్ పార్టీలు ఏర్పాటు చేస్కున్నాం కదా. అలాంటి పనికిమాలిన పనులతో బాటుగా కాస్త పనికి వచ్చే పనులు కూడా చేస్తే ఎలా వుంటుందని మాకు అనిపించింది. అందుకే అలా ఆడెద్దామని నిర్ణయించాం. ఇదేం విశేషం కాదనుకోండి. మీలో కొంతమంది అయినా మీ స్నేహితులతో కలిసి క్రికెట్టో మరొహటో ఆడుతూవుండొచ్చు.

వాతావరణం మెరుగుపడుతోంది, చల్లదనం తగ్గుతోంది కాబట్టి ఇక కొద్దిరోజుల్లో వాలీబాల్ మొదలెట్టాలి. మాతో పాటు మా ఫ్యామిలీస్ కూడా ఆడుతారు. వారికీ వ్యాయామం కావాలి కదా. నాకయితే ఈ ఆట అస్సలు రాదు. మిత్రులు నేర్పిస్తామని చెప్పారు. అసలు ఇలాంటి ఆటలు ఎప్పుడో మొదలెట్టాల్సి వుండెను కానీ పలు కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు పార్టీలు చేసుకుంటూవుండటం వల్ల కొంతమందికయినా ఉత్సాహం వచ్చింది. 

గత ఏడాది వ్యాయామంగా కూడా వుంటుందని గార్డెన్ స్పేస్ రెంటుకి తీసుకొని కూరగాయలు పండించాం కానీ అది కాస్త దూరం అవడం వల్ల ఈ ఏడాది నేను దాని జోలికి వెళ్ళడం లేదు.  గత ఏడాదే కష్టకష్టంగా అది పూర్తి చేసాం.

6 comments:

 1. ఈ పరిస్తితులలో ఆటలు ఆడితే అక్కడ ప్రమాదమెమొ.

  ReplyDelete
 2. annayya vellu(fingers) :) jaagarta :) ,,,, asale vatito manaki chala important panulu vunnayi..

  ReplyDelete
 3. ఎప్పుడూ ఇన్డోర్ గేమ్సేనా??అవుట్ డోర్ గేమ్స్ కూడా ఆడాలి మీరు!!

  ReplyDelete
 4. @ అజ్ఞాత 4 ఎప్రిల్ 2013 9:52 PM
  ఏ పరిస్థితుల్లో? సర్జెరీ గురించా మీరనేదీ? సర్లెండి, అది జరిగిపోయి నెల కావస్తోంది. ఇవాళే మళ్ళీ యూరాలజిస్టును కలుస్తున్నా - ఇక అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనుకుంటా. నెలదాకా నామీద కూడా చెయ్యిచేసుకోవద్దన్నాడు కానీ మూడు వారాల తరువాత చీట్ చెయ్యకతప్పలేదు.

  @ అజ్ఞాత 5 ఎప్రిల్ 2013 2:05 AM
  అబ్బా, నేను వేరే దేనితోనో ఆడటంలేదు కదా - చేతుల్తో, వేళ్లతో కూడా ఆడొద్దంటే ఎలా? కొన్ని సార్లు కాల్క్యులేటేడ్ రిస్కులు తీసుకోక తప్పదు తమ్ముడూ.

  @ kvsv
  జనాలు సహించరు గానీ నాకు ఇండోర్ గేమ్స్ అవుట్ డోర్ లో ఆడటమే ఇష్టం :)

  ReplyDelete
 5. Vally boll may cause injuries on fingers and joints, take care sarath

  ReplyDelete
 6. @ అజ్ఞాత
  మీ శ్రద్ధకి ధన్యవాదాలు. ఏ అవుట్ డోర్ ఆట ఆడినా ఏదో ఒక సమస్య వుంటుందనుకుంటాను. రిస్కుల కన్నా ప్రయోజనాలు ఎక్కువ వున్నప్పుడు రిస్క్ తీసుకోకతప్పదు. మీరు చెప్పిన జాగ్రత్తలు దృష్టిలో వుంచుకుంటాను. నిన్న ఓ రెండు గంటలు ఆడాము. ఇప్పుడే వేళ్ళు వాడొద్దని (ఆటలో) సీనియర్లు చెప్పారు. అందువల్ల ఎక్కువగా ఉపయోగించలేదు కానీ ఓ వేలు మాత్రం వాచిపోయింది. ఇవాళ మళ్ళీ ఆట వుంది.

  ReplyDelete