పల్లె జీవనంకై పరుగులు పెడుతున్న నా మనస్సు

ఏంటో ఈ కృత్రిమ ప్రపంచం, కృత్రిమ బంధాలు చూసి చూసి విసుగొస్తోంది. నేను చిన్నప్పుడు పెరిగిన పల్లె జీవనం రారామ్మంటోంది. అలా అని అప్పుడున్న పెల్లె వాతావరణం ఇప్పుడు వుండకపోవచ్చు కానీ ఏదయినా మారుమూల పల్లె వెతుక్కోవాలేమో. చిన్నప్పుడు ఎంత బావుండేదీ. టివీలూ, నెట్టులూ లేక అంత బాగా ఆరుబయట అందరం రేడియో వింటో కబుర్లు చెప్పుకునేవారం. అలాంటి జ్ఞాపకలు ఎన్నెన్నో.

మా కజిన్ ఒకరు ఎంచక్కా తన కుటుంబాన్ని సిటీలో వుంచి తన పల్లెల్లో వ్యాపారాలు పెట్టాడు. కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, పాడి మొదలయినవి. అబ్బా, నాకయితే అక్కడికి రెక్కలు కట్టుకొని వాలాలని అనిపిస్తోంది. ఎప్పుడూ కంప్యూటర్ డబ్బా ముందు ముఖం వేలాడేసుకొని చేసే ఉద్యోగాలు చేసిచేసి విసుగొస్తోంది. అలా పల్లెలో పచ్చని పరిసరాల మధ్య, పెంపుడు జంతువుల మధ్య తిరిగుతూ శ్రమిస్తూ వుంటే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. 

నేనూ తన వ్యాపారంలో జత కలుస్తా అంటే సంతోషంగా తను ఆహ్వానించవచ్చు కానీ తీరా తట్టాబుట్టా సర్దుకొని వచ్చాకా అది నా వల్ల కాకపోతేనో? ఆ వ్యాపారం సరిగా నడవకపోతేనో? ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ఓ నెల రోజులు అక్కడ గడిపి ట్రయల్ చూడాలి.

మీ సలహా ఎంటి? మీ ఇంట్లో వారి అభిప్రాయం తెలుసుకోండి అనేటటువండి రొటీన్ సలహాలు ఇవ్వకండేం.

ఓకవేళ పూర్తిగా తరలి రావడానికి ప్రాక్టికల్ గా సాధ్యపడకపోతే ఏడాదికి ఒకసారయినా వచ్చి ఓ నెల రోజులయినా పల్లెల్లో గడిపి వెళ్ళాలనేది నా ప్లాన్ B.

18 comments:

  1. You already had a bitter experience with moving back to India with family. So I think plan B would be better.

    Siddharth

    ReplyDelete
  2. బాగా ఆరుబయట అందరం రేడియో వింటో కబుర్లు చెప్పుకునేవారం. అలాంటి జ్ఞాపకలు ఎన్నెన్నో...
    నాక్కూడా పారిపోవాలని అనిపిస్తుం దండీ...ఆ వాతా వరణమే వేరు..కనీసం నిద్రా కరువైపోయేట్టు చేసారు ఇప్పుడు !!ఆ వర్షాలూ...నాలుగైదు రోజుల పాటు తుఫాను...ముసురు...టీ లూ..పేపరూ...రేడియో....తుఫాను వార్తలు...కొత్త సినిమా ..పండగా..కొత్త బట్టలూ...తూ..ఇప్పుడు పండగ రోజూ...వర్కే!!

    ReplyDelete
  3. అవకాశం ఉంటె ముందు మీ మిత్రుని వ్యవసాయం లో వాటా తీసుకోండి . లేదంటే అదే గ్రామం లో లేదా మీ సొంత గ్రామం లో పొలం కొనన్ది. అది పెట్టుబడిగా ఉన్తున్ది.భుమి విలువ ఎప్పుడు పెరుగుతూనే ఉన్తున్ది. మీకు నచ్చక పోతే తిరిగి వెళ్లి పోయినా , భూమి పై పెట్టిన పెట్టుబడిలో నష్టం ఉండదు .. రేటు పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు వచ్చే ఆదాయం ఆగిపోయినా నా అవసరాలకు ఇబ్బంది లేదు అనే స్థాయికి మీరు చేరుకున్నారా లేదా చుదన్ది. వ్యవసాయం మిద వచ్చే ఆదాయం తోనే బతకాలి అంటే ఇబ్బంది యేర్పడ వచ్చు. మీరు సంపాదించి పొదుపు చేసుకున్న దానిలో కొంత పెట్టు బడి పెత్తన్ది. దానిపై వచ్చే ఆదాయం తో కాస్త ప్రశాంతంగా బతికే ఏర్పాటు చేసుకొని అప్పుడు వ్యవసాయమ పై దృష్టి పెత్తన్ది.. ఇదే అంశం పై నేను ఆలోచిస్తున్నాను అయిత్య్హే ఇప్పుడ ఎకాడు మరో పదేళ్ళ తరువాత

    ReplyDelete
  4. నగర జీవితాలతో విసిగిపోయిన చాలామందిలో మెదిలే అలోచనే మీకూ వచ్చింది.
    శారీరక శ్రమ చెయ్యగలిగితేనే ముందడుగు వెయ్యాలి.
    లేకపోతే లాంగ్ లీవులో (దొరికే అదృష్టవంతులు ఉన్నారా?) పల్లెలకి వెళ్ళి రీచార్జ్ అవ్వాలి.

    ReplyDelete
  5. Memu kooda mee laage anukuntunnamu. Meme kadu nagara jeevitapu kaalushyam to visigi poyina chala mandi abhiprayam ide .kaani palle jeevitam lo idivarakati prasantata undademonanna bhayam kooda unnadi.digitene kani lotu teliyadu.

    ReplyDelete
  6. మీకు దమ్ముంటే ఒక పంటకి 100బస్తాల ధాన్యం పండించండి చూద్దాం.... అని అనను కానీ..

    మీ లాంటి వాళ్ళే నష్టాలు-కష్టాలు అంటే ఎలా గురువుగారు.. చిన్నప్పుడు బావి దగ్గరికి సద్ది తీసుకపోయిన రోజులు గుర్తు లేవేమో, ఎండ పొడ పడకుండా మోదుగ చెట్ల నీడలో పంపు సెట్టు దగ్గర మధ్యహ్న భోజనాలు ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్న రోజులు, కొత్త ఎడ్లు తొందరగా దారికి రాక మనల్నే తరిమిన రోజులు మరిచి పోయారా.. జున్ను పాలు తాగటం మరచి పోయారా..

    దోస్తులతో ఈతలకు పోవటాలు..బావిలో ఎక్కువ ఎత్తుల నుంచి దూకుతూ పోటీ పడటం మరచి పోయారా..

    దీపావళికి చెరువు దగ్గర కబడ్డీ ఆటలు మరచిపోయారా.. రేగుపళ్ళ కోసం దండ యాత్రలు, సీతాఫలాలు పొదల్లో దాచిపెట్టటం, తాటి ముంజలూ, తాటి పండ్లూ,

    ...కల్లు.. కల్లు నెలా మరిచిపోయారు గురువుగారు ? వా.. వా... మమ్మీ..

    ReplyDelete
  7. @ సిద్ధార్ధ్
    అవును లెండి. అదే పెద్ద సమస్య నాకు.

    @ 'పల్లె' కొండల రావు
    ధన్యవాదాలు.

    @kvsv
    సౌకర్యాలు మెరుగు అయ్యాయి కానీ జీవితాల్లో సంతోషం కరువైపోతోంది.

    ReplyDelete
  8. @ బుద్ధా మురళి
    ఒకేసారి ఈ మార్పు అంటే కష్టం కాబట్టే నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తాను. వీలయితే ఈ ఏడాది వచ్చి ఆ వ్యాపారాలు నాకు సరిపడతాయో లేదో ఆ ఊర్లో ఆ ప్రదేశాల్లో వుండి మరీ కొన్ని రోజులు స్టడీ చేస్తాను. దాన్ని బట్టి గట్టి ఐడియా రావచ్చు. హాయిగా ఏ రిస్కులూ వద్దు అనుకుంటే యుఎస్ లో కష్టపడటమూ, ఇండియాలో హాయిగా నచ్చిన విధంగా ఓ నెల సేద తీరడమూ బావుండగలదేమో.

    @ బోనగిరి
    ఇండియా పల్లెల్లో రిచార్జ్ అవడమే నా ప్లాన్ B. ఇదివరలో వచ్చినప్పుడు కూడా కొద్ది రోజులయినా పల్లెల్లో వుండేవాడిని. కొద్దిమంది తప్ప మా బంధు మిత్రులందరూ నగరాలకు తరిలారు. అందుకే ఎంత కాదనుకున్నా వారిని కలవాలి కాబట్టి చాలా రోజులు నగరాల్లో గడపాల్సి వచ్చేది. ఈసారి నుండి ఇంకా బ్యాలన్స్ చెయ్యాలి.

    ReplyDelete
  9. @ నాగరాణి
    నిజమే. పల్లెలూ కలుషితం అయ్యాయి. అప్పటి ప్రశాంతత ఇప్పుడు ఎక్కడిది? మారుమూల గ్రామాల్లో అయినా పల్లెదనం ఇంకా వికసిస్తోందా అనేది నాకూ తెలియదు. ఎవరయినా చెప్పండి. నా వరకు అయితే ఒక అవకాశం వుంది. మా కజిన్ తన గ్రామీణ వ్యాపారాలు వ్యవసాయ క్షేత్రంలో పెట్టాడు కాబట్టి హాయిగా అక్కడే గడిపేస్తా (ఇండియా విజిట్ కి వచ్చినప్పుడు).

    @ కాయ
    బాల్య స్మృతులు భలే గుర్తుకు చేసారు. అవన్నీ గుర్తుకువస్తుంటే భలే సంతోషంగా వుంది. మీకు వ్యవసాయంలో అనుభవం బాగానే వున్నట్లుందే. నేను అంత కష్టపడలేదు లెండి. ఏదో కొద్దిగా కొన్ని పనుల్లో సహకరించేవాడినంతే. అన్నట్లు కావాలనే గ్రామంలో వుండే అత్తగారిల్లు చూసుకున్నాను. ఇండియాలో వున్నప్పుడు పండగలకూ, పబ్బాలకూ అత్తరింటికి దారేదీ అని వెళ్ళి ఎంచక్కా గడిపివస్తుండేవాడిని. ఇండియా విజిట్టుకి వచ్చినప్పుడు నాకు పిల్ల నిచ్చిన ఊరులో ఒక రోజు అయినా గడిపివస్తుంటాను.

    ReplyDelete
  10. వ్యవసాయంలో సాయం అనుభవం కొద్దిగా ఉంది.. మన తెలంగాణ లో అమ్మగారింట్లో పని చేయించటం పద్ధతి కాదని నా చిన్నతనంలో రాజులా పెంచారు.. నేనే కొద్దిగా డిమాండు చేసి, వ్యవసాయపు పనుల్లో వేళ్ళు పెట్టేవాడిని.. తప్పుచేసినా ఏమనక పోయేవాళ్ళు.. అందరికి మనవడు మనవడు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్యలు.. చిన్నప్పుడే కల్లు తాగి సైకిల్ యాక్సిడెంట్లు చేసిన నేను.. కల్లు తాగి సైకిల్ తొక్కుతుంటే గాల్లో తేలిపోతున్నట్లు ఫీల్ అవుతూ, ఇంకా రెచ్చిన బలంగ తొక్కుతము.. ఎక్కడైనా బర్రెలడ్డొస్తే బ్రేక్ వేయబోయి రోడ్డు పక్కన చెట్లల్లోనో, వరి మడుల బురదల్లోనో పడుతం అంతే..

    ఆరోజుల్లో అందరూ పేదవాళ్ళే..మమతలూ, మర్యాదలూ ఉండేవి.. ఎవరింటికి పోయినా గుండె నిండా ఆప్యాయత చూపేవాళ్ళు, ప్రేమగా ముచ్చట్లు నడిచేవి... అన్ని ఇళ్ళలో కోళ్ళు,
    బర్రెలు కామన్...

    ఇప్పుడు మనుషులే లేరు..

    ReplyDelete
  11. మీరు కోరుకుంటున్నది పల్లె జీవనమే కాని, అక్కడ జీవనోపాధి కాదనుకుంటాను.

    ఏదయినా మీరనుకున్నంత తేలిక కాదు, మహా అయితే డబ్బు ఖర్చు పెట్టి పొందగలిగినవిమాత్రమే కాస్త తేలిగ్గా వస్తాయి కాని అక్కడి ఆత్మీయతలు కూడా కావాలంటే ముందు మీరు వారి పై ఆత్మీయతలను పెట్టుబడి పెట్టాలి :)

    అంటే కేవలం NRI లా ఒక నెల ముందు ప్లాన్ చేసికొని నెలరోజులు ఉండి వచ్చేలా కాకుండా, రెగ్యులర్ గా టచ్ లో ఉంటో అక్కడి వారి బాగోగులను , వీలయిన సహకారం ని ( అది మాట సాయమే కావచ్చు ) ఇస్తూ ఉండాలి

    వ్యాపారాలు అవి వాటంతట అవే వస్తాయి తర్వాత. కాదంటారా?

    ReplyDelete
  12. @ కాయ
    "ఇప్పుడు మనుషులే లేరు.."
    అందుకేనేమో ఇక్కడివాళ్ళు మనుషుల కంటే ఎక్కువగా జంతువులని (పెట్స్) పెంచుకుంటారు.

    @ మౌళి
    అంత తీరిక, ఓపిక, ఆసక్తీ లేవు లెండి :)
    సర్లెండి - అంత అనుబంధాలు అందరితో పెంచుకుంటే వెళ్ళేటప్పుడు అందరికీ బహుమతులూ తీసుకెళ్ళాలి. అంతొద్దు నాకు - కొద్దిగా చాలు :)

    ReplyDelete
  13. See this
    http://www.livemint.com/Opinion/uShBhfs8qfThQ5RlY1foWI/Can-India-afford-its-villages.html?facet=print

    ReplyDelete
  14. @ అజ్ఞాత
    సర్లెండి - పల్లెలూ పట్నాలయిపోతే ఇంకా అక్కడికి వెళ్ళడం ఎందుకు?

    పల్లెల్లో వున్న కొందరు పట్నాలకి, పట్నాల్లో వున్న కొందరు పల్లెలకీ వెళ్ళాలనుకోవడంలో విచిత్రం లేదు. ఎవరికి ఏది ఇష్టమో దాన్ని బట్టి వుంటుంది.

    ReplyDelete
  15. గురువుగారు..మీరు కొత్త వ్యవసాయం మొదలు పెట్టాలని నా కోరిక.. పేరు కంపనీ వ్యవసాయం.. మీకు ఆకుపచ్చ కార్డు ఉండే ఉంటుంది.. అందుకని ఇక్కడా అక్కడా పని కానివ్వొచ్చు..

    మీ వ్యవసాయపు బాగోగులు చూడటానికి మేనేజర్లూ, వర్కర్లూ ఉంటే బాగుంటుంది.. అప్పుడప్పుడు వెళ్ళి ఒక రోజు దున్ని వద్దురు..

    కళలు వదిలేశాం, ఆటలు వదిలేశాం, ప్రకృతినీ వదిలేశాం ఎప్పుడూ ముందు చూపేనా.. ఈ రోజు లాగే ప్రతి రోజూ జరిగిపోతున్నది..

    ReplyDelete
  16. nice option kachitamga step tisukondi

    ReplyDelete
  17. Hey there, You have done an excellent job. I'll definitely digg it and personally suggest to my friends.
    I'm confident they'll be benefited from this site.

    ReplyDelete