ఏమీ వ్రాయాలన్పించడంలే...

...అందుకే వ్రాయట్లా.

నాకున్న కొద్ది మంది శ్రేయోభిలాషులు నా గురించి ఖంగారు పడకుండా వుండటానికి ఇలా తెలియపరుస్తున్నాను. 

మళ్ళీ వ్రాయాలనిపించినప్పుడు వ్రాసేద్దాం.

ఏంటో కానీ బ్లాగు లోకం (కూడా) బోర్ కొడుతోంది.

27 comments:

  1. అన్నట్లు బ్రిటనులో కుల వివక్షత లేకుండా ఏదో చట్టం చేస్తున్నారంట కదా. కులం కంపు బ్రిటనుకీ పాకించేసారే మనవాళ్ళూ! ఇక ఈ అమ్రెకాలో కుల వివక్షత చట్టాల గురించి ఆందోళనలెప్పుడో మరి. ఆ తరువాత రిజర్వేషన్లు కావొద్దూ. అటుపై ఉప కులాల గురించి గొడవలు ఇంకెప్పుడో మరీ!

    ReplyDelete
  2. బహుశా వ్రాయాలనిపించడం లేదు అని నేను వ్రాయడంలోనే నాకు వ్రాయాలనిపించడం అనేది మీకు తోచడం లేదూ?

    ReplyDelete
  3. వ్రాయాలనిపించనప్పుడు.....చదివితే పోలా :-)

    ReplyDelete
  4. @ పద్మార్పిత
    :)

    కానీ చదవాలని కూడా అనిపించడంలా. అందుకే బ్లాగు లోకం బోర్ కొడ్తోందని వ్రాసా. అన్నీ చప్పచప్పటి పోస్టులు. ప్చ్! (కవితలు, కవిత్వాలకేమో నేను దూరం)

    అయితే బయట బోర్డం లేదేమో - నాలోనే వుందేమో లెండి. కొన్నాళ్ళిలా కొనసాగనివ్వండి...అదే సర్దుక్కూర్చుంటుంది.

    ReplyDelete
    Replies
    1. ఏదైనా ఆపరేషన్ తర్వాత కొంతకాలంపాటు అంతా స్తబ్దుగా అనిపించడం సహజమేలెండి. మీరిపుడు అదే స్టేజిలో ఉన్నట్టు ఉన్నారు. కొంతకాలం తర్వాత అంతా హ్యాపీగా ఉంటుందిలెండి.

      Delete
    2. @ అజ్ఞాత
      ఈ స్థబ్దత (మరియు చాలా లక్షణాలు) మరో కారణం వల్ల లెండి. నాలో ఈమధ్య ఈస్ట్రోజెన్ బాగా తక్కువయ్యింది. అరోమటేజ్ వల్ల నా శరీరంలో ఈస్ట్రోజెన్ పెరుగుతున్నందువల్ల ఇన్హిబిటర్స్ వాడుతున్నా. అయితే ఆ మందు డోసేజ్ ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేస్తూనే వున్నా కాబట్టి ఈస్ట్రోజెన్ హెచ్చుతగ్గులు కొంతకాలం వుంటాయి. ప్రస్థుతం తగ్గిన ఈస్ట్రోజెన్ ని పైకి పెంచే ప్రయత్నాల్లో వున్నాను. ఫలితాలు కనిపిస్తున్నాయి. సర్దుకోవడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చు.

      మగవారిలో కూడా ఈస్ట్రోజెన్ హెచ్చుతగ్గులు ఎంతగా మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేస్తాయో గమనిస్తూవుంటే సంభ్రమం కలుగుతుంది. ఎంతమంది డాక్టర్లు ఈ కోణంలో ఆలోచిస్తారూ, చికిత్స చేస్తారూ?

      Delete
    3. ఏమన్నా అంటే అన్నామంటారు, ఈస్ట్రొజెన్ను, టెస్టొస్టిరాన్ను అంటే మాకేటి తెలుస్తాది. ఎంత కమ్యూనిశ్టులు అయితే మాత్రం గింత సైంటిపిక్ గా టింకింగు సేయాల్నా ?

      ఒక్క గలాసు కాక్ టెయిలో, ఒక మూడు బీరు సీసాలో ఖాలీ జేస్తె అదే సర్దుక్కూచుంటుంది..

      ఈ నంగ నాటకాలు ఆపి బ్లాగులు రాయండి.. లేకపోతే ... తొక్క తీయలేం కని.. రాసి పాడేయండి గురువు గారు..

      Delete
    4. @ కాయ
      హహ. చాలామందికి తెలియదు కనుకనే తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తుంటాను.

      మందు, బీరు అంటే గుర్తుకు వచ్చింది. గుంటూరులో ఒకసారి మా స్నేహితులతో కలిసి మందుకొట్టిన వైనం బాగా గుర్తుంది. వాతావరణం వేడిగా వుంది కదా అని గార్డెన్ బార్ అండ్ రెస్టారెంటులో బిర్యానీ తింటూ బీరు కొడ్తూ వుంటే పై నుండి సన్నటి చిరు ఝల్లు మొదలయ్యింది. ఎంత బాగా అనిపించిందో. మంచి వాతావరణం, మంచి స్నేహితులు, మంచి భోజనం, మంచి బీరు. వాహ్.

      అప్పుడెప్పుడో రచయిత చలం స్నేహితుడు ఎవరో 'వ్రాయడానికేం వుంది?' అని వాపోయాడుట. అలా వుంది నా స్థితి. వ్రాయాలనుకునేవి వ్రాయదగ్గవి కావు - వ్రాయదగ్గవి వ్రాయాలనిపించదు. ఈ రెండింటి మధ్య ఏదో ఏదేదో వ్రాసేస్తుంటాను.

      Delete
    5. అవునవును.. మొక్కజొన్న గారెలు, మందు, దోస్తులు.. ఉంటే ఆహా నా రాజ.. నాకైతే ఆ అనుభవాలు కోకొల్లలు..

      "వ్రాయాలనుకునేవి వ్రాయదగ్గవి కావు - వ్రాయదగ్గవి వ్రాయాలనిపించదు." ఇటువంటి విషయాలనే కళాకారులు తమ శిల్పంలో చూపిస్తుంటారు. (ఇక్కడ శిల్పం సరైన పదం అనిపించింది.. అర్థం తెలియదు).. చెంబులో ఇరుక్కున్న పిడికిలిలా మాట్లాడుతున్నరు.. అయినా రాస్తేనే తీరుతదా..

      Delete
    6. @ కాయ
      మందు, విందు, దోస్తులు విశేషం కాదు. నేనూ చాలాసార్లు గడిపాను కానీ వర్షంలో అలా తడుస్తూ తింటూ, తాగుతూ వాగుతూ వుంటే భలే మజా వచ్చింది. ఇంకొక్కటే మిస్సయ్యింది కాదూ :)

      ఏంటో మీరు ఈమధ్య అర్ధం అయ్యీ అవనట్లుగా మాట్లాడుతున్నారు - మీరు ఖచ్చితంగా మేధావులు అవుతున్నారు.

      Delete
    7. అవునవును..వర్షమే ముఖ్యాంశం అని.. అది వ్రాయటమే మరిచా..అయినా..వర్షం ఉన్నప్పుడే కదా..వేడి వేడి మొక్కజొన్న గారెల మజా తెలిసేది..

      ఇలాంటివి చెప్పేటప్పుడు పూర్తిగా అందులో లీనమై వ్రాస్తుంటాను.. ఆ లోకం నుంచి ఈ లోకం వచ్చేసరికి భాష సరిపోవట్లేదు.. లేదా..వ్రాసేది నేను కాదు...

      Delete
    8. మీ ఇంకొకటి తగలెయ్య... సందు దొరికితే చెప్పటానికి రెడీ అయిపోతారు..

      Delete
  5. Blogs ayithe boring gane vunnayi lendi, evo konni thappa. Personal life kuda ilage vunte, manchi city lone vunnaru kadha, paiga weather kuda bagundi. Enjoy cheseyyandi winter raka munde :)

    ReplyDelete
  6. ఈ బ్లాగు బోరు చాలా మంచి విషయం. బోర కుంటే ఏదో తప్పు. బోరు తోంది కాబట్టి మీరు రైటైన రీతిన వెళుతున్నట్టు లెక్క ! సొ, సమయం తీసుకుని మీకు మళ్ళీ మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రాయండి. గ్రహణం వదిలిన సూరీడి వెలుగులా మీ టపాలు భాసిల్లును !!!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. ఇక ఈ అమ్రెకాలో కుల వివక్షత చట్టాల ...........
    ...............

    అమెరికాలో కులానికో సంఘం (తెలుగు ) ఉంది కదా

    ReplyDelete
  8. edainaa athi ithe bore ee kadaa. meeru anni ekkuva vaadesthuntaaru. andukenemo.

    ReplyDelete
  9. ఇలా బోర్ కొట్టినప్పుడల్లా......మీరు వ్రాసినవి మీరే డెలిట్ చేస్తే మళ్ళీ వ్రాయాలనిపిస్తుందేమో... Think zaraa haTke :-)

    ReplyDelete
  10. @ సిద్ధార్ధ్
    బ్లాగు బోరు, లైఫ్ బోరు, వైఫ్ బోరు - ఇంకా ఏముంటుంది జోరు? ఏంటో నాకు ఆమ్రెకా పెద్దగా కలిసి రాలేదు. చాలా బంధాలూ, అనుబంధాలూ, అనురాగాలూ నాకు ఇండియాలోనే వున్నాయి. అందుకే మనిషిగా ఇక్కడ, మనస్సుగా ఇక్కడ. ఇండియాలోనే స్థిరపడొచ్చుగా అని అడక్కండి - అది కుదరకపొవడానికి కొన్ని కారణాలు వున్నయ్. అందుకే ఈ మధ్యే తీర్మానించాను. ఇక్కడి ఆనందాల గురించి శోష పడకుండా పూర్తిగా ఇక్కడ కెరీర్ మీద మనస్సు నిలిపి ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో (అనగా సంపాదనలో లెండి - ఈ విషయంలో మనం వెరీ వీకూ) పైకి వస్తూ ఏడాదికి ఒక్క సారన్నాఇండియాకి వెళ్ళి ఓ నెల పాటన్నా వుండి రావాలని డిసైడ్ చేసిన. మరి ఎన్ని రోజులుంటుందో ఈ నిర్ణయం. ఈ సారి మూడేళ్ళవుతోంది వెళ్ళి వచ్చి. క్రితం సారి వెళ్ళినా వారం రోజులే వున్నా.

    ReplyDelete
    Replies
    1. మీ భారత ప్రేమ చూస్తుంటే మమ్మీ మమ్మీ అని ఏడ్చే పిల్లాడిలా అనిపిస్తున్నారు.. పైసలదేముంది గురువుగారు, ఇవాల వస్తయ్, రేపు పోతయ్.. కొంచెం మూట గట్టి చిన్న బిజినెస్సు పెట్టుకున్నా మనూరు మనకు అచ్చి... పిల్లలకు గూడ మస్తు మంది దోస్తులు, పుల్లు చైతన్యం.. మీ అభ్యుదయ కమ్యూనిశ్టు భావాలకూ ఢోకా లేనంత పని పడ్తది..

      ఇక్కడే ఉంటానంటే మాత్రం.. పుట్టింది ఇక్కడ ఉద్యోగం వెలగబెట్టడానికే అన్నట్టుంది..

      Delete
    2. @ కాయ
      హ్మ్. పిల్లలతో ఇండియా ప్రయోగం ఆరేళ్ళ క్రితమే అయిపోయింది. తెనాలి రామలింగడి పిల్లి పాల లాగా మా పిల్లలకు ఇండియా అన్నా, ఇండియా చదువు అన్నా భయం పట్టుకుంది. కొన్ని వారాలు చూట్టానికి అయితే వోకే కానీ అక్కడే వుంటామంటే అస్సలు ఇష్టపడటం లేదు. అలాగే మా ఆవిడకీ అక్కడే వుంటం ఇష్టం లేదు. నాకు అక్కడ వుండటం ఇష్టమే కానీ మళ్ళీ ఇక్కడిలాగే సాఫ్ట్ జాబులు అక్కడ చెయ్యాలని లేదు, సిటీల్లో వుండాలని లేదు. అక్కడికి వచ్చి సాఫ్ట్(వేరు) జాబులు చేస్తూ, సిటీల్లో వుండటం కన్నా ఇక్కడ వుండటమే నాకు నయ్యం. ఎంచక్కా పెల్లెటూర్లో నివసించాలని వుంటుంది. టవున్లు అయినా వోకే. మా ఫామిలీకి పల్లెలంటే ఇష్టం లేదు. అలా అలా ఇక్కడ చిక్కడిపోయాను.

      మా కజిన్ ఒకరు ఫామిలీని (హైదరాబాద్) సిటీలో పెట్టి తన పల్లెలో వ్యాపారాలు పెట్టాడు. డైరీ ఫార్మ్, గొర్రెల పెంపకం, హేచరీ లాంటివి. అతగాడిని చూస్తే నాకు అసూయగా వుంటుంది. పల్లె, పట్టణం భలేగా బ్యాలన్స్ చేస్తున్నాడు. నాకూ అలాగే చెయ్యాలని వుంది కానీ, నేనూ కలుస్తానంటే వద్దనడేమో కానీ...కానీ... కానీ...

      Delete
    3. America nakkuda peddaga kalisi raledhu lendi. Hyderabad lo naku dorikina sukham, anandam ikkada asale ledhu. Big cities lo vunte cheppalenanukondi.

      Delete
  11. @ జిలేబీ
    నిజమే లెండి. అప్పుడప్పుడూ హెచ్చుతగ్గులు వుండాలి. లేకపోతే బోరు కొడుతుంది కాదూ.

    @ బుద్ధా మురళి
    కులం వాసనలు వేరు, కులం కంపు వేరు :) అట్రాసిటీ చట్టాలు ఇక్కడ రానున్నాయా అనుకుంటేనే రోత కలుగుతోంది. బ్రిటనులో వస్తూండగా లేంది ఇక్కడా రావాలని ఆందోళనలు వస్తే ఆశ్చర్యపడగలమా? కుల జాడ్యం, అట్రాసిటీ చట్టాల లాంటివి ఇక్కడ లేవని కాస్త సంతోషిస్తుంటాను కానీ అవీ ఇక్కడికి పడొచ్చు అనుకుంటే ఎదోలా వుంది.

    ReplyDelete
  12. @ అజ్ఞాత
    ఎక్కువగా ఏం వాడేస్తున్నానండీ బాబూ? ఆయ్! ఎక్కువగా వాడకనే కదా అన్నీ తుప్పు పడుతున్నాయీ - నా బ్లాగుతో సహా. ఇదివరకు ఎలా వుండేవి నా బ్లాగూ, నా వ్రాతలూ - ఇప్పుడెలా వుందీ? ఎదో వ్రాస్తున్నా అంటే వ్రాస్తున్నా - మీలాంటి వారు కొందరు చదువుతున్నామంటే చదువుతున్నారు - అలా ఏదయినా సరే నడిచిపోతోందంతే - అప్పటి జోరేదీ?

    @ ప్రేరణ
    అవునులెండి. మనకు నచ్చని వేరే వారి పోస్టులు ఎలాగూ మనం తొలగించలేము కాబట్టి మన టపాలకి మనమే టపా కట్టేస్తే సరీ. నిజానికి నేను ఎన్నో టపాలు తొలగిస్తూ వుంటాను. పలు కారణాల వల్ల పలు టపాలు అనవసరమయినవిగా అనిపిస్తాయి - తీసివేస్తుంటాను.

    ReplyDelete
  13. ayinaa appati rojulu ippudu levandi. aa rojulu thalachukuni, ippudu vachchaaro chachchaare.

    lokam, janaalu, bandhaalu annee maaripoyaayi. ikkada India lo unna memu koodaa aa paatha rojulu thalachukuni aanandapadadame. ipudu annee pakkaa commercial relations maathrame.

    doorapu kondalu nunupu ani, meeranthaa akkade dooram gaa undi, naa janmabhoomi... ani paadukondi.

    ReplyDelete
  14. బుల్లబ్బాయ్April 27, 2013 at 1:02 PM

    అన్నాయ్ బోరు కొడతాంటే, రామూ గారి బ్లాగులో నాకు సమాధనమియ్యొచ్చు గదా? లేదంటే ఆ టాపిక్కు మీద ఇక్కడో పోస్టేసెయ్యి

    ReplyDelete
  15. @ అజ్ఞాత
    నిజమేనండి. బంధాలన్నీ వ్యాపారాత్మకం అయిపోయేయని అందరూ అంటున్నారు. ప్చ్! మొత్తం వచ్చెయ్యడం కాకున్నా ఏడాదికి ఓసారన్నా వచ్చి ఓ నెల వుండగలిగితే రెండు దేశాలనీ బ్యాలన్స్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నా. చూడాలి.

    @ బుల్లబ్బాయ్
    హ హ. ఆ టాపిక్కు మీద మరీ అంత ఆసక్తి లేదు.

    ReplyDelete
  16. @కానీ చదవాలని కూడా అనిపించడంలా...

    అదేమిటీ మాంచి బ్లాగులున్నాయ్..నాకు చదవటానికే టీం సరిపోవడం లేదూ...

    ReplyDelete