మీకు థైరాయిడ్ సమస్య వుందా లేక ఆ అనుమానం వుందా?

థైరాయిడ్ సమస్యలు ఒక నిశ్శబ్ద ఉపద్రవం లాగా విస్తరిస్తున్నాయి. ముప్పయి ఏళ్ళు దాటిన మహిళల్లో కాస్తయినా థైరాయిడ్ అపసవ్యత లేకపోతే ఆశ్చర్యపోతాను నేను. అలాగే పిల్లల్లో కూడా పెరుగుతోంది. ఎప్పుడో చదివిన చదువుల అధారంగా లేదా బూజు పట్టిన ప్రమణాల ఆధారంగా చికిత్స చేసే చాలామంది డాక్టర్లు, ఎండోక్రైనాలజిస్టుల  వల్ల ఎంతోమందికి ఈ సమస్య వున్నా, వారికి చూపించుకుంటూనే వున్నా ఫలితం లేక మౌనంగా అవస్థపడుతున్నారు. నేచురోపాత్ లూ, ఆస్టియోపాత్ లు, ఏంటీ ఏజ్ స్పెషలిస్టులూ మాత్రం పేషెంట్లను  సమగ్రంగా పరిగణలోకి తీసుకుంటూ ఈ విషయాల్లో ముందున్నారు. 

నాకు కూడా డాక్టర్లు ఎన్నో ఏళ్ళుగా మిగతా పరీక్షలతో పాటుగా థైరాయిడ్ పరీక్ష చేస్తూనే వున్నా సమస్య గుర్తించలేకపోయారు. కారణం - బూజు పట్టిన పద్ధతులలో వారు పరీక్షించడం.  థైరాయిడ్ అనగానే ఏదో పెద్ద మహా రోగం అనుకునేరు. కాదు. చాలామందికి వుంటుంది - అందులో చాలామందికి తమకు వున్నట్లుగా తెలియదు. అనుమానం వచ్చి వైద్యుడికి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకున్నా వారు భేషుగ్గా వున్నారని చెప్పడంతో ఇహ చేసేదేమీ లేక మౌనంగా అవస్థపడుతుంటారు. కొద్దిమంది డాక్టర్లకి మాత్రమే ఈ విషయాల్లో మంచి అవగాహన వుంటుంది. వాళ్ళు మాత్రమే ఈ సమస్యను గుర్తించి చికిత్స చెయ్యగలుగుతారు. 

మీలో ఎవరికయినా థైరాయిడ్ సమస్య వుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా లక్షణాలు, ఇబ్బందులు తగ్గకపోయినా, లేదా అది వుండొచ్చనే అనుమానం వున్నా  మీకు గైడెన్స్ కావాలంటే నేను ఇవ్వగలను. నాకు మరియు నా ఫామిలీకి ఈ ప్రాబ్లెం వుంది కాబట్టి దీని మీద నేను ఎంతో చదివాను, ఎన్నో వ్యాసాలు పరిశీలించాను, ఎన్నో పేషెంట్ ఫోరంస్ తిరగవేసాను. ఆ రకంగా ఈ విషయంపై అవగాహన పెంచుకున్నాను. మీ డాక్టరుతో ఏం మాట్లాడాలో లేదా ఎలాంటి డాక్టరుని ఎన్నిక చేసుకోవాలో, ఎలాంటి రక్త పరీక్షలు చెయ్యించుకోవాలో, ఫలితాలను ఎలా విశ్లేషించుకోవాలో, ఆ వాల్యూస్ ఎంత వుండాలో  సూచించగలను.  నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com. ఎందుకయినా మంచిది నలభై ఏళ్ళు దాటిన వారు ఓ సారి ఈ పరీక్షలు చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈ క్రింది లింకును నొక్కి ఆ సైటుకి వెళ్ళి అక్కడ ఇచ్చిన లక్షణాల లిస్టును పరిశీలించండి.  ఆ లక్షణాలలో కొన్ని అయినా వుంటే మీకు థైరాయిడ్ సమస్య వుండే అవకాశం వుంది.

హైపో థైరాయిడిజం లక్షణాలు: 
http://www.stopthethyroidmadness.com/long-and-pathetic/

 హైపర్ థైరాయిడిజం లక్షణాలు:
http://en.wikipedia.org/wiki/Hyperthyroidism#Symptoms_and_signs
 

5 comments:

  1. కొద్దిమంది డాక్టర్లకి మాత్రమే ఈ విషయాల్లో మంచి అవగాహన వుంటుంది. వాళ్ళు మాత్రమే ఈ సమస్యను గుర్తించి చికిత్స చెయ్యగలుగుతారు...
    చెప్పాకూదదనుకున్నా..చెప్పేస్తున్నా...టుయ్.. .టుయ్...ఇక్కడయితే ఇంకా గుండు సున్నా మన వాళ్ళు..కాసుల మేతే గానీ మెదడుకు మేతే ఉండదు..ప్రాక్టీస్ చేసే వాళ్ళలో టీచింగ్ హాస్పటల్లో ఉన్న వాళ్ళు తప్ప...కనీసం పుస్తకంతీయటం గానీ కోత్త గా అప్డేట్స్ తెలుసుకోవడం కానీ ఉండదు..

    ReplyDelete
  2. @ kvsv
    మా డాక్టర్ అయితే అలా కాదు. ప్రతి ఆరు నెలలకయినా కొన్ని రోజులు డాక్టర్ల కన్వెన్షనుకో, ప్రొఫెషనల్ రిఓరిఎంటేషన్ కోర్సులకో వెళుతూ తనను తాను అప్డేట్ చేసుకుంటాడు. (ఆయన అమెరికన్ కానీ తండ్రి భారతీయుడు - తల్లి పాకిస్తానీ)

    ReplyDelete


  3. మీరా విధంగా ఎందుకు రాసారో తెలియడం లేదు.ఏM.D.(general)డాక్టరైనా థైరాయిడ్ జబ్బుని గుర్తించగలడు.thyroid goitre, hyper or hypo thyroidism ని గుర్తించడానికి T3,T4,TSH, IODINE test వంటి పరీక్షలద్వారా గుర్తించవచ్చును.చికిత్స చేయవచ్చును.endocrinologist కూడా తెలుసుకొని ట్రేట్ చెయ్యలేదంటే నమ్మశక్యం కాదు.

    ReplyDelete
  4. @ కమనీయం
    అవన్నీ చేస్తారు నిజమే కానీ వాల్యూస్ రేంజిలో వుంటే అంతా బావుందని పంపిస్తారు. ఆ రేంజిలు ఎప్పటివో పురాతనమైనవి అయివుండవచ్చు. సరికొత్తగా అప్డేట్ చేసుకోవడం వీళ్లకూ, మెడికల్ ల్యాబ్ లకూ తెలియదు. రేంజిలో తొమ్మిదేళ్ళ పిల్లాడి నుండి తొంభయ్ ఏళ్ళు వృద్ధుడి వరకూ వుండొచ్చు. అందుచేత రేంజిలో వుండగానే సరిపోదు - మనకు తగ్గట్టుగా ఆప్టిమంగా వుండాలి. అక్కడే చాలామంది వైద్యులు పొరపాటు చేస్తుంటారు.

    ReplyDelete

  5. latest reports are taken into consideration and along with clinical history,signs and symptoms to arrive at conclusion .Therefore there is no difficulty in diagnosis.

    ReplyDelete