జెంట్స్ పార్టీస్ - జెలసీ లేడీస్!

గతవారం మా రెండవ మగ పార్టీ దిగ్విజయంగా జరిగింది. గమనిక - అది మగవారి పార్టీ కానీ మ'గే'వారి పార్టీ కాదు. అపోహలు వద్దు. ఓక్కే. అయితే అప్పుడే ఓ రెండు జెంట్స్ మీటింగ్స్ అయ్యాయో లేదో ఆడలేడీస్ నుండి రుసరుసలు, మూతి విరుపులూ మొదలయ్యాయ్. ఏం పనిలేదా, ఎప్పుడూ తినీ తాగడమేనా, మా లేడీస్ కి మాత్రం పార్టీలు వుండొద్దా అలా అలా. ఇలా అయితే మా మూడవ సమావేశానికి మేము వెళ్లకుండా ఈ ఆడాళ్ళు ఎక్కడి మగాళ్ళని అక్కడికక్కడే కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెట్టేట్టుగా వున్నారు. అందుకే అందరం మగవాళ్లం కలిసి వారి ఆత్మలు అతిగా ఆక్రోశించకుండా శాంతి చేయిద్దాం అని నిర్ణయించాం.

ఓ రోజు ఎన్నుకొని పండగ చేసుకోండని చెప్పాం. పిల్లల్ని మేము చూసుకునేందుకు సిద్దం అయ్యాం. వాళ్ళలో కొంతమంది కలిసి బాగానే ప్లాన్ వేసారు. ఉదయమే బయల్దేరి ఓ రెస్టారెంటుకి వెళ్ళి భుజించి అటునుండి ఓ సినిమాకి వెళ్లి వస్తారుట. అయితే తేదీలు ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదిరి చావడం లేదు.  హ హ. ఆడాళ్లు అనిపించుకున్నారు కాదూ. అదే మేం మగాళ్లం అయితేనా ఓ డేట్ డిసైడ్ చేసేస్తాం అంతే - ఆ రోజున వీలయిన వాళ్ళు వస్తారు - వీలు కాని వారికి బెటర్ లక్ నెక్ష్ట్ టైం.  ఒకే రోజు అందరికీ కుదరాలంటే కష్టం. ఏ తేదీ అన్నది కుదరడానికే అంత కష్టం అవుతోంది ఇంకా ఏ రెస్టారెంటుకి వెళ్ళాలీ, ఏ సినిమాకి వెళ్ళాలీ అన్నవి ఎప్పుడు తెగాలీ. ప్చ్.  అది జరిగేపనిలా లేదు. అయితే ఏ రెస్టారెంటుకి వెళ్ళేదీ, ఏ సినిమాకి వెళ్ళేదీ నిర్ణయించేస్తే గనుక మాకు చెప్పమన్నాం. చెప్పరంఠా! ఓ... వారి వెనకేబడి వస్తామని వారి అనుమానం. ఛ. అవి తెలిస్తే వారు వెళ్ళిన చోట్లకి కాకుండా వేరే చోటులకి వెళ్ళాలనేది మా ప్లాన్. ఆ ఒక్కరోజయినా ప్రశాంతంగా వుండకుండా వాళ్ళనెకాల ఎందుకు వెళతాం చెప్పండి? క్కిక్కికి.

ఇహపోతే జెంట్స్ పార్టీలు జెంట్సుకి బాగా నచ్చేస్తున్నాయి. ఇంకా గొప్పగా జరగకపోయినా సంతృప్తిగా జరుగుతున్నాయి. వాటిని అభివృద్ధి చెయ్యడానికి పలువురు కొన్ని సలహాలు ఇచ్చారు. అందులో కొన్ని:

1. మందు వంచడానికి, కక్కేలా త్రాగించడానికి ఒక గజతాగుబోతుని నియమిస్తాం. ఎవరి మందు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే వంచుకోవడం వల్ల అందరూ మితంగా తాగుతున్నారు. అందువల్ల 'ఆల్కహాల్ తాగని' కొద్దిమందికి కాలక్షేపం కావట్లేదని గగ్గోలు పెడుతున్నారు. సిగ్గు లేకుండా తాగి అదో ఇదో వాగితేనే కదా అందరికీ కాలక్షేపం. నదురూ బెదురూ లేకుండా మాట్లాడుకోవాలనే కదా పిల్లలనీ, పెళ్ళాలనీ వదిలి ఈ పార్టీలకు వచ్చేదీ? ఎక్కువ తాగేసి కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్ళకుండా అక్కడే పడుకొనే ఏర్పాట్లూ వుంటాయి లెండి.

2. పలు విషయాలపై చర్చలు నడుస్తున్నాయి కానీ వాదోపవాదాలు జరగట్లా. అలా అయితే ఫన్ ఏముంటుందీ. అందుకే ఇకముందు మంటలు రాజేసే కుట్రలు వున్నాయి. మంట మరీ ఎక్కువయితే చల్లారుస్తాం లెద్దురూ.

మగ పార్టీలు రంజుగా జరగడానికి ఇంకా ఏమయినా సూచనలు, సలహాలు వుంటే ఇద్దురూ. అలా అని ఆ టైప్ సలహాలు వద్దు సుమా.

7 comments:

 1. మేమైతే మాంఛి కసక్కు సినిమా కనీసం ఒక్కటయినా చూసేది. అప్పుడొస్తాయి డిస్కషన్లు ఆటోమేటిక్ గా ....
  మీ టపా చూడగానే మళ్లీ మేము కూడా మా మగ పార్టీలు మొదలెట్టాలనిపిస్తోంది. ఆడవాళ్ల నస మాక్కూడా డిటో డిటో. :(

  ReplyDelete
 2. @ సిద్ధార్ధ్
  మా వాళ్లంతా మర్యాదాపురుషోత్తమ్రాంలు లెండి (అనగా మర్యాదా పురుష ఉత్తమ రాముడు లు) - ఒఖ్ఖరూ బయటపడరూ. (- వాళ్ళలో చాలామందికి నేను కూడా అలాగే కనిపిస్తాలెండి). అందుకే తాగి కూడా బుద్ధిగా మాట్లాడుతారు. ఐస్ బ్రేక్ అవట్లా. అందుకే అన్నీ చప్పచప్పని ముచ్చట్లే నడుస్తున్నయ్. ఓ రోజు అడల్ట్ థీం పార్టీ పెట్టి చూస్తా. అప్పుడేసుకుంటాం మేమూ మాంఛి మసాలా సిన్మాలూ. అందుకు పెద్దలనే ఆహ్వానిస్తా. అంటే పెద్ద వయస్సుండగానే సరిపోదు - పెద్ద మనస్సుండాలి కదా.

  ReplyDelete
 3. మిమ్మల్ని చూసి జెలసీ వచ్చేస్తోంది...కడుపు మంట కూడా..లాభం లేదు కొంచెం మారాలి...ప్చ్...

  ReplyDelete
 4. guruvu garu..Toast to our beloved brothers successful sunthi .. sunthi party :) .

  ReplyDelete
 5. Hey bro ,, whats the silence again ? Hope all is well.. don't sink into depression again..

  ReplyDelete
 6. @ kvsv
  ఎవరు మారాలి? మీరా, నేనా? అర్ధం కాలా :)

  @ అజ్ఞాత
  :)

  @ అజ్ఞాత
  వెకేషనుకి వెళ్ళాం - అందుకే ఈ విరామం. మీ శ్రద్ధకి సంతోషంగా వుంది.

  ReplyDelete
 7. మేమే మారాలి..సారూ..కానీ గ్లాస్ పట్టుకుంటే వీపు విమానం మోత మోగిపోద్ది ఇంట్లో...అవునండీ గృహ హింస చట్టం మన మగాళ్ళు కూడా ఉపయోగించుకో వచ్చా??

  ReplyDelete