Trump Taj Mahal

My dad was at Trump Taj Mahal. -Sisira

జెంట్స్ పార్టీస్ - జెలసీ లేడీస్!

గతవారం మా రెండవ మగ పార్టీ దిగ్విజయంగా జరిగింది. గమనిక - అది మగవారి పార్టీ కానీ మ'గే'వారి పార్టీ కాదు. అపోహలు వద్దు. ఓక్కే. అయితే అప్పుడే ఓ రెండు జెంట్స్ మీటింగ్స్ అయ్యాయో లేదో ఆడలేడీస్ నుండి రుసరుసలు, మూతి విరుపులూ మొదలయ్యాయ్. ఏం పనిలేదా, ఎప్పుడూ తినీ తాగడమేనా, మా లేడీస్ కి మాత్రం పార్టీలు వుండొద్దా అలా అలా. ఇలా అయితే మా మూడవ సమావేశానికి మేము వెళ్లకుండా ఈ ఆడాళ్ళు ఎక్కడి మగాళ్ళని అక్కడికక్కడే కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెట్టేట్టుగా వున్నారు. అందుకే అందరం మగవాళ్లం కలిసి వారి ఆత్మలు అతిగా ఆక్రోశించకుండా శాంతి చేయిద్దాం అని నిర్ణయించాం.

ఓ రోజు ఎన్నుకొని పండగ చేసుకోండని చెప్పాం. పిల్లల్ని మేము చూసుకునేందుకు సిద్దం అయ్యాం. వాళ్ళలో కొంతమంది కలిసి బాగానే ప్లాన్ వేసారు. ఉదయమే బయల్దేరి ఓ రెస్టారెంటుకి వెళ్ళి భుజించి అటునుండి ఓ సినిమాకి వెళ్లి వస్తారుట. అయితే తేదీలు ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదిరి చావడం లేదు.  హ హ. ఆడాళ్లు అనిపించుకున్నారు కాదూ. అదే మేం మగాళ్లం అయితేనా ఓ డేట్ డిసైడ్ చేసేస్తాం అంతే - ఆ రోజున వీలయిన వాళ్ళు వస్తారు - వీలు కాని వారికి బెటర్ లక్ నెక్ష్ట్ టైం.  ఒకే రోజు అందరికీ కుదరాలంటే కష్టం. ఏ తేదీ అన్నది కుదరడానికే అంత కష్టం అవుతోంది ఇంకా ఏ రెస్టారెంటుకి వెళ్ళాలీ, ఏ సినిమాకి వెళ్ళాలీ అన్నవి ఎప్పుడు తెగాలీ. ప్చ్.  అది జరిగేపనిలా లేదు. అయితే ఏ రెస్టారెంటుకి వెళ్ళేదీ, ఏ సినిమాకి వెళ్ళేదీ నిర్ణయించేస్తే గనుక మాకు చెప్పమన్నాం. చెప్పరంఠా! ఓ... వారి వెనకేబడి వస్తామని వారి అనుమానం. ఛ. అవి తెలిస్తే వారు వెళ్ళిన చోట్లకి కాకుండా వేరే చోటులకి వెళ్ళాలనేది మా ప్లాన్. ఆ ఒక్కరోజయినా ప్రశాంతంగా వుండకుండా వాళ్ళనెకాల ఎందుకు వెళతాం చెప్పండి? క్కిక్కికి.

ఇహపోతే జెంట్స్ పార్టీలు జెంట్సుకి బాగా నచ్చేస్తున్నాయి. ఇంకా గొప్పగా జరగకపోయినా సంతృప్తిగా జరుగుతున్నాయి. వాటిని అభివృద్ధి చెయ్యడానికి పలువురు కొన్ని సలహాలు ఇచ్చారు. అందులో కొన్ని:

1. మందు వంచడానికి, కక్కేలా త్రాగించడానికి ఒక గజతాగుబోతుని నియమిస్తాం. ఎవరి మందు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే వంచుకోవడం వల్ల అందరూ మితంగా తాగుతున్నారు. అందువల్ల 'ఆల్కహాల్ తాగని' కొద్దిమందికి కాలక్షేపం కావట్లేదని గగ్గోలు పెడుతున్నారు. సిగ్గు లేకుండా తాగి అదో ఇదో వాగితేనే కదా అందరికీ కాలక్షేపం. నదురూ బెదురూ లేకుండా మాట్లాడుకోవాలనే కదా పిల్లలనీ, పెళ్ళాలనీ వదిలి ఈ పార్టీలకు వచ్చేదీ? ఎక్కువ తాగేసి కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్ళకుండా అక్కడే పడుకొనే ఏర్పాట్లూ వుంటాయి లెండి.

2. పలు విషయాలపై చర్చలు నడుస్తున్నాయి కానీ వాదోపవాదాలు జరగట్లా. అలా అయితే ఫన్ ఏముంటుందీ. అందుకే ఇకముందు మంటలు రాజేసే కుట్రలు వున్నాయి. మంట మరీ ఎక్కువయితే చల్లారుస్తాం లెద్దురూ.

మగ పార్టీలు రంజుగా జరగడానికి ఇంకా ఏమయినా సూచనలు, సలహాలు వుంటే ఇద్దురూ. అలా అని ఆ టైప్ సలహాలు వద్దు సుమా.

సినిమా: రాజు గారి ఉపన్యాసం

 
తీరిగ్గా వున్నా కదా ఎప్పటి నుండో చూద్దామనుకుంటున్న ఈ సినిమా చూస్తున్నా. ఈ సినిమా నచ్చడానికి ఎంతో సేపు పట్టలేదు - కొన్ని సెకన్లు చూసా అంతే. వెంటనే ఎంత గొప్పగా నచ్చిందో చెప్పడానికి ఈ పోస్ట్ వేస్తున్నా.  ఓ నత్తి రాజు ఎలా, ఎంత కష్టపడి నత్తిని పోగొట్టుకుంటాడనేది కథాంశం. నిజజీవితం మీద ఆధారపైన సినిమా. ఉత్తమ నటుడు, దర్శకుడూ, స్క్రీన్ ప్లే లకు గాన్ను ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసెయ్యండి. మంచి కథలు, సినిమాలూ నచ్చేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చాలి మరి. ఈ సినిమా చూసిన వారు మీ అభిప్రాయాలను ఇక్కడ పంచుకోండేం.
 
వివరాలకు:
 
After the death of his father King George V (Michael Gambon) and the scandalous abdication of King Edward VIII (Guy Pearce), Bertie (Colin Firth) who has suffered from a debilitating speech impediment all his life, is suddenly crowned King George VI of England. With his country on the brink of war and in desperate need of a leader, his wife, Elizabeth (Helena Bonham Carter), the future Queen Mother, arranges for her husband to see an eccentric speech therapist, Lionel Logue (Geoffrey Rush). After a rough start, the two delve into an unorthodox course of treatment and eventually form an unbreakable bond. With the support of Logue, his family, his government and Winston Churchill (Timothy Spall), the King will overcome his stammer and deliver a radio-address that inspires his people and unites them in battle.

Based on the true story of King George VI, THE KING'S SPEECH follows the Royal Monarch's quest to find his voice.
 
ఇప్పటివరకూ ఈ సినిమా కొన్ని సెకన్లే చూసాకదా. ఇహ మిగతా సినిమా మొదలెడతా. అంతరాయం కలిగించకండేం. అలా అని వ్యాఖ్యలు ఇవ్వొద్దని అర్ధం కాదు :)