ఆరేళ్ళ పాప చిత్రమయిన సమస్య - మీరెటు వైపు?

కొలరాడోలోని కాయ్ మాథిస్ అనే పాపకి ఓ చిత్రమయిన సమస్య ఎదురయ్యింది. ఆ పాఠశాల వారు అమ్మాయిల టాయిలెట్ గదిని ఉపయోగించుకోనివ్వట్లేదంట. ఎందుకంటే ఆ అమ్మాయి ట్రాన్స్ జెండర్. పుట్టడం అబ్బాయి లక్షణాలతోనే పుట్టింది కానీ తాను ఐడెంటిఫై చేసుకున్నది మాత్రం అమ్మాయిగానే. అంత చిన్న అమ్మాయికి అప్పటికే ఐడెంటిఫై చేసుకోవడం వస్తుందేంటీ - తల్లితండ్రుల అతి కాకపోతేనూ అని కొందరు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ క్రింది వార్తాంశం చదివి మీరు ఆ అమ్మాయి వైపో, పాఠశాల వైపో చెప్పండి.  ఐడెంటిఫై చేసుకోవడానికి వయస్సుతో పనేముంది అని నాకు అనిపిస్తోందీ - మరీ నెలల పాప ఏమీ కాదు కదా! మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం కొంతమంది పిల్లలకు మూడేళ్ళ వయస్సుకే వారి లైంగిక అస్థిత్వం తెలుస్తుంటుందిట. వారు ఆడుకొనే ఆటలను బట్టి, ఆసక్తి చూపించే వేషధారణ, దుస్తులు వగైరాలను బట్టి కూడా ఆ విషయం గుర్తించొచ్చు అనుకుంటా. శారీరక అవయవాలను బట్టి మాత్రమే జెండర్ ఐడెంటీని నిర్ధారించకూడదంట.6 comments:

 1. I read this story on yahoo news yesterday. I think there should be at least one unisex bathroom at offices and schools too.

  Siddharth

  ReplyDelete
 2. @ సిద్ధార్ధ్
  యునిసెక్స్ బాత్రూం అంటూ ప్రత్యేకంగా ఆ పాఠశాలలో లేదు కానీ టీచర్ల గది లోనిదీ, నర్స్ గది లోనిదీ అందరూ వాడతారు కాబట్టి అది వాడుకొమ్మన్నారంట. అయితే అవి కాస్తంత దూరం ట. అయినా బాత్రూములల్లో లింగ వివక్షత దూరం కావాల్సిన సమయం వచ్చేసినట్లే వుంది. ఇంకా ఈ కాలంలో కూడా మగ, ఆడ బాత్రూములేంటండీ బాబూ. అందరికీ ఒహటే (Unisex) పెట్టెయ్యాలి!

  బాత్రూం లింగ వివక్షత డవున్ డవున్!

  ReplyDelete
 3. ఈ పాప సంగతి తెలియట్లేదు కాని.. యూనిసెక్స్ రెస్ట్‌రూం అనేది మాత్రం అద్భుతమైన అయిడియా..

  ReplyDelete
 4. @ భయంకర్
  నిజానికి అంత అద్భుతంగా ఏమీ వుండదనుకుంటాను. ఒకటి రెండు సార్లు అలాంటి వాటికి వెళ్లాను. ఎక్కడో గుర్తుకులేదు. ఇప్పటికే పక్క గదుల్లోని తోటి మగ మహారాజుల భయంకరమయిన శబ్దాలూ, వాసనలూ భరించలేక చెవులు మూసుకోవాలో లేక ముక్కు మూసుకోవాలో అర్ధం కాదు. ఇక వాళ్లవి కూడా భరించాలంటే నావల్ల కాదు - యాక్.

  ReplyDelete
 5. Then you should visit gym attached toilets. Free for all.

  ReplyDelete
 6. @ చాతకం
  టాయిలెట్స్ పక్కనే జిం? మీ వ్యాఖ్య నాకు అర్ధం కాలేదు. ద్వందార్ధంలో వాడివుంటారు.

  ReplyDelete