దయ్యాలంటే భయం ఎందుకు డాడీ!

మా చిన్నదానికి దయ్యాల భూతాల సినిమాలంటే చాలా ఇష్టం. పోనీ అది ఒక్కతే చూస్తుందా, అబ్బే గజగజ  ఒణుకుతూ నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని కావలించుకుంటుంది. మరె దయ్యాలంటే నాక్కూడా భయం కదా. నేనూ గజగజా వణుకుతూ వుంటాను. ఇద్దరం అలా వణికేస్తూ ఆ సినిమాలు చూసేస్తుంటాం. సినిమా అంతా చూసేకా 'నిజ్జంగా దయ్యాలున్నాయా డాడీ' అని అడుగుతూ వుంటుంది. లేవు అని చెబుతుంటాను. 'మరి అవి లేనప్పుడు మరి అవంటే నీకు ఎందుకంత భయం' అని అడుగుతుంది. "దయ్యాలు లేవని నాకు తెలుసు కానీ వాటికి తెలియదు కదా" అని సమాధానం ఇస్తుంటాను.

పైన నేను కూడా వణుకుతూ చూస్తున్నట్లు వ్రాసా కదా. సరదాగా అలా వణికినట్లు నటిస్తూవుంటా అంతే. నిజం అనుకునేరు. ఏం నమ్మట్లేదా? 

అప్పట్లో ఇండియాలో 'ఓ స్త్రీ రేపు రా' అని కొంతమంది తమ గోడల మీద వ్రాస్తున్నారని విని మా గోడ మీద 'ఓ స్త్రీ ఇవాళే రా!' అని వ్రాసేవాడిని. వచ్చేదేదో కామినీ పిశాచం అయివుండాలని ఆశించేవాడిని కానీ ఎవరూ రాలా. ప్చ్. 

నా చిన్నప్పుడు మా ఇంట్లో కిరాయికి వుండే మాస్టారు మాకందరికీ నిజంగా జరిగిన సంఘటణలు అంటూ చాలా చాలా దయ్యాల కథలు చెప్పేవాడు.  మా నాన్నేమో ఆ కథలన్నీ నమ్మవద్దని నాకు చెప్పేవాడు. ఎవరి మాటలు నమ్మేదీ? చివరికి ఎందుకయినా మంచిదని ఇద్దర్నీ కాదని దయ్యాల్నే నమ్మడం మొదలెట్టా. అర్ధరాత్రి రెంటికి వస్తే చచ్చే చావొచ్చేది.

సి బి రావు గారు వ్రాసిన ఆమె ఎవరు? పోస్టు చూసాక ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. 

అవునూ ఈ పోస్ట్ మీరు ఒక్కరే చదువుతున్నారా లేక పైన ఫోటోలోలాగా అదృశ్యంగా ఇంకెవరయినా మీ పక్కనే వుండి ఈ టపా చదుతున్నారా? కామెంటెయ్యమని తనకి చెప్పండి మరి.

11 comments:

 1. వున్నాయో లేవో మీరే కనుక్కోని, ఎక్కడ కొనుక్కోవచ్చో నాకు చెప్పండి. నాకు ఎప్పటినుంచో రెండింటిని పెంచుకోవాలని సరదాగా ఉంది. రెండు బుజ్జిబుజ్జి దయ్యాలని ఉదయాన్నే వాకింగ్‌కి తీసుకెళితే ఆ దర్జాయే వేరుగా ఉంటుంది.

  ReplyDelete
 2. @ కొత్తపాళీ
  మీతో ఏదో అదృశ్యశక్తి ఈ వ్యాఖ్య వేయించినట్లుందే :))

  @ మినర్వా
  దయ్యాలంటే మీకు అంత అలుసయ్ పోయిందా. ఆయ్. వాటికీ మనస్సుంటుంది. వాటికీ వ్యాయామం కావాలి (అందుకే వాక్కు తీసుకెళతా అని అనకండి), వాటికీ సంఘాలుంటయ్ - ముఖ్యంగా ఆడ దయ్యాలకు. ఒక్క దయ్యమంటే అర్ధం చేసుకోవచ్చు కానీ మరీ రెండు దయ్యాలను వెంటేసుకొని తిరగాలనే మీ ఆలోచన ఎన్ని దయ్యాల మనోభావాలను గాయపరచివుంటుందో మీకు తెలుసా?

  ReplyDelete
 3. నిజంగా కామినీ పిశాచాలు ఉండి..ఓ స్త్రీ ఇవ్వాళే రా నేను అంటే,ఆమె వస్తే ఎంత బాగుంటుంది గురువుగారు..బోర్ కొట్టకుండా వాటికి మాయలు కూడ వచ్చు కదా ఎంచక్కా..

  ReplyDelete
 4. @ కాయ
  ఆడవారి గురించి అతిగా వాగితే ఏమవుతుందో మనకు తెలుసు కానీ ఆడ దయ్యాల గురించి అతిగా వాగితే కూడా సరికొత్త నిర్భయ చట్టం వర్తిస్తుందో లేదో మనకు తెలియదు కాబట్టి కాస్త క్లారిటీ వచ్చేదాకా నిగ్రహం పాటిద్దామేం.

  ReplyDelete
 5. హహ్హహ్హ.. అయినా దెయ్యాలు ఫన్ ఓరియెంటెడ్ అని చిన్నప్పుడు సినిమాలల్ల చూసిన మరి. మన దేశం లెక్క వచ్చిన సమస్యల కల్లా అవి చట్టాలు చేసుకుంట ఉండకపోవచ్చు.. అవ్వేమైనా ప్రభుత్వ ?

  ReplyDelete
 6. మీ పోస్ట్ చూసిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది . నేను , నా స్నేహితుడు దెయ్యాలు ఉన్నాయా, లేవా అని వాదించు కుంట్టున్నాం. నా ఫ్రెండ్ దెయ్యాలు వున్నై అని నేను లేవు అని. అందుకు నా ఫ్రెండ్ ఒక దెయ్యం పట్టిన ఒక ఆమె గురించి చెప్పి ఆమె దెయ్యం పట్టినప్పుడు తమిళ్ లో మాట్లాడుతుంది అని చెప్పాడు.

  నా ఫ్రెండ్ ని అడిగాను ఆమె చదువుకున్నవాళ్ళ లేదా అని, దానికి వాడు ఆమె చదువుకోలేదు అని చెప్పాడు. ఆమె తమిళ్ మాట్లాడేటప్పుడు ఆమె మాట్లాడేది కరెక్టా కాదా అని చెప్పడానికి ఎవరైనా తమిళ్ మాట్లాడే వాళ్ళు వున్నారా అని అడిగాను , దానికి వాడు లేదు అన్నాడు.

  అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, నేను ఏ రోజు చదువుకున్న వాళ్ళకి దెయ్యం పట్టినట్లు చూడలేదు అందుకని వాడికి ఒక గొప్ప సలహా ఇచ్చాను , త్వరగా ఆమెను చదువు కోమను ఆమెకు కుడా దెయ్యం పట్టదు అని ....:) :) :)

  ReplyDelete
 7. @ కాయ
  మీకు పిశాచాల గురించి సరిగా తెలియనట్లుంది! వాటి ప్రభుత్వం, నాగరికతా వగైరాల గురించి KSY పతంజలి గారు బాహ్గా పరిశోధించి ఓ సీరియల్ వ్రాసేరు. పేరు గుర్తుకులేదు. తెలిసినవారు చెప్పండి. కామినీ పిశాచాలు పీక్కు తింటయ్ జాగ్రత్త! ఏం పీక్కుతింటయ్ అని మాత్రం నన్నడక్కండి.

  @ టైం పాస్ గురు
  మంచి లాజిక్కే కానీ అక్కడున్న ఎవరికీ తమిళ్ తెలియకపోతే ఆ దయ్యం తమిళంలోనే మాట్లాడుతోందని ఎలా తెలుసబ్బా? ఆమె తెలుగు తప్ప ఏం మాట్లాడినా తమిళ్ అనుకున్నారా ఏంటీ? అది పిశాచ భాష అని గుర్తించండి. వాటికీ భాష వుంటుంది - వ్యాకరణం కూడా వుంటుంది. అవి కూడా నవల్లు, బ్లాగులూ వ్రాస్తాయి - నాలాగే.

  ReplyDelete
 8. @ కాయ
  KSY పతంజలి గారి నవల పేరు 'దయ్యం ఆత్మ కథ'. అది చదవండి మీకు దయ్యాలు బాగా వంటబడుతాయి.

  ReplyDelete
 9. దెయ్యం ఆత్మ కథా..వినడానికే ఇంత థ్రిల్లింగు గా ఉంది.. తొందరగా వెతికి చదివెసేస్తా అయితే

  ReplyDelete
 10. కామినీ,శంకినీ లతొ పెట్టుకోవద్దని, మోహినీలతో మాత్రం పెట్టుకోవచ్చట కదా గురువుగారు.. ఆ మోహినీ జాతి దెయ్యాలు ఎక్కడ ఉంటాయో మరి.. ఈ బాచిలర్ బతుకు కంటే .... :( :(

  ReplyDelete