రేపటి రోజు నాకు కాస్తంత ఆసక్తికరం

ఎందుకంటే రేపు ఉదయం 8 గంటలకు మా ఫామిలీ డాక్టరుని కలిసి నా పరిస్థితి చర్చించబోతున్నాను.  నా ప్రస్థుత పరిస్థితి బాగానే వుంది - చాలా వరకు కుదుట పడ్డాను కానీ నా సమస్యకి మూల కారణం పరిశోధిస్తున్నాం కదా. క్రితం సారి కలిసినప్పుడు నాకు హైపోథైరాయిడిజం లేదన్నాడు కానీ దాని గురించి మరింత నేను తెలుసుకున్నాక, నా ల్యాబ్ రిపోర్టులు వివరంగా పరిశీలించాక నాకు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం  వుందనే నేను అనుకుంటున్నాను. డిప్రెషన్  స్ఫుటమయిన (ఓవెర్ట్) హైపోథైరాయిడిజం వున్నవారికంటే సబ్ క్లినికల్ గా వున్నవారికే ఎక్కువగా వచ్చే అవకాశం వుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే మా వైద్యుడు నేను చెప్పిన దానికి కన్విన్స్ అవుతాడా లేదా అన్నది ఆసక్తికరం. చూడాలి మరి. ఆసక్తి వున్నవారు వివరాల కోసం క్రింది లింక్ చూడండి:

ఇహపోతే నా పిట్యూటరీ గ్రంధికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టూ వస్తుంది. ఆ లెవల్స్ ఎలా వుంటాయో చూడాలి. ట్యూమర్ వుండవచ్చునని ఏమయినా తెలుస్తుందా అనేది కూడా ఆసక్తికరం. అది వుండొచ్చు అని అనుమానంగా వుంటే MRI చేయించుకోవాలి. ప్రతి అయిదుగురిలో ఒక్కరికి ఆ ట్యూమర్లు వుండొచ్చునట కానీ అందులో దుష్పలితాలు చాలా తక్కువ మందికి దారితీస్తాయిట. అయితే ఎక్కువమంది తమ ఆరోగ్య సమస్యలకి కారణంగా పిట్యూటరీని పరిగణించకపోవడం వల్ల కూడా ఆ గణాంకాలు తక్కువగా వెల్లడిస్తున్నాయని నా అభిప్రాయం. మందులు వాడితే చాలామందికి ట్యూమర్లు తక్కువ అవుతాయి. కొద్దిమందికి సర్జెరీ, రేడియేషన్లు అవసరం అవుతాయి. నాకు వున్న లక్షణాలను బట్టి ఈ సమస్య నాకు వుంటే వుండవచ్చు అని నా అనుమానం. హైపో పిట్యూటరిజం వల్ల కూడా హైపోథైరాయిడిజం వస్తుండవచ్చు. అందుకే ఆ పరీక్ష కూడా చేయించమని డాక్టరుని అడిగాను. చూడాలి.

పై రెండింటిలో ఏదో ఒకటి తెలిస్తే లక్షణాలను కాకుండా మూల కారణాన్ని నివారించడానికి ప్రయత్నించొచ్చు. ఆ రెండూ కూడా కాకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. వేరే కారణాలు ఏమయి వుండవచ్చు అనేది మళ్ళీ పరిశోధించాలి.

11 comments:

 1. ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా తరువాత టపా రాయాలని కోరుకుంటూ

  ReplyDelete
 2. @ ది ట్రీ
  సమస్యలు లేకుంటే బోరింగుగా వుంటుందండీ...సమస్యలు పరిష్కరించుకుంటూ వెళుతుంటేనే సరదాగా వుంటుంది :) కష్టాలు లేకుంటే ఆనందం ఆవిరి అవుతుంది - ఎందుకంటే ఆనందం యొక్క విలువ అర్ధం కాక. కదా.

  ReplyDelete
 3. Canada lo doctor consultation fee ledanegaa meekinni doubts vastunnay

  ReplyDelete
 4. hi brother , konchem variety ga ayurvedam try cheddama..
  here is the link

  (you got to spend 5 min on this and real stuff starts after 2 min)

  http://andarikiayurvedam.in/mainplayer.jsp?play=thairaoid%20samasya

  His explanation is generic,comic but it works,,

  fascinating thing is there are few testimonials where people said they got complete cure for blood cancers.. real :)

  All the best
  all is well ..

  ReplyDelete
 5. @ నారాయణస్వామి
  ధన్యవాదాలండీ.

  @ అజ్ఞాత
  ఇప్పుడు నేను కెనడాలో వుండటం లేదు, యు ఎస్ లో వుంటున్నా. ప్రతి డాక్టర్ విజిట్టుకీ $30 అవుతుంది - ఆరోగ్య భీమా వున్నా కూడానూ. నేను కంప్యూటర్ ప్రొగ్రామర్ని. రిజల్ట్ సరిగా రాకపోతే ప్రొగ్రాం కోడ్ మార్చి మార్చి పరీక్షిస్తుంటాం అంతే కానీ ఏదో ఒక రిజల్టులే అని సరిపెట్టుకోలేం. అలాగే జీవితం కూడా అంతే. ఆరోగ్యమూ అంతే. సరిగా నడవకపోతే ఏం ఫాల్ట్ వుందో తెలుసుకుంటూనే వుండాలి. నేను చాలామందికి లాగా లక్షణాలకు చికిత్స పొందుతూ రాజీ పడను. సమస్య అంతు చూసేదాకా కృషి చేస్తూనే వుంటాను. నేను తెలుసుకుంటున్నది ఇతరులకు తెలియజేస్తుంటాను.

  @ అజ్ఞాత
  మీరు సూచించిన వీడియో ఈ వారాంతం చూసి చెబుతాను.

  ReplyDelete
 6. cool bro,, your attitude towards finding the root cause of disease is impressive..but human body is extremely complex and there are many factors for each condition(disease) so you need to find out root causes rather than root cause :) as you already said they might be psychological or physical.. sometimes it is real thrill to find the root cause and some times just to know that we are cured is real good.. any way all the best ,, there is an excellent TV Series which surely interests you,(world's most popular TV show ) http://www.imdb.com/title/tt0412142/ .. but alas it takes 40 min each episode,, but you will enjoy it .. :)

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  సింప్టంస్ కి చికిత్స తీసుకుంటూ ఆల్ ఈజ్ వెల్ అని సంతోషపడుతూ వుంటే అవతల అసలు కారణాలు ఎంచక్కా ముదిరిపోతూవుంటాయండీ బాబూ. అందుకే ఈ నా జాగ్రత్త.

  ఓ http://www.imdb.com/title/tt0412142 అంటే House M.D. టివి సిరీస్ గురించా మీరు చెబుతుంటా. ఆ సీరియల్ నాకూ, మా ఇంట్లో వారికీ నచ్చుతుంది. రెగ్యులరుగా కాదు కానీ ఛానల్స్ ఛేంజ్ చేస్తున్నప్పుడు కనపడినప్పుడల్లా చూస్తుంటాం. వైద్య విషయాలపై ఆసక్తికరంగా వుంటుంది ఆ ధారావాహిక. సంక్లిష్టమయిన ఆరోగ్య సమస్యలను డాక్టర్ హవుజ్ విభిన్న మార్గాలలో పరిష్కరిస్తూవుంటాడు.

  ReplyDelete
 8. కొంతమంది ఉద్యోగ వ్యాపారాలు బోర్ కొట్టి, ఎదో ఒక కొత్త విషయం పై దృష్టి పెట్టి, లోతు గా రీసెర్చ్ చేస్తూ ఏదో Phd చేస్తున్నట్లు వ్యవహరిస్తుంటారు. అది మంచి విషయమేననుకోండి. నేనూ షేర్ మార్కెట్ లో కొంత డబ్బులు దొబ్బెట్టినా, టీవీ లో బిజినెస్ చానెల్స్ లో కొంతమంది టెక్నికల్ అనలిస్ట్ లు మార్కెట్ ను కరెక్ట్ గా గెస్ చేయడం చూసిన నేను,నేను కూడా షేర్ మార్కెట్ పై రీసెర్చ్ చేసి మార్కెట్ ను అనలైజ్ చేసే క్రమం లో కొంత పురోగతి సాధిస్తున్నా.

  ReplyDelete
 9. ఇప్పుడే డాక్టర్ దగ్గరి నుండి వస్తున్నాను. నా పిట్యూటరీ గ్రంధితో సమస్య లేదు. నేను అనుకున్నట్లుగానే నాకు (సబ్ క్లినికల్) హైపో థైరాయిడిజం వుందని మా డాక్టర్ అంగీకరించారు. క్రితం సారి ఆ నా ల్యాబ్ రిజల్టులను సరిగా ఇంటర్ప్రెట్ చెయ్యలేకపోయానని తెలిపారు. నా సమస్యల గురించి చక్కగా తెలుసుకుంటున్నందుకు నన్ను బాగా అభినందించారు. తన పొరపాటుని ఎత్తిచూపినందుకు సంతోషించారు. స్మార్ట్ పేషెంట్ అని కితాబు ఇచ్చారు. థైరాయిడ్ మెడిసిన్ వ్రాసిచ్చారు. ఆ మందు తెచ్చుకున్నాను.

  అయితే ఇల్లు అలకగానే పండగ కాదు అని నాకు తెలుసు. మెడిసిన్ వాడుతున్నా నా బాడీ సెల్స్ గనుక ఆ మందును సరిగ్గా స్వీకరించలేకపోతే సమస్యే. చూద్దాం.

  ReplyDelete
 10. @ మిర్చి
  మీరు మీకు నచ్చిన రంగంలో అన్నీ తెలుసుకుంటూ పురోగతి సాధిస్తున్నందుకు సంతోషం.

  వైద్యం అనే కాదు ఏ రంగంలో అయినా నిపుణులు అనుకున్నవారిని పూర్తిగా నమ్మలేని పరిస్థితి వుంది. కొన్ని సార్లు లాయర్లూ, టాక్స్ ఎకౌటెంట్స్ వారి నిర్వాకాలు స్వయంగా అనుభవించాను. అందువల్ల కొన్ని వేల డాలర్లు అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సివచ్చింది. కొన్ని సార్లు నేను చెబితే వారు డాక్యుమెంట్లు, రిటర్నులూ సరిచేసేవారు. అలాగే అటార్నీలు ఇమ్మిగ్రేషన్, వర్క్ వీసా లాంటి విషయాల్లొ పొరపాటు చేసేవారు. ఆ తరవాత నుండి వీలయినంతవరకు నేనే స్వయంగా తయారుచేసుకోవడమో లేక సరి చూడటమో చేస్తున్నాను. అందరూ అలా అని కాదుగానీ కొందరయితే అలా వుంటారు. మనకు ఆ రంగంలో ఏమీ తెలియదనే కదా ఆయా నిపుణుల దగ్గరికి మనం వెళుతుంటాం కానీ వారి నిర్వాకాలు చూస్తే ఎవర్ని పూర్తిగా నమ్మాలో అర్ధం కాదు. మనకు బొత్తిగా తెలియని విషయాల్లో ఎక్స్‌పర్టులు అనుకున్న వారిని గుడ్డిగా నమ్మెయ్యక తప్పదు కదా. ఎన్ని అని జాగ్రత్త పడతాం, ఎంత అని జాగ్రత్త పడతాం?

  ReplyDelete