మార్స్ మెన్లూ - వీనస్ వుమెన్లూ

టైటిల్ చూస్తేనే కొంత మందికి అయినా అర్ధం అయ్యుండొచ్చు నేను దేని గురించి వ్రాస్తున్నానో. అంత ప్రఖ్యాత పుస్తకం ఇది మరి:

Men Are from Mars, Women Are from Venus

ఆ పుస్తకం నేను బయటకి తీసికెళ్ళినప్పుడల్లా ఒక్క తెల్లోడయినా తొంగి చూసి మంచి పుస్తకం, చాలా బాగా ఉపయోగపడుతుంది అని చిరునవ్వుతో చెబుతూవుంటారు. ఈ పుస్తకం గురించి తెలిసి చాలాకాలమయినా తెప్పించడానికి ఆలస్యమయ్యింది. మొదటిసారి చదివడానికి ప్రయత్నించా - ఎక్కలేదు - పక్కన పడేసా. మళ్ళీ ప్రయత్నించా - మళ్ళీ కొద్దిగా ఎక్కింది కానీ మళ్ళీ అది పడకేసింది.

అలా లాభం లేదని ఈమధ్య దాన్ని వెనక నుండి వాడటం మొదలెట్టా - అనగా వెనక ఛాప్టర్ నుండి ముందుకు వస్తున్నా - బాగానే నడుస్తోంది. అలా అని అసాంతం ఒకేసారి చదివెయ్యడం లేదు లెండి. నెమ్మదిగా కాస్త కాస్త జీర్ణం చేసుకుంటూ నడిపిస్తున్నా. ఈ సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలతో ఓ ఇబ్బంది. చదవడానికి బాగానే వుంటాయి కానీ అమలు పరచడానికే బద్దకంగా అనిపిస్తుంది. కొన్ని సార్లు పొరపాట్లు చేసేస్తున్నామని తెలిసేస్తున్నా అవలీలగా అవి చేసేస్తుంటాం. ఆ తరువాత బుర్ర గోక్కుంటాం.

ఈ పుస్తకం చదువుతూ నెమ్మదిగా కొన్ని అమల్లో పెడుతున్నా. ముఖ్యంగా మగవారి, ఆడవారి ఆలోచనా రీతుల్లోని వైరుధ్యాలను గమనిస్తున్నాను.  ఈ పుస్తకం చదివిన వారు మీ అభిప్రాయాలని నాకు చెప్పండి.

6 comments:

 1. నేను చదవలేదండి, చదివి విషయాలు చెప్పండి.
  keep reading.

  ReplyDelete
 2. its ok book.some parts of the book has been lifted and used in a good telugu movie "Pelli ayina kottalo"

  ReplyDelete
 3. Generally we hate self-help lit because we hated lectures of our elders and friends through our lives. But I liked 'How to make friends and influence people' It taught me how to 'Talk' (Not just 'Listen')!

  Happy reading.

  ReplyDelete
 4. ఈ పుస్తకం గురించి ఎప్పుదో రసారుగా.మళ్ళీ ఏంటి?!

  ReplyDelete
 5. అది సరే...మీ అభిప్రాయం చెప్పండి తివారీ గారి స్టేట్మెంట్ మీద...

  “నాకు నచ్చిన దారిలో నడిచే హక్కు నాకు ఉంది. ఇప్పటికీ నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఇతరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం సరికాదు. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. రాబోయే తరాల పురోగతికి పునాది వేయాల్సి ఉంది”
  - తీర్పు తరువాత ఎన్డీ తివారీ

  ఇంకా పునాది వేయగలడా??


  రాజకీయాల్లో??

  ReplyDelete
 6. Great ! keep reading ! I read the whole book ! I now know the theory, but implementing sometimes is tough, I try my best and win sometimes ! :-)

  ReplyDelete