CBI వారూ లంచాలు తీసుకుంటే ఓ పనైపోతుంది బాబూ

అవినీతి అనేది అంతటా వుండేదే కదా. అందులో ఆశ్చర్యం ఏముందీ? మనకు అవకాశం లేక లంచాలు అంటుకోవట్లేదు కానీ అదీ వుంటే ఎంచక్కా డబ్బులు మింగేసేవారమే కదా. చాలా ఏళ్ళ క్రితం నేను ఒక స్వచ్చంద సేవ సంస్థలో పనిచేసేవాడిని - ఏదో కాస్త దేశ సేవ చెయ్యాలని. స్వఛ్ఛంద సంస్థల్లో కూడా బోలెడంత అవినీతి వుందనీ, ఛారిటీ కోసమని వచ్చే ధనంలో చాలావరకు అవి స్వాహా చేస్తాయనీ, ఏదో పైపైన ప్రజలకి సేవ చేస్తాయని అర్ధమయ్యి ఆశ్చర్యమూ, విరక్తీ కలిగాయి. అయితే అప్పుడు నేను పనిచేసిన సంస్థ కొంతలో కొంత నయం లెండి. అందాజాగా కేవలం 20% మాత్రమే తినేసేవారని అర్ధం అవుతుండేది. మరి కేవలం 20% మాత్రమే ప్రజలకి వినియోగించకుండా కేవలం  20% మాత్రమే స్వాహా చేసేవారంటే మెచ్చదగిన విషయమే కాబట్టీ ఓ ఏడాది నేను అలా అక్కడ పనిచేస్తూ వెళ్ళాను.

జడ్జిలూ లంచాలు తీసుకుంటున్నారనీ, అక్రమంగా సంపాదిస్తున్నారని ఈమధ్య అర్ధం అవుతోంది కదా. అందులో ఆశ్చర్యం ఏముందీ? వాళ్ళూ మనుషులే కదా, వాళ్ళూ బ్రతకలి కదా. మనం వారి ప్రవర్తనను అర్ధం చేసుకోవాలి. వాళ్ళ సీట్లో మనం వుంటే తీసుకోమా ఏంటీ? మీరు మరీనూ. ఒహవేళ పొరపాట్న మనం బుద్ధిమంతులమే అయినా సరే ఇంట్లో వారు మనల్ని ఊరికే వుండనిస్తారా? లంచాలు పట్టమని పోరెట్టరూ? అవకాశం వుండీ లంచం ముట్టకపోతే మనల్ని జనాలు అసమర్ధులం అనుకోరూ?  ఈ జడ్జిల్లో చాలామంది లాయర్లుగా రకరకాల అబద్ధాలతో ప్రాక్టీసు చేసి పైకి వచ్చినవారే కదా. ఇలా జడ్జి కాగానే అలా నైతిక ప్రాతివ్రత్యం వచ్చిపడుతుందా ఏంటీ?

అందరూ లంచాలు తింటున్నారు. సరే. మరి CBI వారి సంగతేంటీ. వాళ్ళు మాత్రమే పతివ్రతలా? ఛత్, లాభం లేదు. వాళ్ళూ గడ్డి కరవాల్సిందే. అవినీతి విశ్వవ్యాప్తం అని నిరూపించాల్సిందే. అదీ ఏనాడో ఒకనాడు బయటపడుతుంది లెండీ. గొంగట్లో కూర్చొని అన్నం ఏరుకునే మనం వచ్చే వెంట్రుకల గురించి వర్రీ అవద్దు. మరింత అలవాటు పడిపోవాలంతే. అవినీతిపరుల్లోనే కాస్తంత సమర్ధత వెతుక్కోవాలంతే.

16 comments:

  1. ఇప్పుడు గాలి మరియు జగన్ ఎంత సమర్థులు అంటే ....వాళ్ళకి అడ్డం ఒకవేళ గాంధీ జి వచ్చిన తనకి కూడా లంచం ఆశ చూపి స్వతంద్రోద్యమన్ని కూడా ఆపేవారు .....

    ReplyDelete
  2. స్వచ్చంద సంస్థలు అన్ని అలాంటివే అనుకుని నేను ఏదయినా చేయాలని ఉన్నా దూరంగా ఉన్నా చాలా రోజులు. కానీ నాకు ఒక సంస్థ దొరికింది. ఒక పైసా కూడా వృథా పోకుండా పనిచేస్తున్న ఆ సంస్థ లో ఒక భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అక్కడక్కడ మంచి మిగిలే ఉంది.

    ReplyDelete
  3. @ అజ్ఞాత @ 5 జూన్ 2012 12:28 సా
    వారి యొక్క అవినీతి కథనాలు ఈనాడులో చదువుతుంటే అవి ఎంతవరకు నిజమో తెలియదు గానీ వారిద్దరూ అవినీతిని ఎంచక్కా ఆర్ట్ స్థాయిలోకి తీసుకెళ్ళారు అనిపిస్తుంది. అతడు సినిమాలో మహేశ్ బాబు చేసిన ఫైట్ గురించి చెబుతూ 'వాడు మొగాడురా బాబూ ' అని తనికెళ్ళ భరణి చెప్పే డైలాగులు బావుంటాయి. అలా ఒక పద్ధతిగా, ఒక కళగా, శాస్త్రబద్దంగా అవినీతిని పేర్చుకుంటూపోయారు అనిపిస్తుంది. మరి అందుకు వారిని మెచ్చుకోవాలా వద్దా చెప్పండి?

    ReplyDelete
  4. @ అజ్ఞాత @ 5 జూన్ 2012 12:48 సా
    సంతోషం. కొన్ని అయినా మంచి సంస్థలు వుంటాయి లెండి.

    ReplyDelete
  5. మీరూ ఈనాడు , అంధ్ర జ్యొతి, సాక్షి చదివి ఒక అబిప్రాయనికి వొస్తె మీముల్ని ఎవరు మర్చలెరు

    ReplyDelete
  6. @ అజ్ఞాత
    అలా అంటారేంటండీ. ఈనాడు ఈ విషయాలపై ఫిక్షన్ భలే వ్రాస్తోందిగా. చదివే ఓపికే వుండాలి గానీ చక్కని కాలక్షేపం. ఇంకా ఓపిక వున్నవారు మూడూ చదివీ, విశ్లేషించీ వాస్తవాలు లాగుదామని ప్రయత్నిస్తుంటారనుకోండీ. నాకంత ఓపిక లేదు. వాస్తవం అనేది మిధ్య అయిపోయింది కాబట్టి కాలక్షేపానికి ఏదయితేనేమిలెండి. ఈనాడు వ్యసనం నుండి ఇంకా దూరం కాలేదు. అప్పుడప్పుడూ ఆంధ్రభూమి కూడా చూస్తుంటాను.

    ReplyDelete
  7. మీరు ఈనాడు,ఆంధ్ర జ్యోతి కూడా చదువుతారా? అవి ఒక కులం వాళ్ళ కోసమే పని చేస్తున్న పత్రికలు

    ReplyDelete
  8. @ అజ్ఞాత
    ఈనాడులో మీరు అంటున్న సంకుల సమరాలు పెద్దగా పట్టించుకోకుండా మిగతావి చదివేస్తుంటాను. ఈనాడుకి ఓ సారి ఎడిక్ట్ అయ్యింతరువాత బయటకి రావడం కాస్త కష్టం అనుకుంటాను.

    ReplyDelete
  9. Guruvu garu,
    Madam gari driving license emayyindi.Ticket icchara?

    ReplyDelete
  10. నిష్‘పక్షపాతంగా వ్రాసే ఒకే ఒక పత్రిక సాఆఆక్షి

    ReplyDelete
  11. Bagaa chepparu , cbi nijayiteega panichestondani meeruu nammutunnaara, anduloanuu padavikosamoa ,prapakam kosamo panichestunnaaru tappa jaati meeda gauravam leadu ,desamkoasam kadu,ikapoate naado salaha akramaarkulaloa vikramarkudu avineetiki moolakarakudu,jarnalijaanni addupettukuni abaddaalatoa jeevistunna ramojee,eenadu chadavakandi,

    ReplyDelete
  12. సాక్షి ది వ్యక్తి ఆరాధన ,ఈనాడు, ఆంధ్ర జ్యోతి వి కుల ఆరాధన. కుల పత్రికలు చాలా డేంజర్.వాటికి ఇతర కులాల మీద బురద జల్లడమే పని.

    ReplyDelete
  13. vallu padavvulu thisukuntaru lendi.

    ReplyDelete
  14. cbi vaallu lanchalu teesukovadam ledani evaru chepparu?

    ReplyDelete
  15. CBI lanchalu kuda thisukuntunda?.......ithe gali thondara lone bayataku vasthadu....

    ReplyDelete
  16. @ శశి
    ఆర్నెళ్ళ క్రితం సంగతి ఇప్పుడా అడిగేదీ ?! కోర్టుకేసాడు పోలీసాఫీసర్. అక్కడికెళితే ఎగస్పార్టీ రాలేదు. ఖేల్ ఖతం :) ఇక్కడ ఇలాంటి ట్రాఫిక్ ప్రమాదాల కేసుల్లో అవతలివారు రాకపోవడం - కేసు కొట్టివెయ్యడం మామూలే. మొత్తమ్మీద మా ఆవిడ కారు ఏక్సిడెంట్ చేసిన పుణ్యమా అని ఇక్కడి కోర్టులు ఎలా పనిచేస్తాయో కాస్తంత రుచి చూసాము.

    @ విజయమోహన్
    :)

    @ రోహిణి
    CBI నిజాయితీగా పనిచేసోందని నేనేమీ నమ్మట్లేదండీ. అయితే లంచావతారం ఎత్తిందన్న వార్తలు ఇంకా బయటకి రావడం లేదే అని బెంగపడుతున్నా.

    ReplyDelete