అవినీతిని చట్టబద్దం చెయ్యాలి!

కొంతకాలం ఈ డిమాండ్ ఎక్కడో విన్నాను. ఎవరన్నారో, ఎందుకాన్నారో, ఎక్కడన్నారో, సరదాకు అన్నారో లేక కొంపదీసి నిజంగానే డిమాండ్ చేసేరో గుర్తుకులేదు.  బావుంది కదూ ఆ డిమాండూ. అప్పుడిక హాయిగా ఏ బేరసారాలూ లేకుండా, కంఫ్యూజన్ లేకుండా ఎంచక్కా ఎవరి వాటా వారికి ఇస్తూ, పనులు త్వరగా తెముల్చుకుంటూ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించవచ్చు. ఏ శాఖలో, ఏ హోదా వారికి ఎంత శాతం ముట్టచెప్పాలో ఇప్పటికే వున్న అనధికార లెక్కలను ఎంచక్కా చట్టబద్దం చేస్తే హాయిగా ఓపని అయిపోతుంది. డబ్బులు ముట్టచెప్పలేని పేదనీతి పరులకూ ఆ చట్టంలో కొంత వెసులుబాటు అయినా వుండాలి. వారి పని కూడా జరుగుతుంది కానీ దానికి టైం లిమిట్ అంటూ వుండదు. పేదలూ, నీతివంతులూ ఆ మాత్రం త్యాగాలు చెయ్యకపోతే ఎలా? అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎలా? పని జరుగుతుంది బాబు గారూ, పని జరుగుతుంది...కానీ ఎన్నటికి అన్నది ఇప్పుడప్పుడే చెప్పలేం.

కరప్షన్ ని చట్టబద్దం చెయ్యడం వల్ల చాలా లాభాలు వున్నాయి. ముందుగా ACB ని ఎత్తివేయొచ్చు - అలా ఎంతో డబ్బు ఆదా చెయ్యొచ్చు. అలాగే CBI వారికీ, కోర్టులకూ, జైళ్ళకూ ఎంతో పని తగ్గుతుంది - చాలా డబ్బు ఆదా అవుతుంది.  అలాగే అరెస్టులూ, అందువల్ల వచ్చే సానుభూతీ, పోయే వోట్లూ కూడా తగ్గుతాయి. అలా పాలక పక్షానికి ఇది ఎంతో లాభదాయకం. అవినీతి అంటే లంచాలు ఒకటే కాదు కదా. ఎన్నో రకాలుగా వుంటుంది కదా. అందుచేత అవినీతి పరులకి ఏమాత్రం అన్యాయం జరగకుండా రిటైర్డ్ న్యామూర్తులతో ఒక కమిటీ వేసి ఎవరికి ఎంత ఎలా డబ్బు ఎప్పుడెప్పుడు చేరాలో వారినుండి సూచనలు స్వీకరించాలి. ఆ కమిటీలో ఒక్కసారయినా అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన  జడ్జిలే మాత్రమే వుండాలి.  ఉదాహరణకు గనుల సంగతే తీసుకుందాం. ముఖ్యమంత్రి నుండీ గని వోనరు దాకా ఎవరెవరు ఎంత లాభ పడాలి, ఎలా లాభపడాలి అనేది ముందే నిర్ణయిస్తే ఏ గొడవా వుండదు కదా.  ప్రజలు కూడా నిక్షేపంగా అవినీతిని వోట్ల రూపంలో నైతికంగా సమర్ధిస్తున్నారు కాబట్టి ఆ చట్టం మీద వ్యతిరేకతా వుండదు. చట్టసభ సభ్యులూ సంతోషించి ఎంచక్కా బిల్లు పాస్ చేయిస్తారు, పండగ చేసుకుంటారు. కాకపోతే ఆ చట్టంలో వారి వాటాలు పెంచుకుంటారు. పర్లేదు లెద్దురూ. ఇలా అవినీతి చట్టబద్దం చెయ్యడం వల్ల ఇంకో లాభమూ వుంది. ఇప్పటిదాకా అవినీతిపరులు దుర్మార్గమయిన నీతి చట్టాల బారిన పడకుండా ఎంతో శ్రమ పడుతున్నారు. వారిని ఆ శ్రమ నుండి తప్పించినవారం అవుతాం. అప్పుడు వారి యొక్క శక్తి సామర్ధ్యాలను దేశ పురోగతి కోసం సరిగ్గా వినియోగించగలుగుతారు. అప్పుడు దేశం బాహ్గా బాగుపడగలదు. 

అయితే ఇలా అవినీతిని చట్టబద్దం చెయ్యడం వల్ల చిన్న ఇబ్బంది వుంది. ఇలా నెలానెలా జీతాల్లా క్రమం తప్పకుండా వచ్చే అవినీతి పేమెంట్లకు అందరూ అలవాటు పడిపోతారు. కుటుంబ సభ్యులు కూడా అలవాటుపడిపోయి అందుకు తగ్గట్టుగా తమ జీవన ప్రమాణాలని, అంతస్థులను పెంచుకుంటారు. అలాగే కోరికలు కూడా పెరుగుతాయి కదా. కొంతకాలానికి ఇలా వచ్చే ఆదాయం కూడా రొటీన్ అవుతుంది. ఇంకా డబ్బు ఎలాగయినా సంపాదించమని ఇంట్లో ఆడవాళ్ళు మొగుళ్ళని ఒత్తిడి చేస్తుంటారు. భర్తలకు కూడా నిజమే అనిపిస్తుంది. ప్చ్, ఇంతేనా నేను సంపాదించేదీ అనిపిస్తుంది. అప్పుడు ఠంచనుగా వచ్చే ఆదాయం పైన వచ్చే పై ఆదాయం కోసం డిమాండ్ చెయ్యడం మొదలెడతారు.  అప్పుడు తెలివిమాలిన నీతివంతుడు ఎవరయినా 'మీ డబ్బు మీకు ఇస్తూనే వున్నాం కదా' అని అడిగారనుకోండీ 'అది ఎలాగూ వచ్చేదేనయ్యా' అని వీళ్ళు బల్ల క్రింద చేతులు టపటపలాడించేస్తారు. అలా మరో అవినీతి మళ్ళీ మొదలవుతుంది. దానికీ వుంది ఓ సింపుల్ సొల్యూషన్ - దాన్నీ చట్టబద్దం చేస్తే ఓ పని అయిపోతుంది.

ఇలా వాటాలిచ్చుకుంటూ వెళితే ప్రభుత్వానికి ఎలా మిగిలేది,  అవసరాలు ఎలా తీరేదీ అనే ధర్మ సందేహం మీకు రావచ్చు. తప్పులేదు. అందుకు ప్రజలు వున్నారు కదా. ప్రజానీకం మీద కొత్త పన్ను వెస్తే పాయే. చచ్చినట్టు కట్టక ఛస్తారా. కరప్షన్ సర్ చార్జ్ వసూలు చేస్తే అయిపోతుంది కాదూ? మీకు ఆ మాత్రం తెలివి లేదేంటండీ బాబూ. ఇలాగయితే కష్టమే మరి. ఇలా అవినీతిని చట్టబద్దం చేసేకా పనిలో పనిగా దొంగతనాలనీ, దోపిడీలను, బలాత్కారాలనీ, హత్యలనూ చట్టబద్దం చేసేస్తే మరి కొన్ని పనులు కూడా అయిపోతాయని నేనంటాను. మరి మీరేమంటారో? ఇలా ఒక్కొక్కటినీ లీగలైజ్ చేసుకుంటూ మన ప్రజాప్రతినిధులు ప్రయాస పడే బదులుగా నేరాలనన్నింటినీ గుండుగుత్తగా చట్టబద్దం చేస్తే టోటల్గా ఓ పని పూర్తవుతుంది.

11 comments:

 1. జగన్ or జగన్ పార్టీ వాళ్ళు (ఎందుకంటే జగన్ ఇప్పట్లో బయటకి రాకపోవచ్చు) అధికారంలోకి రాగానే తొలి సంతకం పెట్టేది అ ఫైల్ మీదనే.....

  ReplyDelete
  Replies
  1. hahhaha ippatike modata santakam pettalsina files chala unnayi. ofcourse deeni mundu avi antha upayogapadevi kadanukondi.

   Delete
 2. గవర్నమెంట్ ఆఫీసుల ముందు కూడా... ధరల పట్టిక ఉంటే బాగుంటుంది. ఆన్ని ఉంటే ఎంత అవుతుంది ,కొన్నే ఉంటే ఎంత అవుతుంది, అస్సలు లెకుంటే ఎంత అవుతుంది...


  అలాగే మన ఇళ్ళ ముందు కూడా... ఓటుకు ఎంత తీసుకుంటాం అనేది కూడ పెట్టుకుందాము.(ఉప/పార్లమెంటుకు/ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు అని

  ReplyDelete
  Replies
  1. బావుంది, బావుంది. అవినీతి ఉద్యమానికి మీరు విలువైన సూచనలు ఇచ్చి తోడ్పడుతున్నందుకు సంబరంగా వుంది.

   ఓటుకు ఎంత తీసుకోవడం అనే పట్టిక మన ఇళ్ళ ముందు ఎందుకు? అవన్నీ వివరంగా ఏ ఎన్నికలకు ఎంత అనేది చట్టంలో గాఠ్ఠిగా పొందుపరుస్తాం కదా. వొటుకు వచ్చే నోటుకు ఆదాయం పన్ను మినహాయింపు ఇచ్చేద్దాం.

   Delete
  2. చెప్పడం మరిచాను. ఎన్నికలు డిక్లేర్ చెయ్యగానే ఎన్నికల సంఘమే అన్ని పార్టీల తరఫునా ఒక్కో కుటుంబానికి మొత్తం ఎంతవుతుందో ఆయా వోటర్ల బ్యాంకులో డైరెక్ట్ డిపాజిట్ చేస్తుంది. ఆ తరువాత అలా ఎంతయ్యిందో లెక్కేసి ఆ బిల్లు ప్రతి పార్టీకి లేదా ప్రతి అభ్యర్ధికి పంపిస్తుంది. అలా ఎన్నికల్లో అవినీతి రూపుమాసిపోతుంది.

   Delete
 3. బాబు గారు అధికారం లో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ సహకారం తో చేపట్టే ప్రాజెక్ట్ లకు తప్పని సరిగా కన్సల్టెంట్ సేవలు ఉపయోగించుకోవాలనే నిబందన పెట్టారు ఆ కన్సల్టెంట్ కు పది శాతం వరకు కమిషన్ ఉండేది . లంచానికి కన్సల్టెంట్ ఫీజు అని ముద్దు పేరు పెట్టుకున్నారు

  ReplyDelete
 4. ప్రభుత్వ ఉద్యొగులకు దీనివల్ల ఉపయోగం ఉంది. మరి మాబొటి ప్రైవేటు ఉద్యొగుల మాటేమిటిటండి?

  ReplyDelete
 5. బాగుందే ఇదేదొ?

  ReplyDelete