ఇవాళే కేంపింగుకి


విస్కాన్సిన్లో వున్న ఒక రిక్రియేషన్ ఏరియాలో కేంపింగుకి ఇంకో కుటుంబంతో కలిసి ఇవాళ వెళుతున్నాం. చుక్కల క్రింద, మబ్బుల క్రింద, ప్రకృతి సౌందర్యం మధ్య గడపాలని వెళుతున్నాం. ఈ సీజనులో కేంపింగ్ ఇదే మొదటిసారి కాబట్టి ఒక్క రోజు కోసమే వెళుతున్నాం. వచ్చేనెల  వీలయితే రెండు రోజుల కేంపింగ్ వెయ్యాలి. ఏమయినా విశేషాలు వుంటే సోమవారం వ్రాస్తాను.

నాకు వర్షం అంటే ఇష్టం. కేంపింగుకి వెళ్ళాక అక్కడ వర్షం వస్తే బావుండును. అక్కడ ఇవాళ వాతావరణం ఎలా వుందో ఇంకా చూడలేదు. ఈ దేశాలకి వచ్చాక ఇంట్లో వుంటే బయట వర్షం పడుతున్నదీ లేనిదీ అర్ధం కాని పరిస్థితి - బయటకి చూస్తే తప్ప. అందుకే అక్కడ వర్షం వస్తే టెంటులో కూర్చొని టపటప శబ్దాలు వింటూ, ఎగిరిపడుతున్న ఝల్లులో చేతులు ఆడిస్తూ, తడిచిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ, ఉరుములకు, మెరుపులకు తాదాత్మ్యత చెందుతూ, ముసురుకున్న మేఘాలని అవలోకిస్తూ గడపొచ్చు. 

మీరూ కేంపింగుకి వెళుతుంటారా? వాటి కబుర్లు మాకూ చెబుదురూ.

9 comments:

 1. మీరు camping కి వెళ్ళటం ఇదే మొదటిసారా? just curious..

  ReplyDelete
 2. చాలాసార్లు వెళ్ళాం. అయితే బ్యాక్ కంట్రీ క్యాంపింగుకి ఇంతవరకూ వెళ్ళలేకపోయాను. కుటుంబంతో అలాంటి క్యాంపింగ్ కష్టం. స్నేహితులతో అయినా వెళ్ళాలి.

  ReplyDelete
 3. I keep hearing that camping in the mountains is the best experience! They come back very refreshed!!

  ReplyDelete
 4. Good luck with the trip. Rains are the worst enemy. Beware of ticks.

  ReplyDelete
 5. @ ది ట్రీ
  క్యాంపింగ్ అంటే ఇదీ:
  http://en.wikipedia.org/wiki/Camping

  ReplyDelete
 6. @ తెరెసా
  క్యాంపింగ్ చాలా బావుంటుంది. అయితే ప్రకృతి అంటే పరవశించే వారయితేనే పూర్తిగా ఆనందించగలుగుతారు.

  @ ప్రేరణ
  బాగానే గడిచింది. గుబురు చెట్ల మధ్యలో మా క్యాంపింగ్ సైట్ రావడంతో నేను బాగా సంతోషించా కానీ మా ఆవిడకి ప్రకృతి అంటే విరక్తి కాబట్టి కాస్తంత అప్సెట్ అయ్యింది.

  @ చాతకం
  వెళ్ళేదే నగర జీవితానికి దూరంగా ప్రకృతిలో పరవశించడానికి కాబట్టి దానికి తోడుగా వర్షం వస్తే నాకు ఇంకా ఇష్టం. అయితే ఒకటి రెండు చినుకులు తప్ప వర్షం రాలేదు. అది పోగా మిగతా వాతావరణం చక్కగా అనుకూలించింది. కాస్త చలిగా వుండగా రాత్రి క్యాంప్ ఫైర్ వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ చలి కాచుకోవడం చక్కటి అనుభూతిగా మిగిలింది. ఫోటోలు కొద్ది రోజుల్లో బ్లాగులో పెడతాను.

  ReplyDelete
 7. @ఈ దేశాలకి వచ్చాక ఇంట్లో వుంటే బయట వర్షం పడుతున్నదీ లేనిదీ అర్ధం కాని పరిస్థితి - ...
  ఇక్కడా అంతే!కుండపోత వర్షాన్ని చూసి ఎంత కాలమైందో

  ReplyDelete