సమర్ధతకు పట్టం - నీతికి నష్టం - ఎవరికి కష్టం?

అందరూ అవినీతిపరులే అయినప్పుడు మీరు ఎవరిని ఎన్నుకుంటారు? తక్కువ అవినీతి పరుడిని కాదూ? మీరు కూడ అవినీతిపరులే అనుకోండి - అప్పుడు? అవినీతిపరుల్లోనే సమర్ధుడిని ఎన్నుకుంటారు. తక్కువ అవినీతి పరుడినీ, ఎక్కువ ప్రయోజకుడినీ పక్కనే నిలబెడితే ఎవరికి వోట్ వేస్తారు? నేనయితే తక్కువ అవినీతి పరుడితో ఎక్కువగా స్నేహం చేసినా కూడా పాలనా వ్యవహారాలో మాత్రం సమర్ధుడినే ఎన్నుకుంటాను. ప్రజలూ, నాయకులూ అందరూ దాదాపుగా అవినీతిపరులే అయిన వేళ ఎవరు ఎంత గొంతు చించుకున్నా అది ఓ విషయం కాదు. ప్రతి పార్టీ నుంచీ కుటుంబానికి పదివేలకు పైగా డబ్బు పుచ్చుకున్న ఓటరు మహాశయుడికి ఇహ తమ నాయకుల అవినీతి గురించి ఆలోచించే అర్హత వుంటుందా? అందుకే అందరూ అవినీతికి పట్టించుకోకుండా పక్కన పడేసారు. ఇహ మన రాష్ట్రంలో మిగిలివున్న నాయకుల్లో సమర్ధత, ఆత్మవిశ్వాసం, దూకుడు, ధైర్యం మరియు తెలుగు వాడి ఆత్మ గౌరవం కాపాడే నాయకుని కోసం చూస్తారు. నంగినంగి నాయకులను ఏమారుస్తారు.

మిగతా అవినీతిపరులకూ YSR కూ వున్న తేడా ఏంటంటే మిగతావారందరూ ఎవరికి వారు సంపాదించుకున్నారు - వైస్ మాత్రం తాను తిన్నాడు - ప్రజలకూ తినిపించాడు. అదీ ఆయన విజయ రహస్యం. వైకాపా అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే జరుగుతుండవచ్చు. 'యథా రాజా - తధా ప్రజా' లేదా 'యథా ప్రజా - తథా రాజా'. ఎటునుండి ఎటు తిప్పినా ఇటు రాజు హాప్పీ - అటు ప్రజలూ హాప్పీ.  సణిగే మేధావులకే అది తలనొప్పి.   ఏమయినప్పటికీ మన రాష్ట్రం డబ్బు డిల్లీ వోడు తినడం కన్నా మన వాడు తింటేనే సమ్మగా వుంటుందంటాను. మనవాడే కదా పోనీలే అనుకుంటాము. మన రాష్ట్ర ప్రజలే కదా అభివృద్ధి చెందుతోందీ అనుకుంటాము. ఏమయినప్పటికీ రాహుల్ యువరాజ గర్వభంగం జరిగితే చాలు.   లేకపోతే తాము పాలించడానికే పుట్టాము అనుకుంటారు. తెలుగువాడిని తైతక్క లాడిస్తారు. అప్పుడు తెలుగువాడి దమ్ము ఎంటీవోడు చూపించాడు ఇప్పుడు జగన్ చూపిస్తాడేమో తెలియదు. ఏదేమయినా దేశాన్ని అందరూ కలిసి గుల్ల చేసేట్టుగా వున్నారు. అందరూ అంటే కేవలం నాయకమన్యులనే కాదు నా అభిప్రాయం. తలా పాపం తిలా పిడికెడు లాగా అందులో ప్రజలందరి భాగస్వామ్యం వుంటుంది లెండి. అలా మనదేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మంచయినా, చెడయినా ప్రజలకు నచ్చిందే ప్రజాస్వామ్యంలో చెయ్యాలి కాబట్టి ప్రజలు అవినీతికే పట్టం కట్టినప్పుడు కాదనడానికి మనం ఎవరం? 

భారత్ మనందరి దేశం - అందువల్ల అందరం కలిసి దోచుకుందాం. అందులో ప్రజలనూ భాగస్వామ్యం చేద్దాం. అందరం ఆనందిద్దాం. ఇదీ వైకాపా విజయసూత్రం. మరి ఎవరికి నష్టం? అందరమూ ఆతానులోని ముక్కలమే అయినప్పుడు ఇహ గొడవేముందీ? వాటాలు పంచేసుకుందాం రండ్రండి. 

మేరా భారత్ మహాన్. 

రెండేళ్ళల్లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఇలాగే జగన్ జైల్లో వుంటూ షర్మిళ ముఖ్యమంత్రి అయితే బావుండును అనిపిస్తోంది. వైఎస్ గారి అమ్మాయి చూడటానికి కూడా బావుంది - తనలో సమర్ధత కూడా వున్నట్టుంది. మనకు ఇంతవరకూ మహిళా ముఖ్యమంత్రి లేదు కాబట్టి ఆ పనీ జరిగినట్టుగా వుంటుంది. జయహో షర్మిళ! ఇక విజయమ్మ సంగతి అంటారా? పరిస్థితులు మహాబాగా కలిసివస్తే ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదిద్దాం.  ఏముందండీ ఇదే రేంజిలో ఎంపి సీట్లు కొల్లగొడితే జగన్ జైల్లో కూర్చునే కింగుమేకర్ కాగలడు కాదూ?  అప్పుడు అటు రాహులూ, ఇటు ములాయమ్ము వగైరాలు అతని కాళ్ళ బేరాలకి రారూ? మీరూ మీరూ ఎందుకుకొట్టుకు ఛస్తారూ - ముచ్చటగా మా మదర్ వుండగా అని మనాడు దీర్ఘాలు తీయడూ? సర్లెండి, ఈలోగా కాంగ్రెస్ ఇంకా ఎన్ని కుట్రలు పన్నుతుందో, ఏమేం చేస్తుందో, ఏం బేరాలు పెడుతుందో, ఎవరి కాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారో! జగన్ సార్ జైల్లోంచి ఎప్పుడు వస్తారోస్తారొస్తారో! 

12 comments:

  1. ఇదేదో మా లేడీస్ కి సపోర్టింగా ఉంది..భలే భలే:)

    ReplyDelete
  2. @ ప్రేరణ
    నేనెప్పుడూ స్త్రీలను సపోర్ట్ చేస్తుంటాన్లెండి :)

    అన్నట్టు చాల్రోజుల తరువాత కనపడ్డారు! అదీ ఈ సమయంలో! అమ్రికాకి విచ్చేసారా ఎంటీ? మీ ప్రొఫయిల్ ఇంట్రోలో '...సవరణ కూడా మీరే' అని వుంది. అనగానేమి?

    ReplyDelete
  3. త్వరలో కసబ్ , దావూద్ , షకీల్ ఎలెక్షన్స్ లో పోటి చేస్తారంట.
    కసబ్ అయితే పాకిస్తాన్ వెళ్ళనే వెళ్లనని చెప్తున్నాడట. చూడాలి వాళ్ళ దగ్గర కూడా డబ్బుంది గా. నాదెం పోయింది. మా ఇంట్లో 6 మెంబెర్స్ ఉంటారు, ఓటు కి ఒక రెండు వేలు తీసుకుంటే పన్నెండు వేలు, హాపీ గా గుద్దేచ్చు .మేము మాత్రం ఈ విషయం లో నీతి గా ఉంటాం. ఎవడు ఎక్కువ ఇస్తే వాడికే వేస్తాం మా ఓటు, అందులో మాత్రం తిరుగుండదు.
    :venkat

    ReplyDelete
  4. "వైఎస్ గారి అమ్మాయి చూడటానికి కూడా బావుంది"

    Friendly advice: ఆమె భర్త "బ్రదర్" అనిల్ గారికి మీ టపా కనిపించకుండా జాగ్రత పడండి.

    ReplyDelete
  5. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్..:-)
    ఏంలేదండి...మీలాంటి వాళ్ళ ప్రేరణతో నేను రాసిన వాటిల్లోని తప్పుల సవణ భాధ్యతలు కూడా మీకే అప్పగిస్తే తిట్లు తప్పుతాయని...ఐడియా బాగుందాండి!:-)

    ReplyDelete
  6. So even atheists have caste feelings?

    ReplyDelete
  7. నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
    అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దెవుడు దిగి రాని ఎవ్వడు ఎమై ఫొని
    మారదు లోకం మారదు కాలం

    గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి?
    గొర్రె దాటు మందకి నీ గ్ఙాన బోద దేనికి?
    ఏ చరిత్ర నెర్పింది పచ్చని పఠం
    ఏ క్షణన మర్చుకుంది చిచ్చుల మర్గం
    రామ భణం ఆర్పిందా రవణ కాస్టం?
    కృష్ణ గిత ఆపింద నిత్య కురుక్షేత్రం?

    నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
    అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
    మారదు లోకం మారదు కాలం

    పాత రాతి గుహలు పాల రాతి గ్రుహాలైన?
    అదవి నీతి మారింద ఎన్ని యుగాలైన?
    నట్టదువులు నడివీదికి నడిచొస్తే వింత?
    బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
    శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్య ఖాండ

    నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
    అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దెవుడు దిగి రాని ఎవ్వడు ఎమై ఫొని
    మారదు లోకం మారదు కాలంనిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
    అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దెవుడు దిగి రాని ఎవ్వడు ఎమై ఫొని
    మారదు లోకం మారదు కాలం

    గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి?
    గొర్రె దాటు మందకి నీ గ్ఙాన బోద దేనికి?
    ఏ చరిత్ర నెర్పింది పచ్చని పఠం
    ఏ క్షణన మర్చుకుంది చిచ్చుల మర్గం
    రామ భణం ఆర్పిందా రవణ కాస్టం?
    కృష్ణ గిత ఆపింద నిత్య కురుక్షేత్రం?

    నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
    అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
    మారదు లోకం మారదు కాలం

    పాత రాతి గుహలు పాల రాతి గ్రుహాలైన?
    అదవి నీతి మారింద ఎన్ని యుగాలైన?
    నట్టదువులు నడివీదికి నడిచొస్తే వింత?
    బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
    శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్య ఖాండ

    నిగ్గ తీసి అడుగు ఏ సిగ్గు లేని జనాన్ని
    అగ్గి తోటి కడుగు ఏ సమాజ జీవత్శావాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దెవుడు దిగి రాని ఎవ్వడు ఎమై ఫొని
    మారదు లోకం మారదు కాలం

    ReplyDelete
  8. బుల్లబ్బాయ్June 20, 2012 at 4:16 AM

    ఏంటో మొత్తం కంఫూజింగ్ గా వుంది అన్నాయ్!

    సమర్థుడ్ని సీట్లో కూచోపెడితే మరి అవినీతి కంట్రోలయిపోద్దిగా?

    ReplyDelete
  9. బొత్తిగా సమర్థిస్తున్నావో విమర్శిస్తున్నావో అర్థం కాకుండా రాసావు అన్నయ్. ఏదేమైనా సరే మమ్మల్ని పూర్తిగా దోచుకున్నా, పూటకి ఇంత బిచ్చమేసే జగనన్నకే నా వోటు.

    ReplyDelete
  10. @ అజ్ఞాత @19 జూన్ 2012 10:57 ఉ
    లోకం మారదు కాబట్టి మనమే మారిపోవాలేమో?

    @ జలతారు వెన్నెల
    సంతోషం.

    @ బుల్లబ్బాయ్
    అవినీతిని ఓ సమస్యగా ప్రజలు భావించడం లేదు. అది నిత్యజీవితంలో ఓ భాగం అయిపోయింది. అందువల్ల దానికీ సమర్ధతకూ సంబంధం లేదు. పైగా ఎలా సంపాదించావు అనే దానికన్నా ఎంత సంపాదిస్తే అంత సమర్ధుడిలా సగటు జనాలు భావిస్తున్నారు. పైగా తమకూ అందులో కొంత ఏదో రకంగా విదిలిస్తే అదే జనాలకి పదివేలు.

    ReplyDelete
  11. @ అజ్ఞాత @ 20 జూన్ 2012 12:47 సా
    ప్రతిఘటణ సినిమాలో ఓ సీన్ వుంటుంది. చాలా ఏళ్లయింది ఆ సినిమా చూసి - సరిగ్గా గుర్తుకులేదు. సినిమా చివర్లో అనుకుంటాను - చరణ్ రాజ్ గురించి ఓ మీటింగులో విజయశాంతి మాట్లాడుతూవుంటుంది. అప్పుడు సభావేదిక మీద కూర్చొని వున్న చరణ రాజ్ పక్క నున్న వ్యక్తితో ఇది నన్ను పొగుడుతోందా తెగుడుతోందా అని అడుగుతాడు.

    ఒక వ్యక్తిలో ఖచ్చితంగా మంచి చెడూ రెండూ వుంటాయి. అయితే ఏది ఎంత శాతం వుంది అనేదే ప్రధానం. జగనులో మంచీ వుంది చెడూ వుంది. అందులో ఏం తీసుకోవాలో, ఏం నిర్లక్ష్యం చెయ్యాలో ప్రజలు తెల్చేసారు. సినిమాలను ఉదాహరణగా తీసుకుంటే కొన్ని గొప్ప గొప్ప సినిమాలలో చెత్త పొరపాట్లు వుంటాయి. మిగతా విషయాలు చాలా బాగా వున్నప్పుడు కొన్ని లోపాలు వున్నా కూడా ప్రేక్షకుడు క్షమిస్తాడు, లైట్ తీసుకుంటాడు. సినీ మేధావులు మాత్రం చర్చలు చేసేస్తూ గింజుకుంటుంటారు.

    ReplyDelete
    Replies
    1. jagan lo chedu undi sare..., manchi emundabbaa...!!!

      sarath kaalamoo, chenakkaayaloo... ento...

      Delete