కిరణ్ స్వరూప - నా చిన్ననాటి స్నేహితురాలు

ఎంత అందంగా వుండేదనీ. క్రిస్టియన్ గర్ల్ ఆమె. తన తల్లితండ్రులిద్దరూ అధ్యాపకులు. అప్పటిదాకా మా పల్లెలో చదుకుంటున్న నేను మా నాన్న గారు పనిచేసున్న భువనగిరి గంజ్ పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరాను. అప్పుడే ఆమెను చూసి ఫ్లాట్ అయ్యాను. ఎంత చక్కగా నవ్వేదనీ. వాళ్ల పేరెంట్లూ, మా నాన్నా అధ్యాపకులే అవడంతో వారికీ నాన్నగారికీ స్నేహం వుండేది. వాళ్ళిల్లు స్కూలుకి దగ్గర్లోనే వుండేది. ఆమె కానీ, మిగతావారు కానీ ఎంత నచ్చినా ఎవరితోనూ వెధవ్వేషలు వెయ్యలేదు. అందరితో సాధారణ స్నేహం నడిపిస్తుండేవాడిని - మౌనంగా, మూగగా అభిమానిస్తుండేవాడిని. అలాగే కిరణ్ తోనూనూ.  మామధ్య పరస్పర గౌరవం, సాధారణ స్నేహం వుండేవి. ఆమెతో ఎక్కువ స్నేహం చేస్తే ఏ వెధవ పని చేయాలనిపిస్తుందో అని తగిన జాగ్రత్తలో వుండేవాడిని. 

మా క్లాసులొ ప్రతి నెలకి క్లాస్ మానిటర్ మారతారు. ఆమె ఓకసారి అలా మా క్లాసుకి మానిటర్ అయి మా అబ్బాయిలను అందరినీ బాగా కట్టడి చేసింది. దాంతో మాకు అందరికీ బాగా వళ్ళు మండింది. మాలో మేము మాట్లాడుకొని కూడబలుక్కొని పాఠశాలకి దగ్గర్లో వున్న వారి ఇంటికి పోలోమ్మంటూ వెళ్ళాం. ఆమె నాన్నగారిని పిలిచి ఆమె మా క్లాసు మానిటరుగా మాకు పెడుతున్న ఇబ్బందులు వివరించాం.   మేము వచ్చి మాట్లాడుతుంటే కిరణ్ లోపటినుండి చూస్తొవుంది అప్పుడు. ఆమె మనస్సు ఎక్కడ బాధపడుతుందో అని నాకిక్కడ బాధేస్తోంది. అలా అని నేను ఏమయినా మాట్లాడవద్దంటే మా వాళ్ళు నా కీళ్ళు విరగ్గొట్టేట్టున్నారు. అందుకే ఆ గుంపులో గోవిందగా కలిసిపోయాను.  వాళ్లకూ మాకూ బాగానే పరిచయాలు వున్నాయి కాబట్టి ఆయన కూడా మా సమస్యలు సాదరంగా విని అర్ధం చేసుకున్నాడు. కిరణ్‌కి చెబుతా అన్నాడు. 

మరునాడు కిరణ్ తన పదవికి రాజీనామా చేసింది. కుర్రాళ్లం అంతా ఆమె చర్యకి హర్షించాం. ఆమె మా పట్ల కోపంతోనో, ద్వేషంతోనో వుంటుందనుకున్నాం కానీ ఆ విషయం మనస్సులో పెట్టుకోకుండా ఇదివరకు లాగానే  అందరితో స్నేహంగా వుంటుండటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.  పై సంఘటణకి మించి ఆమె గురించి ఇంకా ప్రత్యేకంగా ఏమీ గుర్తుకులేదు. అక్కడ తొమ్మిదివరకు చదివాక మా నాన్నకి సూర్యాపేట్ బదిలీ అవడంతో పదికి అక్కడికి వచ్చాను. తీరా చూస్తే క్లాసులో అందరూ మగపిల్లలే :( అంతమంది అమ్మాయిల మధ్య తిరిగిన నాకు మా సూర్యాపేట క్లాసు ఓ ఎడారిలా అనిపించింది. అది కో ఎజుకేషన్ స్కూలే కానీ మా తరగతిలోనే అమ్మాయిలు లేరు, ఏం చేస్తాం...ప్చ్ అనుకుని మూసుకున్నాను. 

అలా కిరణ్‌కి దూరమయ్యాక ఎప్పుడు కిరణ్ అని పేరు విన్నా కూడా ఆమె గుర్తుకు వచ్చి నా మది పులకరిస్తూవుంటుంది. ఆమె తియ్యగా జ్ఞాపకం వస్తుంటుంది. ఇన్నేళ్ళ తరువాత ఆమె గురించి నా అప్పటి బాల్య స్నేహితుడు యూసుఫ్ చెప్పగా విని నా మది పులకించిపోయింది.  ఆమె టచ్చులోనే వుందని చెప్పాడు. అయితే ఎన్నో ఏళ్ళ తరువాత అతనితో మాట్లాడిన కారణంగా సమయం లేక కిరణ్ గురించి మిగతా వివరాలు కనుక్కోలేకపోయాను. ఇవాళ కూడా మాట్లాడాను కానీ ఆ టాపిక్ ఇంకా రాలేదు. ఈసారి మా యూసుఫుద్దీన్ తో మాట్లాడినప్పుడు ఆమె గురించి వివరంగ కనుక్కుంటాను. ఆమె కాంటాక్ట్స్ తీసుకుంటాను. అప్పటంత సౌందర్యం, గ్రేస్ ఆమె మెయిటెయిన్ చేస్తోందో లేదో. ఎప్పుడో మా తొమ్మిదవ తరగతిలో చూసిన ఆమె రూపమే ఇంకా గుర్తుకువుంది. ఈ సారి ఇండియా వెల్ళినప్పుడు వీలయితే ఆమెను కలిసిరావచ్చు కానీ ఆమె పాత స్మృతి చెరిగిపోతుంది. కొత్త కిరణ్ బావుంటుందో లేదో. బావున్నా లేకపోయినా ఆమెలోని అదే సరళత్వం, ఆహ్లాదత, మంచితనం కనుమరుగు అవకుంటే చాలు.  అయినా సరే నాలోని ఆమె స్మృతి చెరిగిపోకూడదనుకుంటే ఆమెను కలవకపోవడమే బెటర్. మీరేమంటారు? 

ఆమె కంఠ స్వరం కూడా ఎంత తియ్యగా వుండేదనీ. త్వరలోనే ఆమెతో ఫోన్లో మాట్లాడే అవకాశం వుంటుందని ఆశిస్తున్నా. అప్పుడు చూడాలి - ఇంకా ఆమె గొంతులోని మాధుర్యం అలాగే వుందో లేదో. వీలయితే ఆమెకు నా బ్లాగ్ అడ్రసూ ఇస్తాను. తన గురించి ఈ పోస్టేసాననీ చెబుతాను.  అప్పటిలాగా చక్కగా ఇప్పుడూ నాతో మాట్లాడుతుందంటారా? ఏమో. చూడాలి మరి. అప్పుడు ఆమెనే అడుగుతాను - ఆమెని కలిస్తే బావుంటుందో - కలవకపోతే బావుంటుందో.


23 comments:

  1. కొత్త కిరణ్ బావుంటుందో లేదో. బావున్నా లేకపోయినా ఆమెలోని అదే సరళత్వం, ఆహ్లాదత, మంచితనం కనుమరుగు అవకుంటే చాలు.
    మీ బ్లాగ్ అడ్రస్ ఇచ్చి..ఆమె చూసిన తర్వాత ...కూడా.. ఆమె మీతో స్నేహ పూర్వకంగా మెలగాలని ఆశిస్తాను.:)

    పోస్ట్ బాగుంది..శరత్ గారు.

    ReplyDelete
  2. "వీలయితే ఆమెకు నా బ్లాగ్ అడ్రసూ ఇస్తాను. తన గురించి ఈ పోస్టేసాననీ చెబుతాను. అప్పటిలాగా చక్కగా ఇప్పుడూ నాతో మాట్లాడుతుందంటారా?"
    మరి ఎక్కువ అలోచిస్తున్నరేమో? మీ బ్లాగ్ లోని చిలిపి టపా లు చదివాకా కూడా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే తను కొంచం DECENT అని అన్నారు కదా

    ReplyDelete
  3. @ వనజ, అజ్ఞాత
    ముందే నా బ్లాగు అడ్రెస్ ఇచ్చేయనులెండి. ఆమె నాతో చక్కగా మాట్లాడితే, ఆమెకు నా విషయాలు అర్ధం చేసుకునే మనస్సు వుందనిపిస్తేనే ఇస్తాను. లేకపోతే ష్.. గప్‌చిప్.

    ReplyDelete
  4. Hey suryapet ante nalgonda dist dena??? ye school?? ye batch meedi???

    ReplyDelete
  5. @ పావని
    అవునండీ. ఆ సూర్యాపేటే. మా క్లాసులో అమ్మాయిలు లేరు కాబట్టి మీరు నా క్లాస్మేటు ఖచ్చితంగా అయివుండరు. గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 1 లో చదివాను. 80-81 లో పది చదివాను. మీరేమయినా ఆ స్కూల్లో చదివారా?

    ReplyDelete
  6. I am also from Suryapet. 80-81 a time lo kamisam neenu puttaledu andi babu. So kachitamga neenu me classmate ne kanu lendi.....Be kool..... :)

    ReplyDelete
  7. aithe meeku 46 or 47 years untannamata..inka meekedo inchuminchu 35/36 untayanukuntunna..

    ReplyDelete
  8. @ పావని
    :)

    @ అజ్ఞాత
    నాకు 45. ఒక ఏడాది ముందుగానే నన్ను బళ్ళో వేసేరు లెండి.

    ReplyDelete
  9. @ పావని
    మీది సూర్యాపేటే మాదీ సూర్యాపేటే
    మీది సూర్యాపేటే మాదీ సూర్యాపేటే
    మీది సూర్యాపేటే మాదీ సూర్యాపేటే
    :))
    మేము కొత్త బస్సుస్టాండుకి చాలా దగ్గర్లో కుడకుడ రోడ్డు మీద వుండేవారం.

    ReplyDelete
    Replies
    1. కుడకుడ రోడ్డు మీద వుండేవారం.... Road meeda vunte yevvaru yemi ane vallu kada......illu leda road meeda yendukandi vundadam.....nannu adigite ma intlo vundadaniki permission ichedanni kadandi......:)

      Delete
  10. Thanks andi First . Nadi kuda near new stand. But kuda kuda side kadu . Suryapet public school daggaralo. I think u dont know that school ri8? yemi tandi lyrics rasaru maadi telani meedi tenali type lo.... anyways i am happy for your reply .........

    ReplyDelete
  11. @ పావని
    మీరన్నట్లుగానే సూర్యాపేట్ పబ్లిక్ స్కూల్ ఎక్కడ వుందో నాకు తెలియదండీ.

    ఇప్పుడు ఆ రోడ్డు మీదా కానీ, క్రిందా గానీ,పక్కనా గానీ మా ఇల్లు లేదండీ. అందుకే ఈ సారి పేటకు వస్తే మీ ఇంట్లోనే ఇక :)

    ReplyDelete
  12. Sure Sure always welcome.......

    Do u know sidhartha school? Suryapet public school exactly new bus stand ki back side vuntundi. akkade ma home kuda. meeru vache appudu mail cheyandi then i will send exact home address ..... ok

    ReplyDelete
  13. @ పావని
    సిద్ధార్ధ స్కూల్ తెలుసు కానీ మీ ఈమెయిల్ ఐడినే తెలియదు :)

    ReplyDelete
  14. Replies
    1. Hey !!!!!!!!! Meeku english nerpinchanu..... U should say thanks to me ....hahahhahhha :)

      Delete
    2. @ Pavani
      :)
      నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం బాగానే వుంది కానీ మీరే తెలుగు నేర్చుకోవాలి మరి. అనగా తెలుగు స్క్రిప్టులో వ్రాయడం. lekhini.org లాంటివి ఉపయోగించవచ్చుకదా.

      Delete
  15. అహ అహ!!!! నాకు తెలుగు రాయడం వచ్చెసింది..... Thank you sarath గారు .... Thanks a lot......

    ReplyDelete
  16. సంతోషం సగం బలం కదా!! మీ సంతోషానికి కారణం నీను కాబట్టి where is my gift ??????? hahahh:)

    ReplyDelete
  17. @ పావని
    హ్మ్. ఇంత దూరం నుండి బహుమతి ఇవ్వాలంటే కష్టమే సుమీ. అయినా సగం బలమే కదా. పూర్తి బలం వచ్చాక ఆలోచిద్దాం. హి హీ హీ. తప్పించుకుంటున్నా కదా.

    ReplyDelete
  18. Nice అండి ! బలెగ తప్పించుకున్నరు కదా. gr8 అండి మీరు అసలు!

    ReplyDelete
  19. @అంతమంది అమ్మాయిల మధ్య తిరిగిన నాకు మా సూర్యాపేట క్లాసు ఓ ఎడారిలా అనిపించింది....
    నాకు ఇంట్లో కూడా అలానే అనిపిస్తుంది..ఏమిటీ విచిత్రం??

    ReplyDelete