మా కుటుంబ వైద్యుడు ఆలం ప్రత్యేకత

మా డాక్టర్ మనవాడే. అంటే మొత్తమ్మీద పాకీస్తానో, బంగ్లాదేశో, ఇండియానొ తెలియదు కానీ భారత ఉపఖండం వాడే. ఎక్కడివాడో సరిగ్గా నేను తెలుసుకోలేదు. అతను డాక్టర్ ఆఫ్ ఆస్టియోపాత్ (DO). వారు సాధారణ వైద్యులకంటే కాస్త భిన్నమయిన వారు. వారూ మిగతా సాధారణ వైద్యులలాగానే చికిత్స చెయ్యవచ్చు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే రోగ లక్షణాలకు మూల కారణం ఏంటా అని పరిశీలిస్తారు. మిగతా వైద్యుల్లాగా చెయ్యి నొప్పి పెడుతోందంటే ఝండూబాం రాసుకొమ్మని చెప్పే తరహా కాదన్నమాట. ఎందుకు నొప్పి పెడుతుందని వివరాల లోతుకు వెళ్ళి చూస్తారు. సమస్యకి మూల కారణం శోధిస్తారు. ఏ పార్ట్ లక్షణాన్ని ఆ పార్ట్ అని కాకుండా హోలిస్టిక్ అప్రోచ్ వీరిది. శారీరకంగా, మానసికంగా సమగ్రంగా పరిశీలిస్తారు.

నాకు వీరి గురించి కొంతకాలం క్రితమే తెలిసింది. అయితే మా ప్రాంతానికి దగ్గర్లో వీరు లేరు. కొన్ని నెలల క్రితం ఒక సారి మా (ఇదివరకటి) డాక్టర్ లేకపోవడంతో  కొత్త డాక్టర్ ఉన్నాడు వెళతారా అని ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. వెళ్ళి కలిసాను. అతని అప్రొచ్ నాకు నచ్చింది. తరువాత అతను DO అని తెలిసి సంతోషపడ్డాను. వెతుకుతున్న తీగ కాలికి దొరికింది.  ఇంకేం, ఆ డాక్టర్ నుండి ఈ డాక్టరుకి మారాను. సాధారణ వైద్యపరీక్షలప్పుడు మామూలు రక్త పరీక్షలే కాకుండా అదనంగా విటమిన్లు తదితరాలు ఎలా వున్నాయో కూడా తెలుసుకోవడానికి వ్రాస్తాడు. అలా మా ఆవిడలోనూ, నాలోనూ కొన్ని విటమిన్ లోపాలు బయటపడ్డాయి. ఏవయినా రిజల్టులు రేంజిలోనే వున్నా కూడా మా వయస్సుకు అవి తక్కువ రేంజ్ అనిపిస్తే ఆయా తగ్గుదలలు పెంచడానికి ప్రయత్నిస్తాడు. మా పాత డాక్టర్లు అయితే రేంజిలోనే వున్నాయి కదా అని లైట్ తీసుకునేవారు. 

అయితే ఇతగాడితో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు లేకపోలేదు. శరీరం మరీ పరిశుద్ధంగా వుండాలన్న భావనతో మంచి మంచి డైటరీ సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తాడు. కానీ వాటికి డబ్బు ఎక్కువవుద్దే. డబ్బా, ఆరోగ్యమా అని అడుగుతాడు. ఆరోగ్యమే కానీ... మన దగ్గర అలా ప్రతీ దానికి అన్నన్ని డబ్బులు పెట్టాలంటే వుండాలి కదా. కొన్ని సార్లు వింటాను - కొన్ని సార్లు వినను.  మందులూ, మాకులకు బదులుగా వీలయినంత వరకు  ప్రకృతి సిద్ధమయిన ఆహారం పరిష్కారాలుగా సూచిస్తాడు కానీ అవన్నీ మాకు కుదరొద్దూ.

మీరు కూడా మీ దగ్గర్లో వున్న ని ఓ సారి కలిసి వారి విధానం మీకు నచ్చుతుందేమో చూడండి. వారి గురించి వివరాలకు ఇక్కడ చూడండి.  
You are more than just the sum of your body parts. That’s why doctors of osteopathic medicine (DOs) practice a “whole person” approach to health care. Instead of just treating specific symptoms, osteopathic physicians concentrate on treating you as a whole.

4 comments:

  1. మీరు ఒక "చల్తా ఫిర్తా" మెడికల్ encyclopedia అయిపోయారు ఈ మద్య! చాల రీసెర్చ్ చేస్తున్నారు. మీ "గుర్తుకొస్తున్నారు" చిన్ననాటి స్నేహితులు/స్నేహితురాలు ఫొస్ట్ లు కూడా బాగున్నాయి!

    ReplyDelete
  2. @ జలతారు వెన్నెల
    వున్న ఉద్యోగం ఊడితే, ఇండియాకి తిరిగి వెళ్ళి కూడా సాఫ్టువేరులో ఈదలేకపోతే ఏం చేసి కుటుంబాన్ని పోషించాలా అని అప్పుడప్పుడు సందేహం వస్తుంటుంది. రిక్షా తొక్కి అయినా కుటుంబాన్ని పోషించవచ్చులే అని సమాధానపడుతుంటాను. ఈ మధ్యనే మాంఛి ఆలోచన వచ్చింది, ఎంచక్కా RMP అయిపోతాను :) అప్పటికప్పుడు డాక్టర్ అవాలంటే కష్టం కదా.

    వైద్య విషయాలంటే నాకు కొద్దిగా ఆసక్తి. అయితే మాకు సంబంధించిన విషయాలు వ్రాస్తేనే బావుంటుంది అని అవి మాత్రమే వ్రాస్తాను. ఒక్కో సారి ఒక్కో ఆంశం మీద టపాలు టపటపలాడిస్తుంటాను. ఈమధ్య ఈ రెండు విషయాల మీద పడ్డాను.

    ReplyDelete
  3. మీరు తోక్కాలనుకున్న ఇప్పుడు ఇక్కడ రిక్షాలు లేవు .. ( ఏదో సరదాగా అంటాం కానీ నిజానికి రిక్షా తొక్కడం కూడా మనకు చాత కాదండీ . మనం చేసే పని కన్నా అది చాలా కష్ట మయిన పని )
    సంపాదించింది కొంత క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి కొంత కాలానికి మీ తరపున ఆ డబ్బే సంపాదించి పెడుతుంది .

    ReplyDelete
  4. @ బుద్ధా మురళి
    పోన్లెండి. ఆటో తొక్కి అయినా బ్రతుకుతా. అది వీజీనే కదా. పొదుపూ, పెత్టుబడులూ ఎలాగూ వుంటాయనుకోండి కానీ ఊరికే వుంటే చుట్టూ వున్న ప్రజానీకం ఊరుకోరు కదా.

    ReplyDelete