కైరోప్రాక్టర్ కోసం కొలీగ్ తీసిన నా ఫోటో మరియు విశ్లేషణ

నిన్నటి టపాలో నా చేతులు చల్లబడటం, చేతుల నొప్పి సమస్య గురించి చెప్పాకదా. మా కైరో వైద్యుడు ఆఫీసులో నేను పనిచేస్తుండగా తీసిన ఫోటో పట్రమ్మన్నాడు.  అదీ నాకు తెలియకుండా తీసిన ఫోటో అయితే సహజంగా నేను ఏ పద్దతిలో శరీరాన్ని పెట్టి పనిచేస్తున్నదీ తనకి అర్ధం అవుతుందని చెప్పేడు. నాకు తెలియకుండా నా ఫోటో తియ్యమని నా కోలీగుకి చెప్పాకానీ అతను తీస్తుండగా ఆఖరి క్షణాన అటువేపు చూసేసా. అయినా పర్లేదు లెండి. నా పోస్ సహజంగానే వచ్చింది. 

మీలో ఎవరికయినా ఎర్గానమిక్స్ గురించి అవగాహన వుంటే నేను పనిచేస్తూ నా శరీరాన్ని ఉంచిన విధానంలో ఏవయినా పొరపాట్లు వుంటే ఎత్తిచూపండి. మా కైరో కూడా ఈ ఫోటో చూసి ఆ సలహాలు సూచిస్తాడు. అయితే ఈ ఫోటో కొంత బ్లర్ గా వచ్చింది లెండి. నిన్న ఎర్గానమిక్స్ గురించి చదివి కొన్ని సవరించుకున్నాలెండి. మన చేతుల కన్నా మణికట్లు క్రిందికి వుండాలిట. నేను చేసిన సవరణల వల్లో లేక నిన్న మా కైరో డాక్టర్ చేసిన చికిత్స వల్లో లేక ప్లేసిబొ ఎఫెక్ట్ వల్లో కానీ నా చేతులు ఇవాళ అంత చల్లగానేలేవు, అంత నొప్పీ లేదు! గత కొన్ని వారాలుగా వుంటున్న సమస్య ఈ రోజయితే అంత లేదూ!  

ఇదివరలోనే మా కైరో చెప్పగా పాటించిన కొన్ని సవరణలు మీకు ఇందులో గోచరిస్తాయి. నా వెన్నెముకలోని మెడబాగం కర్వ్ వుండాల్సినంతగా లేదు కాబట్టి నా సిస్టం చాలా పైకి పెట్టుకోమన్నాడు. మానిటర్ క్రింది భాగం నా కళ్ళకు సరిసమానంగా వుండేలా పెట్టుకోమన్నాడు. అందువల్ల నా మెడ భాగం నుండి వచ్చీ వెళ్ళే నరాలకు ఒత్తిడి వుండదని చెప్పాడు. నేను మరీ అంతగా ఎత్తు పెంచలేకపోయాను కానీ సగం అయినా పెంచేసాను. అందువల్ల నా సెర్వికల్ కర్వ్ చాలా మెరుగుపడింది. మరి ఈ ఫోటోలోని కంప్యూటర్ ఎత్తు చూసి మెచ్చుకుంటాడో లేక తిడతాడో చూడాలి.  నేను ఇలా మా కైరోకి దొరికిపోతానని అనుకోలేదు. ఎత్తు పెంచేసావా అంటే ఆహా ఫుల్లుగా పెంచేసా అనే చెబుతూ వస్తోన్నా :(  

ఈ చిత్రం చూసాక నేను కొంచెం ముందుకు వంగి కూర్చుంటున్ననేమో అనిపిస్తోంది. అది సవరించుకోవాలంటారా?

ఇది నా ఆఫీసు గది, ఇది నా ఒక్కడికే ప్రత్యేకం. అప్పుడప్పుడు లంచ్ సమయంలో తలుపులు మూసేసి ఓ ఇరవై నిమిషాలు అలా కునుకూ తీస్తుంటా. ఈ ఫోటోలో అదో ఆ మూలన బుల్లి చెట్టు పక్కన కనిపిస్తోందే... అదే నా జిమ్ము బ్యాగ్. మధ్యాహ్నమే జిమ్ముకి వెళ్ళివచ్చాలెండి.

నా ఆఫీసు గదిని నీటుగానే కాకుండా ఎంతో సింపుల్గా, ఆర్డరుగా ఉంచేస్తానో మీరు గమనించే వుంటారు.

ఎర్గానమిక్స్ గురించి:

22 comments:

  1. ఎవరు తీసారో కానీ ఫోటోలో చాలా స్మార్ట్ గా వున్నారు :-)

    ReplyDelete
  2. @ భారారె
    అంటే ఆ 'స్మార్ట్‌'నెస్ నాదా లేక ఫోటో తీసినతడిదా :)

    ReplyDelete
  3. ఏమో నాకేటి తెల్సు. మీరు చెపితే వింటా :-)

    ReplyDelete
  4. మీరు ఒకసారి ఏదో వనభోజనాల ఫోటో పెట్టారు ....అప్పటికి ఇప్పటికీ కొంచం కొవ్వు పట్టారు........జస్ట్ ఫర్ kidding

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    నిజమే చెబుతూ కిడ్డింగంటారేంటండీ బాబూ. నిజమే అప్పుడు నేను కనీస బరువు 52 కిలోలు నిర్వహిస్తుండేవాడిని అనగా మెయింటేయిన్ చేస్తుండేవాడిని. ఇప్పుడు నా బరువు 56.5 కిలోలు. జిమ్ముకి వెళుతున్నా కాబట్టి బరువు పెంచేసా. నా ఎత్తుకి ఎక్కువలో ఎక్కువ 58 నుండి 60 వరకు వుండవచ్చు. అందుకే 59 వరకు పెంచాలని చూస్తున్నా కానీ నా వల్ల అవడం లేదు. 56.5 దగ్గరే ఆగిపోతూవున్నా. ఎంత తిన్నా కూడా (లైటుగా) జిమ్ము చేస్తున్నా కాబట్టి నా కండరాలే నా కేలరీలు అన్నీ ఖర్చు చేసేస్తున్నయ్.

    ReplyDelete
  6. ఎక్కడ శరత్ వనభోజనాల ఫోటో. ఇంతకు ముందు చూసిన గుర్తు లేదే.

    ReplyDelete
  7. @ భారారె
    ఇక్కడ చూద్దురూ:

    http://sarath-kaalam.blogspot.com/2011/07/blog-post_27.html

    ReplyDelete
  8. మీరిలా ఫోటోలు పెట్టనేల, మేము బాగున్నారు అననేల
    సింహం గారొచ్చి మగాళ్లకి మగాళ్లు నచ్చటం ఏందో అననేల :P

    ReplyDelete
  9. Comments from Chiropractor:
    "Thanks for the quick response:) Question. Where is your mouse located. Also, looks like your chair might need to be adjusted so that you can have a more supported upright posture. You do seem to be leaning back a bit too much. Use of a lumbar support cushion would be advised."

    ReplyDelete
  10. @ అజ్ఞాత
    చూడబోతే మహారాజశ్రీ సింహం గారు నా మీద అలిగినట్లున్నారు. మొన్నామధ్య సరదాగా 'ష్, నన్ను డిస్ట్రబ్ చేయొద్దు' అని నేను కామెంట్ వేస్తే నిజంగానే మడిగట్టుకొని కూర్చున్నారు.

    పోనీ ఓ పంజేయండి. ఓ ఆడపేరుతో నన్ను మెచ్చుకుంటూ కామెంట్ వేద్దురూ - నాకూ తృప్తిగా వుంటుంది.

    ReplyDelete
  11. మా కైరో చెప్పింది విని నా సీట్ అడ్జస్ట్ చేసాను. నా సీటుకి అన్ని రకాలుగా అడ్జస్ట్ చేసుకునే సౌకర్యాలు వున్నాయని నాకిప్పటివరకూ తెలియదు! ఏవో ఒకటో రెండో ఇప్పటివరకూ తెలుసు. నా వెనుక భాగం నిలువుగా వుండేలా, మళ్లీ వెనక్కి నేను జరగకుండా నా సీట్ అమర్చాను. అదే విషయం కైరోకి ఈమెయిల్ చేసి కొద్ది రోజుల్లో మరో ఫోటో పంపిస్తా అన్నాను. ఆ ఫోటో కూడా మీతో షేర్ చేస్తాను.

    ReplyDelete
  12. మీరు సూపర్ స్మార్ట్ గా వున్నారు గురువు గారూ :)
    శ్వేత

    ReplyDelete
  13. మా కైరోకి రెస్పాన్స్ ఇచ్చాక మళ్ళీ తన నుండి వచ్చిన కామెంట్స్:

    "Sounds good:) I really appreciate how proactive you are! Good work!!!!"

    ReplyDelete
  14. I think above anon forgot to add one more line.I guess this will complete it

    " madhyalo nannu phootball aadanela" :p

    any way I did not loose anything. Infact I gained.
    seriously.

    ReplyDelete
  15. @ శ్వేత
    అద్దీ లెక్కా ;)

    ReplyDelete
  16. @ భారారే
    ఈ బ్లాగుకేనా మీ పై కామెంటూ?!

    ReplyDelete
  17. నేను విన్నప్రకారం కంప్యూటర్ మానిటర్ eye level లో వుండాలి అంటారు. మీ కైరో చెప్పినదాని ప్రకారం monitor bottom eye level లో వుండాలి అంటున్నారు.మీ ప్రకారమ్ అడ్జస్ట్ చేసి చూశా నా మానిటర్, చాలా యిబ్బందిగా వుంది. మళ్ళీ దించేశా. మీ body posture ప్రకారం మీకు కరెక్టేమో!... పోతే నా కీబోర్డ్ డెస్క్ మీదే వుంటుంది.. మరి అదేమన్నా ప్రాబ్లమేమో?... కుర్చీ గురించి మీరు చెప్పాక చూశా.. నాదానికి కూడా చాలా options వున్నట్టున్నయ్... ప్రయత్నిస్తా...

    ReplyDelete
  18. Nope, not specific to this blog. I just extended the anon comment with recent trend in blogs.

    ReplyDelete
  19. >> మీరు సూపర్ స్మార్ట్ గా వున్నారు గురువు గారూ :)
    శ్వేత


    ఈ శ్వేత ఎవరు శరత్... మీకు అమ్మాయిలనుంచి ఇంత ఫాలోయింగా.

    నాక్కూడా ఇలాంటి కామెంట్లు ఎన్ని రాశారో కదా :P jk

    ReplyDelete
  20. అబ్బాయ్ శరత్తు,

    మొన్న కినిగే లో ఉరి, నిన్న కినిగే లో నా కన్య ఇవ్వాళ చేతులు చల్ల బడ డాలు ఏర్గోనామిక్స్ .

    ఈ ఏర్గోనామిక్స్ లాంటివి మరిచి, ఆ బందీఖానా ఐన కాబిన్ వదిలి జనసందోహం తో బాటు కూర్చోండి. అన్నీ సర్దుకుంటాయి. అప్పుడప్పుడు జన సందోహం తో మాట్లాడండి. (ఫోన్ లో కాక నేరుగా అన్న మాట). ఇవన్నీ సర్దుకుంటాయి. ఇద క్యాబిను క్యాబేజీ సిండ్రోం. విరుగుడు నో క్యాబిను.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  21. @ పులి
    నా సెర్వికల్ కర్వ్ ని అడ్జస్ట్ చెయ్యడం కోసం మానిటర్ ఎత్తుమీద పెట్టమన్నాడు మా కైరోప్రాక్టర్. అది అందరికీ కాదు. దాదాపుగా అందరి కర్వుల్లో కూడా తేడాలుంటాయి కాబట్టి వాటిని సవరించుకునే ఆసక్తి వుంటే కైరోప్రాక్టర్ని కలవండి. ఇహ ఎత్తుమీద మానిటర్ పెడితే ఇబ్బంది గానే వుంటుంది - ఎందుకు వుండదూ - ఓ మూడు రోజుల్లో ఆ ఎత్తు అలవాటు అయిపోతుంది.

    @ భారారే
    పై కామెంట్లు చూస్తే ఆ శ్వేత ఎవరో అర్ధమయిపోవాలే!

    @ జిలేబీ
    అంతేనంటారా! అయితే మీతోనే మాట్లాడతాను. మీ అడ్రస్సు చెప్పెయ్యండి ... చెప్పెయ్యండి :)

    ReplyDelete