అమ్మకి ఓ సహాయకురాలు కావలయును

75 ఏళ్ళు పై బడ్డ మా అమ్మగారికి ఇంట్లో వుంటూ అన్ని విధాలా చేదోడు వాదోడుగా వుండగలిగే ఒక సహాయకురాలు కావలయును. మా అమ్మగారు హైదరాబాదులో LB నగర్ లో వుంటుంది. తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఈమధ్య కాస్త మతిమరుపు సమస్య మొదలయ్యింది. హైదరాబాదులోనే మా అక్కయ్యలు వుంటున్నా కూడా వారి ఇండ్లల్లో  ఇప్పుడే నివసించడానికి ఇష్టపడటం లేదు. మరీ ఇబ్బంది అయినప్పుడు వెళ్ళి వుంటానులే అంటుంది.

మీకు తెలిసిన పేదవారు, ఆసరా కోసం చూస్తున్న యువతులు, అమ్మాయిలు ఎవరయినా వుంటే వారికి ఇది ఉపయోగపడవచ్చు. తిండి, బట్ట మరియు కొంత డబ్బు ఇవ్వగలము. మీకు ఎవరయినా తెలిస్తే నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com కి మెయిల్ ఇవ్వండి. ఇంకా ఏమయినా సమాచారం కావాలంటే కామెంట్ అయినా మీరు ఇవ్వొచ్చు.

10 comments:

 1. easy kaademo sarath gaaru

  ReplyDelete
 2. @అజ్ఞాత
  తెలుసు - కానీ ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా - ఓ టపా తప్ప - అందుకే ఇలా.

  అమ్మక్కడ - నేనిక్కడ. నచ్చట్లేదు కానీ తప్పట్లేదు. వచ్చే ఏడాది ఇక్కడికి రప్పిస్తాను. అంతవరకూ అవసరం అయితే అక్కయ్యలు వున్నార్లెండి.

  ReplyDelete
 3. India lo paperlo kaani, yedhanna webistes lo kaani advertise cheste phalitam undochemo sarath garu. Good luck!

  ReplyDelete
 4. ee madhya vinnanunu nenu kuda,red cross vallani kanukunte valle erpatu chestarani , chala trust worthy kuda, i am also trying for my mother which is bed ridden

  ReplyDelete
 5. red cross vallu ee vishayam lo meeku sahaaya padagalaru ani vinnanu , try cheyandi oka sari

  ReplyDelete
 6. మీ "అమ్మకి ఓ సహాయకురాలు కావలయును" పోస్ట్‌పై kmpin72003 క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  hello sir,nenu l.b.nagar,sri ramakrishna puram lo untanu.I think I CAN DO SOME SERVICE ON BEHALF OF YOU.Mail me at {Edited]--Ln krish

  ReplyDelete
 7. @ జలతారువెన్నెల
  ఇప్పుడు మరీ అర్జెంటేమీ కాదు గానీ అవసరం అయితె ఆ ప్రయత్నాలు కూడా చెయ్యాలి. ధన్యవాదాలు.

  @ అజ్ఞాత, అజ్ఞాత
  ధన్యవాదాలు. రెడ్ క్రాస్ వారిని కనుక్కొని చూస్తాము.

  ReplyDelete
 8. @ క్రిష్
  మీరు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. అయితే తన బయటి పనులకి ఇప్పటికయితే పెద్దగా ఇబ్బందేమీ లేదు. బంధుమిత్రులూ, పొరుగువాళ్ళూ వున్నారు. తనతో పాటే నివసించే మహిళ అయితే అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా వుండటమే కాకుండా కాలక్షేపంగా, ఒక తోడుగా వుంటుందని అమ్మ చూస్తోంది. మీ ఈమెయిల్ ఐడి భద్రపరచుకుంటాను. అవసరం అయినప్పుడు సంప్రదిస్తాను. మీకు మెనీ మెనీ థేంక్స్.

  ReplyDelete
 9. happy journey sarath gaaru,

  ReplyDelete
 10. @ అజ్ఞాత
  ధన్యవాదాలండీ. ప్రస్తుతం డెట్రాయిట్ చేరాం. ఇక్కడ మిత్రులతో గడిపి ఎల్లుండి కెనడా వెళతాం.

  ReplyDelete