నా జ్యోతిష్యం - భావి భారత ప్రధాని అఖిలేశ్

ఒహవేళ నేను ఊహించింది ఎప్పటికయినా నిజమయితే కనుక అప్పుడు ఈ టపాని రిపబ్లిష్ చేసి ఎప్పుడో నే చెప్పానహో అని చంకెలెగరొయ్యొచ్చు. నిజం కాకపోతే గప్‌చిప్గా టపా తీసెయ్యొచ్చు.  అప్పటికి మీకు ఈ టపానే గుర్తుండదూ. 

అఖిలేశును చూస్తుంటే ముచ్చటేస్తుంది. మాంఛి తెలివితేటలు, సమర్ధత, మంచితనం వున్నవాడనిపిస్తుంది. అతని ముఖం కూడా తాజాగా, ఆకర్షణీయంగా వుంటుంది. భారత రాజకీయ యవనిక మీద వెల్లివిరిసిన ఈ కొత్త పుష్పం తన సుగంధసౌరభాలని ఇలాగే వెల్లివిరుస్తుంటుందని నాకయితే ఆశావహంగా వుంది. అతనితో పోలిస్తే యువరాజా రాహుల్ గారి వ్యక్తిత్వం వెలవెలబోయినట్లే అనిపిస్తోంది. అతనింకా తల్లిచాటు బిడ్డగానే అనిపిస్తోంది. మొత్తమ్మీద 'యువరాజా గర్వభంగం' అయిపోయింది. లేకపోతే దేశాన్ని పాలించడానికి తమ కుటుంబం తప్ప వేరే ఎవరూ పనికి రాడంటాడా?    ఇదివరలో యువరాణి ప్రియాంకా అంటే కాస్త ఆసక్తి కలిగేది, ఏదో ఇందిరమ్మని చూసిన అనుభూతి కలిగేది కానీ ఈమధ్య నాకయితే అలా అనిపించడం లేదు.  

ఉత్తరప్రదేశ్ తాజా రాజకీయాల్ను మన రాష్ట్రంలో అన్వయించి చాలామంది లోకేషుకూ, అఖిలేశుకూ పోలికలు చేస్తున్నారు కదా. నాకయితే ఇప్పటివరకూ లోకేశ్ ప్రదర్శించిన వ్యక్తిత్వం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. ముఖం కూడా జిడ్డు ముఖంలా అనిపిస్తుంది. నగదు బదిలీ పథకం వెనుక అతగాడే అని అర్ధమయ్యాక అతని మీద వున్న కొద్దిపాటి గౌరవం కూడా తగ్గింది. పైగా పేదలకు డబ్బులు ఇచ్చే ఆ మా గొప్ప పథకం స్టడీ చెయ్యడానికి విదేశాలకు వెళ్ళొచ్చాడని తెలిసాక ప్చ్ అనిపించింది. ఆ మాత్రం తేరగా డబ్బులు పంచే తెలివితేటల కోసం హక్కడిదాకా వెళ్ళి రెసెర్చ్ చెయ్యాలా? నన్నడిగితే నే చెప్పనూ? నా అభిప్రాయంలో అయితే ఇతగాడికంటేనూ అతని భార్య బ్రాహ్మిణి చాలా బెటర్ అనిపిస్తుంది. బాలక్రిష్ణ కూతురయిన బ్రాహ్మిణి ముఖంలో ఏదో తేజస్సు తెలివితేటలూ ఉట్టిపడుతుంటాయి. చంద్రబాబునాయుడు కొడుకుకంటే కోడలిని రాజకీయాల్లొకి తీసుకువస్తే బ్రాహ్మిణి ప్రభావం వలన బ్రహ్మాండమయిన ఫలితాలు వుంటయ్ కానీ వారంత గొప్పగా ఆలోచించలేరులెండి. 

ఇహ మన రాష్ట్ర యువనేత సంగతి తీసుకుంటే అతన్ని కాంగ్రెస్సులోకి తీసుకోవడం తప్ప ఆ పార్టీకి గత్యంతరం లేనట్లుంది. ఉప ఎన్నికల తర్వాత ఇంకా స్పష్టత వస్తుంది కదా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో  ఇక్కడ జగనూ, అక్కడ అఖిలేషూ స్వైరవిహారం చేస్తే ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ఏమయినా కొద్దిగా సీట్లు సాధిస్తే జగన్ ఆసరా మీద ఆ పార్టీ అధికారంలోకి రావచ్చేమో. అప్పుడు యువనేతవారి కరుణా కటాక్షాలు ఎవరివైపు వుంటాయో ఎవరికి తెలుసు. ఏమో, అప్పుడు జగను కనుక నక్కతోకని తొక్కినట్లయితే ప్రధానమత్రి పదవికి తను కూడా అభ్యర్ధులను సూచించే కెపాసిటీలో వుండొచ్చు. అప్పుడు అఖిలేష్ వాళ్ళ నాన్న ములాయమ్ని ప్రతిపాదిస్తే ఇతగాడు తన అమ్మగారు విజయమ్మని ప్రతిపాదించవచ్చు. ఏమో, భవిశ్యత్తు చిత్రపటాన్ని ఎవరు పక్కాగా చిత్రీకరించగలరూ? ఈలోగా జగను అరెస్టు కావచ్చు కదా అంటారేమో - అలా అయితే అతని పార్టీకే మంచిది కదా. సానుభూతి పవనాలంటూ వుంటయ్ కదా. ఏమాత్రం గాలి అటువైపు వున్నా కూడా ఇది కూడా తోడయ్యి అది రాష్ట్ర ఎన్నికల వాతావరణంలో పెద్ద తుఫానే సృష్టించగలదు. 

అలా ములాయం ప్రధాని అయితే అప్పుడు అఖిలేషుకి యువరాజాగా గౌరవం దక్కుతుంది కాబట్టి తదుపరి ప్రైం క్యూలో అతనే ముందుంటాడు. అలా కాకుండా అప్పటికి జగన్ కెపాసిటీ కూడా బావుండి ఇతర పార్టీలు కలిసివస్తే మన యువనేత కూడా ఉత్సాహపడుతుండొచ్చు. అతనికెలాగూ రాహుల్ని ఓ ఆట ఆడిచాలని మాహా ఆరాటంగా వుందని చూచాయగా అర్ధమవుతూనేవుంది. జరిగేది జరుగుతుంది కానీ మన ఊహాగానాలు మనం చేద్దాం. ఏమో, రాజకీయాలల్లో ఏదయినా జరగవచ్చూ - కాదనగలరా?!
ఇప్పుడే అఖిలేశ్ ఫోటోల కోసం వెతుకుతుంటే అతని భార్య డింపుల్ ఫోటోలు కూడా కనిపించాయి. ఆమె గురించి తెలిసినా కూడా ఆమెను చూడటం ఇదే ప్రధమం. ఎంత బావుందీ! అందుకే నా జ్యోతిష్యాలని అర్జంటుగా సవరిస్తున్నా. డింపుల్ కానీ, అఖిలేష్ కానీ ఇండియా ప్రైం మినిస్టర్ అవుతారు. అవుతారు బాబు గారూ, తప్పకుండా అవుతారు. ఖళ్..ఖళ్..

9 comments:

 1. మీరు శానా బెటరండీ బాబూ, భావి ప్రధాని గురించి చెప్పారు. మన్మోహన్ సింగు ప్రధాని అవుతాడా లేదా అని కాకుండా..!! సరదాగా నాలుగు చక్రాలూ, గల్లూ గీయొచ్చుగా మా తుత్తి కోసం. :-)

  ReplyDelete
 2. @ శ్రీకాంత్
  అలా ఛక్రాలూ, గళ్ళూ గీస్తే మన అప్పి శాస్త్రి లాంటి బ్లాగు జ్యోతిష్యులకు నా మీద మండిపోయి నన్ను శపించెయ్గల్రు - వారికి పోటీ అవుతున్నా అనుకొని. అందుకనే జ్యోతిష్యంలో కాస్త లో ప్రొఫయిల్ మెయింటెయిన్ చేస్తున్నా.

  ఇప్పుడే మీ బ్లాగులో రేప్ ఫిర్యాదుల గురించిన టపా చూసి ఇటొచ్చా - ఎందుకో అక్కడ కామెంట్ వెయ్యలేదు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా. అవును, అందరూ నిజాలు చెప్పాలని లేదు.

  ReplyDelete
 3. Good one and a different one from you :)
  But why did you remove your three previous posts.

  ReplyDelete
 4. There is a nice article written by MBS Prasad for Greatandhra about the differences between Akhilesh and Rahul/Lokesh. Undoubtedly, Akhilesh is an appropriate choice for CM post in UP. He was successful in changing the party's manifesto and encouraging the youth in politics. Being an educated politician, he supported the importance of English and computer science knowledge for higher education. We should appreciate Muayam for giving his son all the rights and powers to lead the party. No way Rahul and Lokesh are comparable with him.

  ReplyDelete
 5. అఖిలేష్ బాబు మీకోసం వెతుకు తున్నాట్ట, తనకి పబ్లిసిటీ మానేజర్ కోసం వెంటనే వారికి ఓ కాలు కొట్టండహో శరత్తు గారు.

  జిలేబి.

  ReplyDelete
 6. బ్రాహ్మణి బొట్టు పెట్టు కోలేదు ఎందుకో ? రాజకీయాల్లోకి రావాలనుకుంటే అన్నీ చూసుకోవాలి

  ReplyDelete
 7. @ అజ్ఞాత @ 12 మార్చి 2012 12:38 సా
  1. స్ఖలించాక తుడిచేసుకోమూ, కడిగేసూకోమూ? ఇక్కడా అంతే నా బ్లాగులో మనస్ఖలించాక, ఆ అవసరం తీరిపోయాక ఆయా టపాలని తుడిచేసుకుంటాను. లేకపోతే నా బ్లాగు గబ్బుకొట్టిపోతుంది.

  2. అప్పుడు నా వ్రాతల గురించి నాకే ధర్మ సందేహలు వస్తుంటయ్. నేను మాంసం తింటానని చెప్పుకోవడం వేరూ, మటన్ ముక్కలు మెడలో వేలాడేసుకొని తిరగడంవేరూ. నేను రెండో రకంగా వున్నానేమో అని నా అంతరాత్మ గొణిగితే ఎందుకయినా మంచిదని డ్రాఫ్టులుగా సేవ్ చేసిపెట్టా. నాకు నేనే మోనార్కుని, సుమన్ ని అయినా కూడా కనీసం నా అంతరాత్మ చెప్పినట్లయినా అప్పుడప్పుడయినా వినాలి కదా. మళ్ళీ నా అంతరాత్మకి ఎప్పుడయినా జోలపాట పాడి మళ్ళీ అలాంటివి వ్రాయనని ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు నాకు ఇలా హఠాత్తుగా జ్ఞానోదయం అయిపోతుందంతే.

  ReplyDelete
 8. @ సిద్ధార్ధ్
  MBS వ్యాసాలు నేనూ చదువుతుంటాను. మీరు చెప్పినవి కూడా చదివాను. అఖిలేశ్ పై అతని అభిప్రాయాలతో ఏకీభవిస్తాను.

  @ జిలేబీ
  :)
  సూస్తా వుండండి. సోనియమ్మ, రాహులన్న సంగతేమో గానీ ములాయమ్మో లేక మన విజయమ్మో 2014 లొ ప్రధానం అవుతారు.

  @ అజ్ఞాత
  మీరు అనే దాకా బ్రాహ్మిణి బొట్టు విషయం గమానించలేదండీ. మైనారిటీ మతస్థుల కోసమని పెట్టుకోలేదేమో!

  ReplyDelete
 9. శరత్ కాలం జీ.. లోకేష్ విషయంలో మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు దగ్గరగా వున్నాయి.

  ReplyDelete