No Higher Honour

తాను జాతీయ భద్రతా సళాదారుగానూ, విదేశాంగ మంత్రిగానూ పని చేసిన రోజుల గురించి కండొలిజా రైస్ వ్రాసిన నో హయ్యార్ ఆనర్  పుస్తకం నాకయితే బాగా నచ్చింది. ఆ విషయాలన్నీ సెప్టెంబర్ 11, 2001 వ సంఘటణకి ముందూ, వెనుక మరియు ఆ రోజుకి సంబంధించినవి కావడంతో ఉత్కంఠభరితంగా వుంది. కొద్దిరోజుల క్రితం శాంస్ క్లబ్బుకి వెళితే  $35 పుస్తకం $20 కే అని వుంది. కొద్దిసేపు మనస్సులో తర్జనభర్జన పడి మొత్తమ్మీద ఆ పుస్తకం కొనేసాను.

ఆ మధ్య కొన్ని పుస్తకాలు కొన్నా కూడా చదవలేకపోవడంతో ఇహ పుస్తకాల మీద నాకు ఆసక్తి సన్నగిల్లిందేమో అనుకున్నా. వాటిని చదివేంత తీరిక కూడా దొరక్కపోవడంతో ఇహ పుస్తకాలు చదివే కార్యక్రమం ఇంతేలే అని సరిపెట్టుకున్నా. అయితే ఈ పుస్తకం చదువుతుంటే నాకు అర్ధం అయ్యిందేమిటంటే ఆసక్తికరమయిన పుస్తకమే అయితే గనుక తీరిక దానంతట అదే దొరుకుతుందని :)

భద్రతా విషయాలలో యు ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, వారిలో పొరపొచ్చాలు, పొరపాట్లూ ఎలా జరుగుతుంటాయి  మొదలయిన విషయాల మీద ఆసక్తి వుంటే ఈ పుస్తకం మీరు ఎంచక్క చదివెయ్యొచ్చు. అంతేకాకుండా 9/11 సంఘటణ జరిగినప్పుడు తెరవెనుక ఏం జరిగింది, ప్రభుత్వ పెద్దలు ఎలా పనిచేసారు అనే విషయం మీద ఆసక్తి వున్నా ఈ పుస్తకం చదివెయ్యొచ్చు. ఈ పుస్తకంలో చాలాసార్లు ఇండియా గురించి వుండటం సంతోషంగా అనిపించింది. అయితే అదే సమయంలో నా దేశం అయిన కెనడా గురించి ఎక్కువగా లేకపోవడం నిరాశ పరిచింది.  అయితే నేను ఇప్పటిదాకా చదివింది కొంతేలెండి. ఓ వంద పేజీలు చదివా. రోజూ చదివేస్తూనే వున్నా. 

9/11 తదనంతర మార్పులని రైస్ ఎంతగా సమర్ధించుకున్నా అవన్నీ అతిభయంతో విచక్షణ కోల్పోయి చేసినవిగా ఆ పుస్తకం చదువుతుంటే మనకు అర్ధమవుతూనే వుంటుంది. అంతస్థాయి వాళ్ళు కూడా, అంత మంది కూడా గ్రవుండ్ రియాలిటీని కోల్పోయి అంత తేలిగ్గా భయభ్రాంతులవడం మనకు గోచరిస్తూనేవుంటుంది. ఒకరోజు ఆల్కైదా వాళ్ళు న్యూక్లియర్ బాంబులు వేస్తారేమో అని  వైట్ హవుజ్ అంతా కంగారు పడుతుంది. ప్రెసిడెంటుని బంకరులోకి వెళ్లమని రైస్ సూచిస్తే లం.. కొడుకు ఎవడయినా సరే వాడిని ఈ ఓవల్ ఆఫీసులోనే కలుస్తా అని బుష్ ఘీంకరించేసరికి తన టైం బావోలేదని, ప్రెసిడెంట్ మూడ్ బావోలెదని రైస్ అక్కడినుండి మెల్లగా జారుకుంటుంది.   

9/11 జరిగిన రోజు రాత్రి పూట కూడా విమానదాడి జరగబోతున్నట్లుగా అలారం వస్తే నైట్ డ్రెస్సులోనే బుష్ బంకరులోకి వెళ్ళాల్సి వస్తుంది. అది పొరపాటు హెచ్చరిక అని అర్ధం అయ్యాక సీక్రెట్ సర్వీసు వాళ్ళు ఆయన్ని అక్కడే పడుకొమ్మంటారు. 1960 ల్లోని పాత సోఫా ఒకటి గుంజి ఆయనకు పడకవేస్తారు. దాన్నో సారి బుష్ చూసి తనవల్ల కాదని బంకరు లోంచి జారుకోవడం, అతనివెంటే పోలోమ్మంటూ ఇతరులూ జారుకోవడం నవ్వు తెప్పిస్తుంది.

4 comments:

 1. interesting గా ఉంది.. మరిన్ని విషయాలు పుస్తకం లోంచి అప్పుడప్పుడూ మాతో పంచుకోండి... మేమెలాగూ డబ్బులు పెట్టి కొనం....కొన్నా చదవమ్..చదివినా అంతగా అర్ధం కాకపోవచ్చు...

  ReplyDelete
 2. @ kvsv
  అలాగేనండీ. అప్పుడప్పుడు ఆ విశేషాలు నేను అందిస్తూవుంటే చదవడానికి నాకూ ప్రోత్సాహకరంగా వుంటుంది.

  ReplyDelete
 3. పుస్తకం బాగున్నట్లుందే. టొరెంటో మరోటొ దొరికితే download చెయ్యాలి.

  ఈమధ్య ఓక్ వీడియో చూస్తున్నప్పుడు (ఫారన్‌హీట్ 9/11 అవునో కాదో తెలీదు) తీవ్రవాదులదాడులు జరిగినప్రతిచోటా( అమెరికా, బ్రిటన్, స్వీడన్) అదేరోజు సరిగ్గా అదే సమయానికి అదే theamతో తీవ్రవాదుల దాడి ఎదుర్కోవడానికి mock drill నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇన్నిసంఘటనలు coincidenceలుగా నమ్మడం నావల్ల కావడంలేదు.

  ReplyDelete
 4. @ మినర్వా
  ఫారెన్ హీట్ కొన్నేళ్ళ క్రితం చూసినందువల్ల మీరు చెప్పిన విషయం గుర్తుకులేదు. జార్జ్ బుష్ 'డెసిషన్ టైమ్స్' కూడా తెప్పిస్తున్నా. రైస్ మీదా, బుష్షు మీదా నాకు అభిమానం ఏమీ లేదు కానీ ఆయా రోజుల్లో వారి యొక్క ఆలోచనా విధానం, ధోరణి ఎలా వుండేది అన్న విషయంలో ఫస్ట్ హ్యాండ్ సమాచారం మీద నాకు ఆసక్తి వుంది.

  ReplyDelete