ఇంటర్నెట్టుని కనీస హక్కుల్లో ఒకటిగా రాజ్యాంగంలో చేర్చాలి!

ఈమధ్య హైకోర్టో, CBI కొర్టో ఒకరికి జైల్లోకి లాప్టాప్ తెచ్చుకోకూడదని తీర్మానించింది కదా. హెంత దారుణం, హెంత దారుణం. లాప్టాప్ లేకపోతే ఇక నెట్టెలా? ఈ కాలంలో మానవజీవి ఊపిరి లేకపోయినా బ్రతగ్గలడు కానీ  ఇంటర్నెట్టు లేకపోతే బ్రతగ్గలడా?  అంచేత ఆ కోర్టు నిర్ణయాన్ని ఖండిచ్చేద్దాం.  ఏమంటారు?  ఇంటర్నట్టనేది కనీస మానవహక్కు. కనీసం అది కూడా జైలుపక్షులకి  అందివ్వకపోతే ఎలా? నెట్టు గాలి వీయకపోతే ప్రాణం విలవిలలాడి అల్లాడిపోదూ?  

పదేళ్ళ క్రితమే ఓ ఇంగ్లీష్ కార్టూన్ చూసాను. అందులో  ఓ తాతా మనుమడూ ఆదిమమానవుల వస్త్రధారణతో  రాళ్ళు చెక్కుతూ కనిపిస్తారు. తాత మనుమడితో ఇలా చెబుతుంటాడు "ఒక రోజు అకస్మాత్తుగా ప్రపంచం అంతటా ఇంటర్నెట్టు ఆగిపోయింది..."   అందులోని భావం అర్ధం అయ్యిందనుకుంటాను :))  మనం ఓ చిన్ని పోల్ పెట్టుకుందాం. మీరు ఈ లిస్టులో దేనికి అధిక ప్రాధాన్యం ఇస్తారేం. 1. భార్య/భర్త/ప్రేయసి/ప్రియుడు 2. దిన పత్రిక 3. ఇంటర్నెట్టు 4. టివి 5. శరత్ కాలం బ్లాగు (హిహీ).  పైవాటిల్లో వేటిని విడిచి బ్రతగ్గలరు? చుట్టూచూసుకోకుండా భార్య అని కామెంటు వెయ్యకండి - మీ నెత్తిన మొట్టికాయో, జెల్లకాయో పడగలదు. సరే ఇంకో పోల్. 1. గాలి, 2. వెలుతురు, 3. నీరు 4, నిప్పు 5. ఉప్పు 6. ఇంటర్నెట్టు. వీటిల్లో దేన్ని విడిచి బ్రతకలేరు? మీరేం చెబుతారో ఏమో గానీ తాజా జెనెరేషన్ని అడిగి చూడండి. మా పెద్దమ్మాయిని అడిగితే సందేహం లేకుండా నెట్టు విడిచి బ్రతకలేనంటుంది!   

ఆ మధ్య ఎక్కడో చదివాను. ముందు ముందు ప్రజలు ఎక్కడ నివసిస్తారు అని అనుకుంటున్నారు? చంద్రమండలం మీదనా? గురు గ్రహం మీదనా? కాదు కాదు. ఇంటర్నెట్టు మీద జీవిస్తారు! అవును అడవుల నుండి పల్లెలకూ, పట్టణాలకూ, అమెరికాలకూ జనాభా ప్రాకింది. ఇహ చంద్రమండలం మీద ముందు ముందు ప్రజలు నివసించబోతారు అని అనుకుంటాం కానీ అది తప్పు. ఇప్పటికే ఇప్పటి యువతరం నెట్టులో  జీవించడం మొదలెట్టారు! సందేహమా? ఓ సారి మీ టీనేజీ పిల్లలని చూడండి. ఇండియాలో యువతరం పరిస్థితి ఎలా వుందో తెలియదు కానీ యు ఎస్ యువతకి ఫేసుబుక్కు లేకుండా ఫేస్ వుంటుందా? ఫేసుబుక్కులో ఎక్కవుంట్ లేని నాలాంటి వారిని నెట్టు వృద్ధులుగానూ, ఆదిమమానవులుగానూ ఈ యువత పరిగణించే ఆస్కారం వుంది.  అదయినా సంతోషమే - అసలే మనిషిగా గుర్తించకపోతే మరీ కష్టం.  

అంచేతా... యావన్మందీ బ్లాగు ప్రజలకు నేను చెప్పొచ్చేదేమిటంటే జైల్లోకి లాప్టాప్ కావాలన్న ఆ పెద్ద మనిషికి మనం పెద్ద మనస్సు చేసుకొని నైతిక మద్దతు ప్రకటిద్దాం. అలా అది ఇవ్వకపోతే కనీస హక్కులను కాలరాయడమే అని గుర్తిద్దాం. రాజ్యాంగ సవరణ చెయ్యాలని గొంతెత్తి అరుద్దాం. ఏరీ మానవహక్కుల బ్లాగర్లూ? ఇంత ప్రధానమయిన ఆశం గురించి వారు పట్టించుకోరేం? కాకపోతే గాలి, వెలుతురూ, నీరూ, నిప్పు వగైరాలు తగ్గించి అయినా వైర్లెస్ నెట్టు గాలి ధారాళంగా జైల్లో వీచే అవకాశం ఏర్పరచాలని డిమాండ్ చేద్దాం. అంచేతా ఈ ప్రధానమయిన విషయం మీద మిగతా బ్లాగర్లు అందరూ కనీసం ఒక పోస్టు అయినా వేసి ఆ జైలు పక్షి కనీస కోర్కెకు మద్దతు పలకాలని నేను డిసైడు చేసిన.

7 comments:

  1. Annay....Vadu Internet lo Porn Videos chusthe kastam kada ani ivvaledu anthe.Vadu edo podichesthadu ani kadu......:) :) :)

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    వార్నీ ఆ అనుమానంతో కూడా ఆపేస్తారా! ఏదో వృద్ధనారీ పతివ్రతలు, సతివ్రతుడులు తప్ప ఇంటర్నెట్టులో పోర్ను చూడ్డమే మానవుల ప్రధమ కర్తవ్యం కాదా? అయితే ఆ ఆంశం మీద కూడా మనం ఆందోళన చెయ్యాల్సిందే. అది కూడా కనీస హక్కుల జాబితాలో పెట్టాల్సిందే. లేకపోతే నేనొప్పుకోను.

    ReplyDelete
  3. India lo teenage pipllalu tooomuch day/night 24X7 face book update chestharu . i don't when they will do other things..

    ReplyDelete
  4. నేనుకూడా పంచభూతాల్ని మళ్ళీ ఎన్నుకొనమనని జనాల్ని ప్రోత్సహిద్దామనుకుంటున్నా (ఆమధ్య ప్రపంచవింతల్ని ఎన్నుకున్నామే అలాగన్నమాట). అలా ఎన్నుకుంటే ఇంటర్నెట్టూ, సెల్లుఫోనూ ఖచ్చితంగా ఆ జాబితాలో ఉంటయని నా ప్రగాడ విశ్వాసం.

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    ఇండియాలో కూడా అంతేనా టీనేజీ లేజీ పిల్లల సంగతీ! కాలకృత్యాలూ, తప్పనిసరి తద్దినం లాంటి చదువూ తప్ప ఇంకా పెద్దగా ఏం చెయ్యగలుగుతారులెండి. ఏమన్నా అంటె వారి యొక్క కనీస హక్కునేదో దూరం చేస్తున్నట్లు గొడవ చేస్తారు.

    @ మినర్వా
    పంచభూత్ వర్శన్ 2 నా :) మీ ఆలోచన బావుంది :)

    ReplyDelete
  6. నేను కాలకృత్యాలకు కూడ లాప్టోప్ పట్టుకెల్తా :-)) మామూలుగా వార్తలు, ఇ-మెయిల్....అప్పుడప్పుడు పోర్న్ :-))
    అంతకు ముందు మన దేశంలొ ఉన్నప్పుడు పేపర్ పట్టుకెళ్ళేవాడిని !

    ReplyDelete
  7. @ గాలి
    నేనూ నా నెట్‌బుక్ పట్టుకెళుతూవుంటా. అందుకే నా నెట్‌బుక్ పట్టుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళు కాస్త సంకోచిస్తుంటారు :)) ఎవరి లాప్‌టాపులు/టాబ్లెట్లు వాళ్లకు వున్నాయి కాబట్టి నా సిస్టం అవసరం వాళ్లకు అంతగా రాదులెండి.

    ReplyDelete