పులీ... మీకో ధన్యవాద్!

కొద్ది రోజుల క్రితం వ్యాయామంలో వెయిట్ ట్రైనింగు పై అస్త్రసన్యాసం చేస్తూ ఓ టపా ఇచ్చాను. అది ఇక్కడ చదవచ్చు. దానికి పులి అనే పేరిట ఒకరు స్పందించారు.
 
"శరత్,
మీ ప్రొటీన్ ఇన్ టేక్ ఎలావుంది? మనం రోజూ యింట్లో తినే తిండితో సరిపడేంత ప్రొటీన్ రాకపోవచ్చు. మీరు చెప్పిన బరువులతో చెసే వ్యాయామాలు మీ వయసుకు కూడా ఎక్కువేమీ కాదు. ఇంకేదో సమస్య వున్నట్లుంది. Dr.Google ని పూర్తిగా నమ్మి self diagnose చెయ్యడం మరీ మంచిది కాదేమో? "

ఆ సలహా నాలో మళ్ళీ ఆలోచనకు పురికొల్పింది. కొత్త ఉత్సాహాన్ని నింపింది. నాలోని లోపాలని నాకు తెలిసినవే అయినా ఎత్తి చూపింది. మనం ఎదుటివారిని మెచ్చుకోవడానికి వారేమీ నీళ్ల మీద నడవఖ్ఖర్లేదు. చిన్నచిన్న విషయాలకి కూడా మనం ఇతరులని ధారాళంగా, హృదయపూర్వకంగా ప్రశంసించగలగాలి. అందుకే ఈ టపా. ఆ పులి గారెవ్వరో, ఎక్కడ వుంటారో, ఏం చేస్తుంటారో నాకు తెలియదు. నేను ఈ విషయంలో డవున్ అయినప్పుడు నన్ను తట్టి మార్గదర్శకత్వం చేసారు, ఉత్సాహపరిచారు.  ఇలా నా టపాలు పాజిటివ్ ఇంటెరాక్షంతో వుంటే సంతొషంగా అనిపిస్తుంది. నా టపాల్ నాకు గానీ, ఇతరులకు గానీ ఉపయొగకరంగా వుంటే బావుంటుంది.

వ్యక్తిత్వవికాసపు పుస్తకాల్లో డేల్ కార్నెగీ వ్రాస్తూ మనం ప్రశంసల్లో ధారాళంగానూ, విమర్శల్లో మితంగానూ వుండాలంటాడు. మనం నిత్యజీవితంలో దానికి వ్యతిరేకంగా చేస్తుంటాము. మనం ఎవరినయినా తిట్టాలనుకున్నప్పుడు బాగా మాటలు వచ్చేస్తాయి. ఎవరినయినా మెచ్చాలనుకున్నప్పుడు నోరు పెగలదు. కొంతమంది ఇతరులని భలే మెచ్చుకుంటారు. వారి యొక్క ప్రజ్ఞను చూస్తే ముచ్చటేస్తుంది. నాకలా సులభంగా మెచ్చుకొవడం అస్సలు రాదు. ఇంట్లో కూడా అంతే, పిల్లల్ని భలేగా మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తుంటాను కానీ మా ఆవిడని మెచ్చడానికి పెద్దగా ఏమీ గుర్తుకురావు!

నిజవే. నేను ప్రొటీన్ తీసుకోవడం తక్కువే అని తెలిసినా సరిగా శ్రద్ధ తీసుకోలేకపోయాను. ఇప్పుడు ప్రొటీన్ పాలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాను. ఇంట్లో కూడా ప్రొటీన్ పదార్ధాలు ఎక్కువ చేస్తున్నా. మళ్లీ నాకు ఎదురవుతున్న సమస్యపై నెట్టులో గాలించాను. దానికి పరిష్కారంగా ఉదయమే అలాంటి వ్యాయామాలు చేస్తే రాత్రి చక్కగా బజ్జోవచ్చని కొంతమంది సలహా ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నమే చేసినప్పటికీ ఈ వ్యాయామం ఉదయానికి మార్చేలా ప్రయత్నిస్తున్నాను. 

నాకు డాక్టర్ గూగుల్ చాలా ఉపయొగపడుతోంది. అందువల్ల ఓ సమస్య ఎదురుకావచ్చు. మనం హైపోకాండ్రియాక్స్ అయిపోవచ్చు. అలా అని నెట్టులో వ్రాసినదంతా నిజమని  నమ్మితే బోర్లాబొక్కల పడతాము అని కూడా తెలుసు. డాక్టర్ గూగుల్ తో నా అనుభవాలను గురించి మరోసారి వ్రాస్తాను.

పులీ, థేంక్స్ ఎగైన్! మీ పులి పేరు చూస్తే నాకు అప్పట్లో వున్న 'పులి రాంబాబు' నిక్ నేం గుర్తుకు వచ్చింది :) ఆ కథా కమీషూ నా బ్లాగులో వెతికితే దొరుకుతుండొచ్చు.

2 comments:

  1. I think its Puli Raja....Not Puli Rambabu....

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    హ హ. అప్పటికి పులి రాజా వారు ఇంకా అవతరించలేదులెండి. వారొచ్చేకా మీలాగే కొంతమంది నాకు ఆ పేరూ సరదాగా పెట్టేరు లెండి.

    ReplyDelete